Thursday 2 November 2017

చూడ చక్కని శిల్పం







ఈ పిక్ , నా స్నేహితురాలు పంపించారు. పిక్ తో పాటు ఒక ఆడియో కూడా పంపించారు.ఆడియో   లో పిక్ గురించిన వ్యాఖ్యానం ఉంది.కానీ దానిని బ్లాగ్ లో ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియలేదు.ఈ శిల్పం ఏక రాతి శిల్పమని ,దశావతారాలు ఈ శిల్పం లో చెక్కబబడ్డాయని ... కొన్ని అవతారాలకి రూపం ఉంది,కొన్నిటికి వారి ఆయుధాలు.  బలరాముడు దశావతారాలలో ఒకరా ?ఎప్పుడూ వినలేదు.శిల్పం కుడి వైపు ఒక చేతిలో నాగలి ఉంది, అది బలరాముని   ఆయుధం. వెంకటేశ్వర సుప్రభాతం లో వచ్ఛే ఒక శ్లోకం ఆధారం తో ఈ శిల్పం రూపొందింది అని చెప్పారు. 

ఆ శ్లోకం 

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశ రామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం