Wednesday 10 August 2011

బ్లడ్ ప్రెషర్ తగ్గించే ఆహార పదార్ధాలు


బి.పి  అంటే తెలియని వారు ఉండరు కనుక బి.పి అంటే ఏమిటో చెప్పనక్కర లేదనుకుంట!
 బి.పి రావటానికి కల కారణాలు..... స్ట్రెస్,ఊబకాయం,ఆహారం లో ఉప్పు ఎక్కువ తీసుకోవటం,మధుమేహం.....
బి.పి ఎక్కువ ఉండటం వల్ల గుండె పోటు,ఇతర గుండె జబ్బులు,కిడ్నీ కి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
బి.పి ని తగ్గించే ఆహార పదార్దాలు :




పాలకూర : పాలకూరలో మెగ్నిషియం,ఫోలేట్ ,ఐరన్,విటమిన్ సి
ఉంటాయి.ఇవి వంటికి ఎంతో ఆరోగ్యకరం.కాబట్టి మీకు పాలకూర అంటే ఇష్టం
లేకపోయినా తినటం అలవాటు చేసుకోండి.







అరటి పండు:అరటి పండు లో బి.పి ని తగ్గించే పొటాషియం ఎక్కువగా  ఉంటుంది.రోజూ 

ఒక అరటి పండు తింటే బి.పి ని దూరం గా ఉంచవచ్చు.




కివి:పొటాషియం,విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
 lutein, అనే యాంటి 

ఆక్సిడెంట్ ఎక్కువ గా ఉండటం వల్ల బి.పి. ని సమర్దవంతం గా తగ్గిస్తుంది. 










పాలు : దీని లో  ఉన్న కాల్షియం,విటమిన్ డి ...రెండూ కూడా బి.పి. ని తగ్గించటానికి  
  ఉపయోగపడతాయి.
Blood pressure can be affected modestly by supplements of milk and soy protein, a new, small study found.
The reduction is not large in an individual, but significant at the population level," study leader Dr. Jiang He, chairman of epidemiology at the Tulane University School of Public Health and    Tropical Medicine in New Orleans, told HealthDay News










వెల్లుల్లి:రక్తం గడ్డ కట్టకుండా ,రక్త నాళాలు దళసరిగా అవకుండా నిరోధిస్తుంది.బి.పి.వల్ల కలిగే చెడు ఫలితాలను తగ్గిస్తుంది.






బీన్స్:


బీన్స్ లో మెగ్నీషియం ,పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల, బి.పి ని తగ్గిస్తుంది. 











Celery: Celeryలో ఉన్న phthalide ,రక్త ప్రసరణ సరిగా జరిగే లా చేస్తుంది. స్ట్రెస్ ని  తగ్గించటానికి కూడా ఉపయోగ పడుతుంది.












రామ ములక్కాయలు:వీటిలో ఉన్నఆంటి యాక్సిడెంట్ lycopene బి.పి. ని తగ్గించటం లో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా టొమాటో లోని కాల్షియం,పొటాషియం,విటమిన్ ఎ,సి మరియు ఇ కూడా బి.పి.ని నివారించటం లో తోడ్పడుతాయి.





Broccoli: దీనిలో పొటాషియం ఎక్కువ గా ఉండటం వల్ల బి.పి.ని తగ్గిస్తుంది.క్రోమియం... కార్డియో  వాస్కులర్ జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.బ్లడ్ షుగర్,ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది 
పొద్దు తిరుగుడు పూల విత్తనాలు, ఆలివ్ నూనె,అవకాడో లు,బొప్పాయి, డార్క్  చాక్ లెట్స్ ,పళ్ళు,కూరగాయల రసాలు బ్లడ్ ప్రెషర్ ని తగ్గించటం లో తోడ్పడతాయి. కాల్షియం,పొటాషియం ఎక్కువ ఉన్న పళ్ళు,కూరగాయలు తినటం మంచిది.ఉప్పు వాడటం వీలైనంత తగ్గించండి. వేపుడు పదార్ధాలు తినటం తగ్గించండి.