Sunday, 4 December 2016

ఎక్కడికి పోతావు చిన్నవాడా

ప్రేమ అనేది దేహానికి సంబంధించినది కాదు, ఆత్మకు  సంబంధించినది అన్నది థీమ్ . పునర్జన్మ థీమ్ తో సినిమాలు చూసాము.ఒక జన్మలో ప్రేమించుకుని ఒకటి కాలేక పోయినజంట మళ్ళీ జన్మించి,వారిప్రేమను సక్సెస్ చేసుకుంటారు.లేదా,దెయ్యాల సినిమాలు చాలానే వచ్చాయి,కొద్దిగా డిఫరెంట్ థీమ్ తో.ప్రేమించి విఫలమయ్యి చనిపోయి దెయ్యమయ్యి వెంటాడటం,వగైరా.ఈసినిమా వీటన్నిటీకి భిన్నంగాఉంది.అలాగే రొటీన్ గా ప్రేమకథలు...ప్రేమించుకోవటం,విడిపోవటం,ఫైటింగ్లు,మళ్ళికలుసుకోవటం,డ్యూయెట్లు, విరహగీతాలు ... ఇలాంటి సినిమా కూడా కాదు.ఆత్మ 21గ్రాములు తూగుతుందట,అందుకే చనిపోయిన మనిషి 21 గ్రాములు తక్కువ బరువు ఉంటాడట.చనిపోయినాక తూచి ఎవరన్నా చూసారా ?😂

లోపాలు లేని సినిమా అంటూ ఉండదు. అలాగే ఈ సినిమాలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నా ,పట్టించుకోదగ్గవి కావు. కేరళ లో  మహిషాసుర మర్దిని ఆలయం కు వెళ్తున్నట్టు చెప్పి, యాగంటి , బెలుం గుహలు చూపించారు . యాగంటి మామూలు గానే అందం గా ఉంటుంది. సినిమాలో ఇంకొంచం ఎక్కువ అందం గా ఉంది.అమల కారెక్టర్ తో విజయవాడ అమ్మాయిని , భయమంటే తెలియదు అన్నట్టు చెప్పించి,పెళ్ళికి వెళుతుండగా విలన్ని చూసి భయపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టించటం ,ఇలా అన్నమాట  😊  

ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు . హేబా పటేల్ తప్ప మిగతా ఇద్దరి యాక్టింగ్ బాగుంది . ఫోటోగ్రఫీ, పాటలు బాగున్నాయి . అన్ని పాటలు బాగున్నా ,నీతో ఉంటె చాలు అన్న పాట ,మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది . గొప్ప సినిమా కాదు కానీ ,ఒకసారి చూడొచ్చు .







No comments: