Friday, 18 February 2011

జోక్స్

భార్య:ఈసారి నా పుట్టిన రోజు కు కానుక గా ఏమి ఇస్తారు?
భర్త:మన  ఎదురింటి  ముందు కారు ను చూసావా?
భా:వావ్!కారు ను గిఫ్ట్ గా ఇస్తున్నారా?
భ:కాదు.ఆ కారు రంగు నెయిల్ పాలిష్ .
భా:Free Angry Smileys

***************************************
భార్య:ఏమండీ ఈ రోజు ఏం వండమంటారు?
భర్త:వంకాయ కూర చెయ్యి.
భా:వంకాయ వాతం చేస్తుందండి.
భ:అయితే దొండకాయ కూర చెయ్యి.
భా:దొండకాయ తింటే మెదడు మందగిస్తుందండి.
భ:సరే!కోడిగుడ్ల పొరటు చెయ్యి.
భా:శనివారం,నీచు ఏం తింటామండి ?
భ:అయితే ఆకు కూర ఏదైనా వండు. 
భా:ఆవులు,మేకలకి మల్లె పచ్చగడ్డి ఏం తింటామండి ?
భ:మరి ఏం వండుతావో నువ్వే చెప్పు.
భా:మీరు ఏం వండమంటే అదే వండుతానండి.
భ:Free Basic Smileys

Tuesday, 15 February 2011

గోత్రాలు

ఇన్ని వేల కులాలు ఎలా ఉనికి లోకి వచ్చాయో తెలియదు కానీ,ఓ మూడు కొత్త గోత్రాలు ఉనికి లోకి ఎలా వచ్చాయో చెపుతాను.ఇది నా చిన్నప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పింది.మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు ఆ ఊరిలో ఎక్కువ ఉండేవారంట.(95 %) ఒకరి ఇంట్లో పెళ్ళో,నామకరమో... ఏదైనా శుభకార్యం  జరిగే టైం కి ,ఎవరో ఒకరి ఇంటి నుంచి చావు కబురు చల్లగా వచ్చేదంట.సగోత్రీకులకు సూతకం కదా!దానితో ఆ శుభకార్యం ఆగిపోయేదంట. ఇలా చాలా సార్లు జరగటం తో ఏమి చేయాలా అని ఆలోచించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారంట.అదేమిటంటే....నాలుగు గుంపులు గా విడిపోయి,ప్రస్తుతం ఉన్న గోత్రాన్ని,ఒక గుంపు ఉంచుకుంటే ,మిగతా మూడు గుంపు లు మూడు కొత్త గోత్రాల్ని పెట్టుకోవటం.అలా ఒకే ఇంటి పేరు ఉన్నప్పటికీ గోత్రాలు మాత్రం ఒకటి కి నాలుగు  అయ్యాయి. 

Friday, 4 February 2011

అందరికీ ధన్యవాదాలు

ఇవాల్టికి నేను బ్లాగ్ రాయటం మొదలు పెట్టి సంవత్సరం పూర్తయింది.అయితే ఏంటంట...అంటున్నారా?



ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేననీచైః ప్రాంభ్మవిఘ్ననిహతా విరమన్తిమధ్మాః

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమజనాః నపరిత్యజన్తి

విఘ్నాలు కలుగుతాయేమోననే భయంతో పనిని ప్రారంభించనే ప్రారంభించరు నీచులు. ప్రారంభించి విఘ్నాలు ఎదురైతే ఆ పనిని అక్కడితో విడిచిపెట్టేస్తారు మధ్యములు. ఉత్తములైనవారు మాత్రం ఎన్ని ఆటంకాలు, విఘ్నాలు కలిగినా తలపెట్టిన కార్యాన్ని నెరవేర్చి తీరుతారు. 
ఆ లెక్కన నేను మధ్యముల కేటగిరీ లోకి వస్తాను.ప్రతీదీ మొదలు పెట్టటమే కానీ పూర్తి చెయ్యటం ఉండదు.నేను బ్లాగ్ క్రియేట్ చేసింది ,నవంబర్-2008 లో .ఆరంభం అని టైటిల్ పెట్టి ఒక చాంతాడంత పోస్ట్ రాసాను.ఇక 2010 ఫిబ్రవరి వరకు  దాని జోలికి వెళ్ళలేదు.కారణాలు రెండు...ఒకటి -రాయటం చేతకాకపోవటం.రెండు-బద్ధకం.అటకెక్కిన బ్లాగ్ ను తీసి,దుమ్ముదులిపి మళ్ళీ పోస్ట్లు రాయటం మొదలు పెట్టింది..ఫిబ్రవరి 2010 ,4న.దానిని సంవత్సరం పాటు కొనసాగించడం........ఆశ్చర్యం గా ఉంది.నేను గొప్పగా రాయలేనని నాకూ తెలుసు.ఏదో కాలక్షేపానికి
రాస్తున్నాను.
ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నేను ,నడక నేర్చుకుని పరుగులు 
పెడతానో లేక నడవ లేక చతికిల పడతానో...ఏమో ఏమవునో..
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ....
ఈ సంవత్సర కాలం లో నే రాసిన పోస్ట్లు ఓపికతో చదివి కామెంట్లు రాసిన .....
మంచు,శరత్ కాలం  ,పద్మార్పిత,సౌమ్య,వర్మ,రహంతుల్ల,స్వప్న,ఫజ్లుర్ రహమాన్ నాయక్,రవిచంద్ర, కే.వి.ఎస్.వి, రిషి, అనుదీప్,యూనిక్స్-ఫ్రీక్,
చెరసాల శర్మ,వినయ్ చక్రవర్తి,అభి, సిరిసిరిమువ్వ,దివ్య,జయ,కొత్తపాళీ,
కిషెన్ రెడ్డి, శివప్రసాద్, కృష్ణ, astrojoyd, అభేద్యుడు,
ఓతెలుగోడు,నాగార్జున, మాలాకుమార్, తృష్ణ, వెన్నెలరాజ్యం,
విజయ్ కుమార్,innervoice .కో.cc ,మంజు,నేస్తం,సవ్వడి,
కృష్ణప్రియ,దివ్యవాణి,కిరణ్ తేజ,ఒరెమూనా, చాణక్య,హరేకృష్ణ,
తార, సందీప్, నచికేత్, మధు, తెలుగిల్లు, శిశిర, చక్రధర్,
ఇండియన్ మినర్వా,ఇ.వి.లక్ష్మి,లక్ష్మి,ఫోటో డమ్మీ,రాధిక,సి.బి.రావ్,
షాడో,వీకెండ్ పొలిటిషియన్ ,వేణు,ఎన్నెల,నాగ ప్రసాద్,శివరంజని,  ఎస్.పి.జగదీశ్, వేణు శ్రీకాంత్,కే.హనుమంతరావు,కార్టూన్.వర్డ్ప్రెస్.కాం,
అశోక్,జాన్,స్వామీ(కేశవ),రాణి,కోటేశ్వరరావు,నవీన్, కమలి,
నిషిగంధ గార్లకు మరియు నా బ్లాగ్ ను అనుసరిస్తున్న వారికి  నా కృతజ్ఞతలు /ధన్యవాదాలు. 

Thursday, 3 February 2011

తు హి తు

లక్ష్మీ నీవే,
దుర్గా నీవే,
సరస్వతీ నువ్వే
నువ్వు నువ్వే 

అదే పాట ఇందిరా గాంధి,కుటుంబ సభ్యుల పిక్చర్స్ తో 



తు హి తు అనే ఈ స్టార్ ప్లస్ anthem నాకు చాలా నచ్చింది.