Saturday 12 March 2011

అణువు అణువున వెలసిన దేవా


మానవుడు-దానవుడు సినిమా లోని ఈ పాట నాకు చాలా ఇష్టం.

అణువు  అణువున వెలసిన దేవా 
కనువెలుగై మము నడిపించ రావా 
అణువు  అణువున వెలసిన దేవా 

మనిషిని మనిషే  కరిచే వేళ,
ద్వేషం విషమై కురిసే వేళ 
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల 
అమర జీవులై వెలిగిన మూర్తుల
 అమృత గుణం మాకు అందించ రావా 

అణువు  అణువున వెలసిన దేవా 
కనువెలుగై మము నడిపించ రావా 

జాతికి గ్రహణం పట్టిన వేళ 
మాతృభూమి మొర పెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి 
స్వాతంత్ర్య ఫలంను సాధించి 
ధన్య చరితులై వెలిగిన మూర్తుల 
ధన్య చరితులై వెలిగిన మూర్తుల 
 త్యాగనిరతి మాకందించ రావా 

అణువు  అణువున వెలసిన దేవా 
కనువెలుగై మము నడిపించ రావా 

వ్యాధులు,బాధలు ముసిరేవేళ 
మృత్యువు కోరలు సాచే వేళ 

గుండెకు బదులుగా గుండెను పొదిగి 
కొన ఊపిరులకు ఊపిరులూది 
జీవన దాతలై వెలిగిన మూర్తుల 
జీవన దాతలై వెలిగిన మూర్తుల 
సేవా గుణం మాకు అందించ రావా 

అణువు  అణువున వెలసిన దేవా 
కనువెలుగై మము నడిపించ రావా 


Friday 11 March 2011

క్షమించు నేస్తమా....



Crying Girl


అహంకారపు పొరలు కమ్మిన నా కళ్ళకు 
నీ ప్రతీ చర్య చిరాకునే కలిగించింది.
నీ ప్రతీ పలుకు విషపు గుళిక లానే  అనిపించింది
నీ  ప్రేమను గుర్తించలేకపోయింది
కమ్మిన పొరలు కరిగి, కళ్ళు తెరిచేలోపే 
విధి నిన్ను నా నుంచి దూరం చేసింది
క్షమించమని అడుగుదామంటే అందనంత దూరం లో ఉన్నావు 
ఎన్ని కన్నీళ్లు కార్చినా తిరిగి నా దరికి రావుగా !

Thursday 10 March 2011

తెలియకుంది



మది నిండా వెల్లువ లా ఆలోచనలు

లక్ష్యం లేని పయనం లో ఎన్నో దారులు

ఆలోచనల సుడిగుండం నుంచి బయట పడటానికి దారి తెలియకుంది

ఏ దారి ఏ గమ్యానికి చేరుస్తుందో తెలియకుంది.Smileys

Wednesday 2 March 2011

శివరాత్రి -ఉపవాసం




Myspace Shiva pictures Graphics Shakti Clipart


నేను ఎనిమిదో తరగతి చదవటానికి మా అమ్మ వాళ్ళ దగ్గరకు -హైదరాబాద్ వచ్చాను.ఏదో వేరే లోకం లోకి వచ్చి పడ్డట్లు అనిపించింది.అప్పటి వరకు నాకు గుడి కి వెళ్ళటం,పూజలు చెయ్యటం అలవాటు లేదు.ఇక్కడ అమ్మావాళ్ళు ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ కి వెళ్ళే  వాళ్ళు.శుక్రవారం సంతోషిమాత పూజ చేసేది.ఆ రోజు పులుపు వస్తువులు తినేది కాదు.ఒకపూట ఉపవాసం   ఉండేది.శనివారం కూడా ఉపవాసం ఉండేది.ఇంట్లో ఇలా ఉంటె ,స్కూల్ లో క్లాస్ మేట్స్ కూడా చాలానే భక్తిపరులు.మా క్లాస్ లీడర్ మరాటీ అమ్మాయి.ప్రతి సోమవారం మౌన వ్రతం ఆచరించేది.ఆ రోజు క్లాస్ లో ఎవరిని అంటుకునేది కాదు(కొన్ని రోజులకు మా సైన్స్ టీచర్ కు తెలిసి ,ఆ అమ్మాయిని తిట్టి ఆ వ్రతాన్ని మానిపించింది అనుకోండి).ఇంకా చాలా మంది ఉపవాసాలు,మొక్కులు....నాకు వాళ్ళు వింతగా అనిపిస్తే,నేను వాళ్లకు వింత. ఇలా వీళ్ళందరినీ చూసి నేనేదో చాలా పాపాత్మురాలినేమో,భక్తి అన్నది లేదు అనిపించింది.మెల్లగా నేను కూడా కొంచం భక్తి అలవరుచుకున్నాను.ఈ లోగా శివరాత్రి వచ్చింది.ఆ ముందు రోజు క్లాస్ లో డిస్కషన్స్.ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు,జాగారం చేస్తున్నారు అని.ఉపవాసం ఉండట్లేదు,జాగారం చెయ్యట్లేదు అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో,ఏమి మాట్లాడతారో అని భయపడి నేను కూడా ఉపవాసం, జాగారం  చేస్తున్నాను అని చెప్పాను.చెప్పాను కానీ ...ఆకలి కి తట్టుకోలేను,నిద్ర ఆపుకోలేను ఎలాగబ్బా!అని మనసు లో దిగులు.మొత్తానికి శివరాత్రి రోజు ,కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా సాయంకాలం వరకు ఉన్నాను.అదే రోజు మా కజిన్ పుట్టిన రోజు.సాయంత్రం ఆరింటికి మా పిన్ని,కజిన్ వచ్చారు...చేతిలో బాక్స్,బాక్స్ లో కేకు ముక్కలు.ఫస్ట్ నాకే ఇచ్చింది.ఉపవాసం సంగతి మర్చిపోయి కేకు ఇచ్చిన వెంటనే టక్కున నోట్లో పెట్టేసుకున్నాను.కొంచం తిన్న తరువాత ఉపవాసం సంగతి గుర్తు వచ్చింది.ఇంకేం చేస్తాం?ఎలాగు కేకు తిన్నాను గా,అన్నం తినేస్తాను అని మా అమ్మను అన్నం పెట్టమని భోంచేసా.అలా ఉపవాసం పూర్తయ్యింది.ఇంక ఉపవాసం చేయనప్పుడు జాగారం మాత్రం ఏం చేస్తాం లే అని ఎప్పటి లాగానే ఎనిమిదింటికల్లా నిద్రపోయా.ఇక అప్పట్నించి ఇప్పటి వరకు ఉపవాసం,జాగారం సంగతి మళ్ళీ తలచుకుంటే ఒట్టు.