Tuesday 3 April 2012

ధృడ చిత్తం

బాబు: అమ్మా ఆడుకోవటానికి వెళతా !
అమ్మ: ముందు హోం వర్క్ చెయ్యి,తరవాత వెళుదువు గాని ....
బాబు: ప్లీజ్ అమ్మా ,కొంచం సేపే!
అమ్మ: సరే,వెళ్ళు త్వరగా వచ్చేయాలి.
ఎక్కుపెట్టిన బాణం లా రివ్వున దూసుకు వెళ్లి పోయాడు.
కొంచం సేపే అన్నవాడు గంటా,రెండు గంటలు అయినా రాడు.అమ్మ వెళ్లి బలవంతం గా లాక్కు రావాల్సిందే!
అమ్మ కోపం గా....ఇక రేపట్నుంచి ఆటలకు పంపించేది లేదు అంటుంది కానీ,మళ్ళీ మరుసటి రోజు మామూలే!సేం సీన్ రీపీట్ అవుతుంది.


టి.వి.ఎక్కువ సేపు చూడకూడదు.ఇక లే,చదువుకో!

ప్లీజ్ అమ్మా,కొంచం సేపే,ఈ ఒక్క కార్టూన్ చూస్తా.అది అలా కొనసాగుతుంది.అమ్మకు ఒక స్టేజ్ లో చిరాకు వచ్చేవరకు.....

అమ్మలకు సాధారణం గా ధృడ చిత్తం తో వ్యవహరించటం చేతకాదు.

ఇంట్లోనివారితోనే కాదు,మన చుట్టుపక్కల వారితో కూడా,మనలో చాలామందిమి ధృడచిత్తంతో వ్యవహరించలేము.మనం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేము.ఎదుటి వారి ని నొప్పించకూడదు అనే ఫీలింగ్ వల్ల లేదా చెప్పటానికి మొహమాటపడి,టెంప్టేషన్,ఈగో... కారణం ఏదైనా కావొచ్చు.

పక్కింటి వదిన గారో,అక్కయ్య గారో,పిన్ని గారో....చీరలు తెచ్చాను చూద్దువు గానీ రా అని పిలుస్తారు.అబ్బే!ఇప్పుడు చీరలు తీసుకునే ఉద్దేశ్యం ఏమీ లేదు అంటాం.అయినా వాళ్ళు వదిలిపెట్టరు కదా!తీసుకోవద్దులే ,ఊరికే చూద్దువు గానీ రా అంటారు.ఇక తప్పక వెళతాము. వెళ్ళిన తరువాత ,ఆ చూసిన చీరల్లో ఏదో ఒకటి నచ్చు తుంది.ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అని అంతరాత్మ  గోల పెడుతూన్నా  టెంప్టేషన్- తీసుకో,తీసుకో అని ఊదర గొట్టడం తో   మనం ఆ చీర తీసుకునే వస్తాం.అలాగే షాప్ కి ఏదో కొనటానికి వెళ్లి,అక్కడ ఉన్న ఇంకేవో కూడా నచ్చి,మన కవసరం లేకపోయినా కొనుక్కుని వస్తాము.ధృడచిత్తం తో వ్యవహరించటమన్నది కొంచం కష్టమే!

కొంతమంది తమకున్న వ్యసనాలు మానుకోవాలనుకుంటారు.కొత్త సంవత్సరం నుంచి మానుకుంటామనో ,వచ్చే నెలనుంచి లేకపోతే వచ్చేవారం నుంచో  లేదంటే ఇవాళే లాస్ట్ -ఇక రేపట్నుంచి మళ్ళీ సిగరెట్ కాల్చను/మందు తాగను/రేసులకు వెళ్ళను/పేకాట ఆడను....ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.కానీ మరుసటి రోజు మామూలే!ధృడ చిత్తం తో వ్యవహరించలేకపోవటం వల్ల ఏదీ మానలేరు.

The world would be a better place if people were more assertive."
ధృడ చిత్తం తో వ్యవహరిస్తే ఈ ప్రపంచం మరింత మెరుగ్గా ఉంటుందేమో!దురుసుగా  (aggressiveness )ప్రవర్తించటం వేరు , ధృడ చిత్తం తో వ్యవహరించటం వేరు.అంతే!నాకిష్టం లేదు,నేను చెయ్యను... లేదా నువ్వు ఇది చేసి తీరాల్సిందే,చేయకపోతే ఊరుకోను (చిన్న పిల్లలతో అయితే తన్నులు తప్పవు) అనటం దురుసుతనం గా వ్యవహరించటం. అలాగే కొంతమంది చాలా అణకువ గా ఉంటారు.ఎదుటివారు ఏమి అడిగినా కాదనలేరు.ప్రతీదానికి డూడూ బసవన్నలా తలూపుతూ తమ వల్లకాకపోయినా అడిగినవన్నీ చేస్తుంటారు.తమకు నచ్చని విషయాన్ని నచ్చలేదని చెప్పలేరు.లేకపోతే తమ గురించి చెడుగా అనుకుంటారేమో అని భయం. మనం చేయగలిగినదయితే ఎదుటివారికి సహాయం చెయ్యటంలో తప్పులేదు కానీ ,మనకు వీలుకానప్పుడు నో అని చెప్పటం కూడా నేర్చుకోవాలి. ధృడ చిత్తంతో వ్యవహరించటం అంటే దురుసుతనానికి అణకువ కి మధ్యస్తం గా ఉండటం.(A balance between the shy whispering of the non-assertive, and the forcefulness of the aggressive person.) 
ఇష్టం లేదు,చెయ్యను అనే బదులు ఎందుకు ఇష్టం లేదో,ఎందుకు ఆ పని చెయ్యనంటున్నారో వివరం గా చెప్పి మీరు అన్నమాట మీద ఉండటం ధృడ చిత్తం.సో, నో అని చెప్పటానికి మొహమాట పడటం ఆ తరువాత ఇష్టం లేని పనులు చేసి మనమీద మనమే చికాకు తెచ్చుకొనే బదులు ఎదుటి వారు ఫీల్ అవ్వకుండా నో చెప్పటం నేర్చుకుంటే వాళ్ళు హ్యాపీ.మనము హ్యాపీ గా ఉంటాము.ఏమంటారు? 


Smiley
If poem - Rudyard Kipling

If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don't deal in lies,
Or being hated, don't give way to hating,
And yet don't look too good, nor talk too wise:

If you can dream - and not make dreams your master,
If you can think - and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build 'em up with worn-out tools:

If you can make one heap of all your winnings
And risk it all on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breath a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: "Hold on!"

If you can talk with crowds and keep your virtue,
Or walk with kings - nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds' worth of distance run,
Yours is the Earth and everything that's in it,
And - which is more - you'll be a Man, my son!