Wednesday 20 April 2011

మెటిల్డా

మెటిల్డా 
డైరెక్టర్ -Danny DeVito

Writer: Roald Dahl 

screenplay :Nicholas Kazan 

మెటిల్డా చాలా తెలివైన అమ్మాయి.స్కూల్ కి వెళ్ళటం,పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.ఇంట్లో మిగతా ముగ్గురు(తల్లి,తండ్రి,అన్న)కి టి.వి.కాలక్షేపం.తల్లి బింగో ఆడుతుంటుంది.తండ్రి కార్ల అమ్మకం చేస్తుంటాడు.మెటిల్డా చెపితేనే కానీ ,తనను స్కూల్ కి పంపే వయసు వచ్చిందని తెలుసుకోలేనంత గా తమ వ్యాపకాల లో మునిగి పోయి ఉంటారు.ఎలాగైతేనేం ,మెటిల్డా ని స్కూల్ కి పంపిస్తారు.ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పరమ క్రూరురాలు.మెటిల్డా తనకున్న పవర్స్ తో ...ఆ ప్రిన్సిపాల్ ని స్కూల్ నుంచి ఎలా పంపించివేసింది,తన టీచర్ కు ...ప్రిన్సిపాల్ నుంచి ,ఆమె ప్రాపర్టీ ని తిరిగి ఎలా ఇప్పించింది అన్నది కథ.మెటిల్డా గా మారా విల్సన్ చాలా బాగా యాక్ట్ చేసింది.చాలా క్యూట్ గా ఉంది.ప్రిన్సిపాల్ పాత్ర లో Danny DeVito అంతే బాగా యాక్ట్ చేసింది.పిల్లలకు,చైల్డిష్ మెంటాలిటీ ఉన్న నా లాంటి పెద్దలకు నచ్చే సినిమా ఇది. 







Monday 11 April 2011

సుత్తి (కబుర్లు)



ఈ టపా కి శీర్షిక ఏమి పెట్టాలో తెలియక అలా సుత్తి కబుర్లు అని పెట్టాను.నేను రాస్తున్న విషయాలకి అది ఆప్ట్ గానే ఉందనుకోండి.రెండు రోజుల క్రితం  మేము శ్రీశైలం వెళ్ళాము.దారిలో ఎదురైన కొన్ని ఊర్ల పేర్లు చాలా విచిత్రం గా ,నవ్వు వచ్చేలా ఉన్నాయి.(దోమల  పెంట,ఈగల పెంట,సున్ని పెంట,రాయి చెడి)వాటికి అలాంటి పేర్లు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ పేర్లు చదవంగానే ,చాలా నవ్వు వచ్చింది.మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద ఒక పెద్ద బోర్డ్ పెట్టారు.రెండు రూపాయలు పెట్టి ఒక పేపర్ బ్యాగ్ కొనుక్కొని ,వాడిన మినరల్ వాటర్ బాటిల్స్,ఇతర ఐటమ్స్ అన్నీ అందుట్లో వేయమని,ఫారెస్ట్ ఏరియా లో పడవేయవద్దని.ఆ తరువాత ప్రతి పది అడుగులకు ఒక బోర్డ్...పర్యావరణాన్ని కాపాడమని.బోర్డుల దారి బోర్డులది.మన జనాల దారి జనాలది.అంతగా మొత్తుకుంటున్నా దారి పొడుగూతా ,ప్లాస్టిక్ బాటిల్స్,కవర్స్.... జనాలు వాడి పడేసినవి కనిపిస్తూనే ఉన్నాయి.
ఒక రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో జూ కి వెళ్ళాము.అక్కడ ఉన్న జంతువులకి ఏమీ ఫీడ్ చేయవద్దని బోర్డ్ లు పెట్టారు.వాటిని చూసి ,రాసి ఉన్నవాటిని పాటిస్తే మనం మనుషులం ఎలా అవుతాము?సరే కోతులకు అరటి పళ్ళు,హిప్పోపోటమస్ కి బ్రెడ్ ...ఇలా... కొంతమంది విసిరేస్తున్నారు.ఇది కొంత బెటర్.ఇంతలో ఒక గ్రూప్ అబ్బాయిలు వచ్చారు.స్టూడెంట్స్ లాగా ఉన్నారు.అందులో ఒకడు నాలుగైదు ప్లాస్టిక్ కవర్లను చుట్ట చుట్టి హిప్పోపోటమస్ నోట్లోకి విసిరేశాడు.వాడు విసరబోతుంటే ,నాతో పాటు అక్కడే ఉన్న మరికొంతమంది వెయ్యకు అని అరుస్తూనే ఉన్నాము,అయినా వాడు విసిరేశాడు.అదేమి ఆనందమో నాకు అర్ధం కాలేదు.ఈ భూమి మీద ఉన్న క్రూరాతి క్రూరమైన జంతువు ఏదైనా ఉందంటే అది మనిషే!జంతువులననే కాదు...కొంతమంది ఎదుటివారిని అకారణంగా మాటలతో,చేతలతో హింసించి ఆనంద పడుతుంటారు.ఇలాంటి వాళ్ళ గురించేనేమో ,భాస్కర శతక కారుడు ఈ పద్యం రాసింది.

ఊరక సజ్జనుండొదిగి యుండిననైనా దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా
చీరలు నూరు  టంకములు చేసెడివైనను పెట్టెనుండగా 
చేరి చినింగి పోగొరుకు చిమ్మటకేమి   ఫలంబు?భాస్కరా!