Wednesday 25 January 2012

పూలు వికసిస్తాయి,వికసించి వాడి పోవడానికి....



खिलते हैं गुल यहाँ, खिल के बिखर ने को
मिलते हैं दिल यहाँ, मिल के बिछड़ ने को

कल रहे ना रहे, मौसम ये प्यार का
कल रुके ना रुके, डोला बहार का
चार पल मिले जो आज प्यार में गुजार दो

झीलों के होठोंपर मेघों का राग हैं
फूलों के सीने में ठंडी ठंडी आग हैं
दिल के आईने में ये तू समा उतार ले

प्यासा हैं दिल सनम प्यासी ये रात हैं
होठों में दबी दबी कोई मीठी बात हैं
इन लम्हों पे आज तू हर खुशी निसार दे

పాట ఇక్కడ వినండి.

Saturday 21 January 2012

ఓయీ...మనిషీ!







ఓయీ...మనిషీ!
  జీవితమంటే ఆట,సాటివారు ఆటబొమ్మలు  కాదు.
అది నీవు తెలుసుకునే లోపే,ఆటబొమ్మలు విరిగి పోయినట్లే,
మనుషుల హృదయాలు కూడా విరిగి పోతాయి.
విరిగిన బొమ్మలను తిరిగి అతికించినా మునపటి బొమ్మలు  కాజాలవు.
  హృదయానికి అయిన గాయం మానినా,ఆ గాయం తాలూకూ మచ్చ అలాగే ఉంటుంది.
సాటివారు కూడా నీలాంటి వారే!
నీకు లానే వారికి బాధ ,ఆనందం అనే భావాలు ఉంటాయని తెలుసుకో!
మానవత్వం ఉన్న  మనిషి లా మసులుకో!



Don’t use people,use things.

don’t love things,Love people.




Thursday 12 January 2012

మిగిలినవి జ్ఞాపకాలే!



ఏవీ ఆ నవ్వుల గలగలలు ?
ఏవీ ఆ చెంగు చెంగున గెంతిన గంతులు?
ఏవీ  ఆ రేపటి కోసం కన్న కలలు?
ఏరీ జీవితం లో మాధుర్యం నింపిన ఆ స్నేహితులు?
కాల గమనం లో దిగులు నవ్వులను కప్పివేస్తే,
నైరాశ్యం కలలను కమ్మేసింది.
జీవిత పోరాట పయనం లో స్నేహితులు దూరమైతే...
ఇప్పుడు మిగిలినవన్నీ గత కాలపు తీపి జ్ఞాపకాలు మాత్రమే!


Wednesday 11 January 2012

ఎందుకో మరి?




దైవమా !నీలో ఎంత క్రూరత్వం?ఎనలేని ప్రేమను పంచే  వారికే 
భరించలేనంత బాధను ఇస్తావు
 పిచ్చి మనసు!బాధను భరించలేక హృదయం ఆగిపోయేవరకు
ఆ బాధించే వారినే ప్రేమిస్తానంటుంది.
ఎందుకో మరి?



Tuesday 10 January 2012

ధనుర్మాసపు ముగ్గులు -5

ఇక చివరి గా వాకిళ్ళు తెరిచే ముగ్గు ,వాకిళ్ళు మూసే ముగ్గు.వాకిళ్ళు తెరిచే ముగ్గు నెల పట్టిన మొదటి రోజు వేస్తారు.వాకిళ్ళు మూసే ముగ్గు చివరి రోజు అనగా ముక్కనుమ రోజు వేస్తారు.నేను రెండు గీతల తో వేసాను .నాలుగు ,ఆరు గీతల తో కూడా వేసుకోవచ్చు.

వాకిళ్ళు తెరిచే ముగ్గు

వాకిళ్ళు మూసే ముగ్గు



Monday 9 January 2012

ధనుర్మాసపు ముగ్గులు-4

'#' ల తో ముగ్గులు.

'+' ల తో వేసిన ముగ్గులన్నీ '#' ల తో వేయవచ్చు.నేను ఇక్కడ రెండు ముగ్గులు చూపిస్తున్నాను.మిగతావి మీరు ట్రై చేయండి.



*ల తో 



ధనుర్మాసపు ముగ్గులు- 3




II  ల తో రధం ముగ్గు.ఈ ముగ్గు ను కనుమ రోజు,రధసప్తమి రోజు వేస్తారు.IIII గీతలతో కూడా  వేసుకోవచ్చు.ఈ ముగ్గు ను ఉత్తరం వైపు నుంచి మొదలు పెట్టి వేయాలి .







Sunday 8 January 2012

ధనుర్మాసపు ముగ్గులు-2





'+' ల తో మరి కొన్ని ముగ్గులు.







ధనుర్మాసపు ముగ్గులు-1


'+' ల తో ముగ్గులు 

పక్కన చూపెట్టినట్లు '+' లు గీసుకుని,ముగ్గులో చూపిన విధం గా  కలపాలి.మీ ఓపిక ను బట్టి ఎంత పెద్ద గా అయినా వేసుకోవచ్చు.





'II' తో 



శీతాకాలం లో చర్మం పొడిబారకుండా...


శీతాకాలం లో సాధారణం గా అందరూ ఎదుర్కొనే సమస్య, చర్మం పొడిబారటం.మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు వాడటం ఒక పరిష్కారం.అలా కాకుండా మనం తినే ఆహార పదార్ధాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


నీరు :  వేసవి లో శరీరానికి అవసరమైనంత నీరు తాగుతాము కానీ,శీతాకాలం వచ్చేటప్పటికి ఎక్కువ దాహం వేయని  కారణం గా తగినంత నీరు తీసుకోము.చర్మం పొడిబారకుండా ఉండాలంటే సీజన్ తో సంబంధం లేకుండా సరిపడా నీరు తాగటం అవసరం.


శీతాకాలం లో ఎంత నీరు త్రాగాలి అన్నది,

gender and activity levels of the person మీద ఆధారపడి ఉన్నది.

సుమారుగా  తీసుకోవాల్సిన  పరిణామం:

మగవారు:8-10 గ్లాసులు 
ఆడవారు: 6-8 గ్లాసులు 
 వ్యాయామం చేసే మగవారు:12-14 గ్లాసులు

 వ్యాయామం చేసే ఆడవారు:10-12గ్లాసులు 

పాలిచ్చేతల్లులు : 7-10గ్లాసులు



అంత నీరు తాగాలంటే కష్టం .ఎలా ?అని అనుకుంటున్నారా?
కేవలం నీరే తాగాలని లేదు.ఇతర ద్రవ పదార్దాలయినా తీసుకోవచ్చు.
ఉదాహరణ కి హెర్బల్ టీ,సూప్స్.ఇవి ఆరోగ్యానికి మంచిదే కాక,శరీరం లో తేమ ను కాపాడుతాయి.

స్టీం బాత్ కూడా వంట్లో తేమ ను పెంచడానికి ఉపయోగ పడుతుంది.


విటమిన్ ఎ,సి ,ఇ, Omega-3 fatty acids ఉన్న ఆహార పదార్ధాల ను ఎక్కువ గా తీసుకోవటం వల్ల కూడా చర్మాన్ని పొడిబారకుండా సంరక్షించుకోవచ్చు.విటమిన్ సి ,శరీరం లో collagen (a strong yet flexible protein which provides elasticity and also helps seal moisture into the skin) పెంచటానికి ఉపయోగపడుతుంది.


last but not least స్నానానికి సబ్బు ఉపయోగించకుండా సున్నిపిండి వాడటం.