Showing posts with label విహారం. Show all posts
Showing posts with label విహారం. Show all posts

Wednesday, 23 October 2024

అండమాన్ ప్రయాణం

అక్టోబర్ 8 , చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ కి ప్రయాణం. సాయంత్రం 4గంటల ప్రాంతం లో చేరుకున్నాము. రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి నగరం లో ఆలా ఒక రౌండ్ వేసి వచ్చాము. 

మేము బస చేసిన దగ్గరలోనే 1943  పార్క్( flag point ) ఉంది. 

మొట్టమొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ ఇక్కడ మువ్వన్నెల పతాకం ఎగరవేశారు. అండమాన్ & నికోబార్ బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిందని డిక్లేర్ చేసారు. బ్రిటిషర్లు అండమాన్  వదిలి వెళ్లినాక జండా ఎగర వేశారు. తిరిగి అక్టోబర్ 1945 లో బ్రిటిష్ అండమాన్ ను ఆక్రమించింది. 1947 వరకు వారి ఆధీనం లోనే ఉంది. 


 


 


Tuesday, 23 November 2021

గాంధార కళ

ప్రాచీన భారత దేశం లో పేరు పొందిన శిల్ప కళ ల  లో  గాంధార కళ  ఒకటి. గ్రీకు, రోమన్  శిల్ప కళల ప్రభావం దీని మీద ఉంది. 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఈ కళ ప్రాచుర్యం లో ఉంది. మహాయాన బుద్ధిజం నేపథ్యం వల్ల గాంధార కళ ఆధారం గా రూపొందిన శిల్పాలు బుద్దుడివి , ఇతర బోధిసత్వుల వే  ఎక్కువ ఉన్నాయి.

చండీగఢ్ ప్రభుత్వ మ్యూజియం & ఆర్ట్ గ్యాలెరీ లో ఈ శిల్పాలు చూడొచ్చు. చండీఘర్ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఈ మ్యూజియం ఒకటి. శిల్పాలు, పెయింటింగ్స్ , వివిధ రాజుల కాలం లో నాణేలు ... మినిమం  3 గంటలు పడుతుంది, చూడటానికి.

మీకోసం కొన్ని పిక్చర్స్ . 


మైత్రేయ 





కార్తికేయ 



Worship of  Ushnisha by Nagas (10th Century )


విష్ణు & లక్ష్మి 



గంగ 









నిజాం కాలం నాటి నాణెం 




Saturday, 13 November 2021

చండీఘర్

చండీఘర్  అంటే ఒక ప్లాన్డ్ నగరం, రాక్ గార్డెన్ ఉంది అని మాత్రమే తెలుసు.అంతకు మించి ఏమీ తెలియదు.అక్కడకు వెళ్లిన తర్వాతే చాలా విషయాలు తెలిసాయి. ఆ నగరాన్ని ప్లాన్ చేసిన వ్యక్తి ,అతను వేసిన పెయింటింగ్స్ చూసాము. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కంపల్సరీ గా సందర్శించే రెండు ప్రదేశాలు-    Le Corbusier సెంటర్    capitol complex ( 2016 లో యునెస్కో  వర్ల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి వచ్చింది )

Le Corbusier సెంటర్ లో  Le Corbusier  వేసిన పెయింటింగ్స్, అతను గీసిన సిటీ, బిల్డింగ్ ప్లాన్ లు భద్రపరిచారు.  నాకు అవి అంత ఆసక్తికరం గా అనిపించలేదు. మోడర్న్ ఆర్ట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి నచ్చుతాయేమో/ అర్ధమవుతాయి అనుకుంటా :)


1955 లో వేసిన పెయింటింగ్ . 


open hand monument design




capitol complex లో అసెంబ్లీ ,సెక్రటేరియట్, హైకోర్ట్ , ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ ఉన్నాయి.శని,ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో లోపలి వెళ్లి చూడొచ్చు అని చెప్పారు. మేము ఆదివారం వెళ్ళటం వల్ల బయటనుంచి చూసి వచ్చేశాము . 



 చండీఘర్ ప్రభుత్వపు (శాంతి,శ్రేయస్సు )చిహ్నం 




Monday, 20 April 2020

మాహుర్ గడ్ - శ్రీక్షేత్ర (దత్తాత్రేయుని జన్మ స్థలం)


మాహుర్ లో ఒకే కొండ పైన మూడు దేవాలయాలు ఉన్నాయి. రేణుక, అనసూయ మరియు దత్తాత్రేయ.మొదటగా రేణుకాదేవి గుడి.గుడికి చేరుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కాలి.మెట్లకిరువైపున,మొదట్లో దుకాణాలున్నాయి. అమ్మవారికి సమర్పించుకోవటానికి,చీరలు, గాజులు,పూలు, ప్రసాదాలు అమ్ముతున్నారు.ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలపాకులు , వక్క ,సోంపు అమ్మవారికి ఇస్తున్నారు.వాటిని దంచి విగ్రహం నోటి భాగం లో ఆ ముద్దను పెట్టారు. వచ్చిన భక్తులకు అదే ప్రసాదం గా ఇస్తున్నారు.



ఈ గుడి నుంచి మాహుర్ కోట కనిపిస్తుంది. 


గుడి వెనక వైపు మెట్లు ఉన్నాయి.కిందకు దిగితే పరశురాముడి గుడి ఉంది. ఈ గుడికి వెళ్లే దారి పొడుగూతా కోతులు  గుంపులు గుంపులుగా ఉన్నాయి.





వాటిని చూస్తే కొంచం భయం అనిపించి వెనక్కు వెళ్ళి పోదాము అనుకున్నాము.మళ్లీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాము.


    

ఈ గుడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళటానికి మెట్లు, మట్టిబాట ఉంది. అక్కడకు వెళ్లకుండానే వెనక్కివచ్చేసాము.పరుశురాముడు తల్లి తల నరికిన తర్వాత ఆ కోనేట్లోనే స్నానం చేసాడంట. ఆలా అని అక్కడకు వచ్చిన ఒకరు చెప్పారు.


కోనేరు


ఈ గుడి నుంచి  కొండ పైకి వెళితే అనసూయ మాత దేవాలయం. దారి సరిగా లేదు అని డ్రైవర్ చెప్పటం తో మేము అక్కడకి వెళ్ళలేదు.పూర్తి గా కొండ పైన  దత్తాత్రేయుని దేవాలయం ఉంది. ఇది దత్తాత్రేయుని జన్మస్థలం అంట. మాఘపూర్ణిమ సందర్భం గా ఉత్సవం జరుగుతుందని , దానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మేము నాందేడ్ నుంచి వస్తుంటే జనం కాలి నడకన,మధ్య మధ్య లో నాట్యం చేస్తూ,దత్తాత్రేయని విగ్రహం/పటం  పల్లకీ లో,ఇతర వాహనాల లో పెట్టుకుని  వస్తున్నారు.అలా నడుస్తూ వాళ్ళు సరిగ్గా పౌర్ణమికి దత్త శిఖరం చేరుకుంటారట.

    






మాకు తిరిగి సికిందరాబాద్ రావటానికి  ట్రైన్  రాత్రి 9:30 కి . ఇంకా చాలా టైం ఉండటం తో మాహుర్ నుంచి సహస్రకుండ్  జలపాతం దగ్గరకు వెళ్ళాము. చెపితే తప్పించి అది జలపాతం అని తెలిసే ఛాన్సే లేదు. అలా ఉంది :) ఇక్కడ కూడా కోతులు విపరీతం గా ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. చల్లటి గాలి ... కొద్దిసేపు అలా చుట్టూ  చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ, మాట్లాడుకుంటూ కాలం గడిపి, జలపాతానికి దగ్గరలోనే ఉన్న పాక హోటల్ లో టీ  తాగి , తిరిగి నాందేడ్ కి బయలు దేరాము.











Friday, 17 April 2020

మాహుర్యే ఏకవీరికా



ఫిబ్రవరి మొదటి వారం లో నాందేడ్ వెళ్ళాము.అప్పటికింకా కరోనా గురించి తెలియదు. నాందేడ్ లో గురుద్వారా చూసుకుని అక్కడ్నుంచి మాహుర్ వెళ్లాలని  అనుకున్నాము.6వ తారీఖు మధ్యాహ్నం 12:30 కి దేవగిరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరాము.సాయంకాలానికల్లా నాందేడ్ చేరుకున్నాము. అక్కడ్నుంచి ఆటో లో గురుద్వారా చేరాము.గురుద్వారా సొసైటీ వాళ్ళే నిర్వహించే యాత్రినివాస్ లో రూమ్ బుక్ చేసుకోవటానికి వెళ్తే, అక్కడివారు రూమ్ ఎక్కడికి పోదు, గురుద్వారా చూసి అక్కడ లంగర్ లో భోజనం చేసి రండి అని చెప్పటం తో మళ్ళి గురుద్వారా కి వచ్చి తీరిగ్గా అంతా కలదిరిగి ,9 గంటలకు భోజనం చేసి  యాత్రి నివాస్ చేరుకున్నాము. గురుద్వారా లైట్ల వెలుతురు  లో  చాలా అందం గా ఉంది. అక్కడ్నుంచి కదలాలనిపించలేదు . గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతమంతా ఎటు చూసినా సిక్కులే !మినీ పంజాబ్ అనిపించింది :)
గురుద్వారా వద్దే మరుసటి రోజు మాహుర్ వెళ్ళటానికి వెహికల్ మాట్లాడుకున్నాము. 





నాందేడ్ నుంచి మాహుర్ కు  మూడున్నర గంటల ప్రయాణం. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది 8వ శక్తి పీఠం.ఈ శక్తి పీఠం మాహుర్ కి 10 కిలోమీటర్ల దూరం లోనే హివరా గ్రామం లో ఉంది. మాహుర్ కి వెళ్ళటానికి ముందే డైవెర్షన్ తీసుకోవాలి. ఇక్కడ తెలుగు లో రాసిన బోర్డు చూసి ఆశ్చర్యం వేసింది.గుడిలో కూడా తెలుగు లోనే రాసి ఉంది. గుడి పక్కనే పెన్ గంగ (నది) ప్రవహిస్తుంది.గుడి చిన్నది. భక్తులు కూడా చాల తక్కువ మంది ఉన్నారు.దర్శనానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. 







       
అక్కడ్నుంచి మాహుర్ గడ్ రేణుక ఎల్లమ్మ గుడికి వెళ్ళాము. ఆ గుడి విశేషాలు ఇంకో పోస్ట్ లో ... 












Wednesday, 20 February 2019

కేరళ -God's own country

గత సంవత్సరం మే నెలలో కేరళ వెళ్ళాము.అందరూ ఊదరగొట్టినంత అందంగా అయితే నాకనిపించలేదు.ఎక్కడయినా లంక గ్రామాలు,కొండ ప్రాంతాలు  ఎలా ఉంటాయో అలాగే ఉంది.అలాంటి పల్లెలను/ప్రాంతాలను ఎప్పుడూ చూడని వారికి కేరళ అద్భుతం గానే కనిపిస్తుంది.కుమిలీ లో ఒక రిసార్ట్ లో ఉన్నాము.అక్కడ  ఇంతకు  మునుపు  చూడని కొత్త మొక్కలు చూసాము.రిసార్ట్ చాలా అందం గా ఉంది.ఫుడ్ కూడా.
మేమున్న కాటేజ్ బాల్కనీ నుంచి వ్యూ బాగుంది.





కాటేజ్ కి వెళ్లే దారి 


మేమున్న కాటేజ్


మొదటి రోజు పెరియార్ లేక్ లో బోట్ రైడింగ్ చేసాము ... అడవి దున్నలు,జింకలు తప్ప వేరే జంతువులూ ఏమీ కనిపించలేదు.





మరుసటి రోజు సఫారీ కి వెళదాము అనుకున్నాము . కానీ ఆ రోజు జీపులు దొరకటం కష్టం అని చెప్పారు.గవి అడవి లో కొండ మీదున్న మంగళాదేవి గుడి ,సంవత్సరం లో ఒక్క రోజు (చైత్ర పౌర్ణమి )మాత్రమే తెరుస్తారు అంట.జీపులన్నీ అక్కడకే వెళతాయి,సఫారీ అంటే ఎవరూ రారు , మీరు చాలా లక్కీ ,సరైన సమయానికి వచ్చారు ,రేపు ఆ గుడికి వెళ్ళండి అని చెప్పారు. ఏమి చేస్తాం ? సరే అన్నాము .

ఆ విశేషాలు నెక్స్ట్ పోస్ట్ లో ...


  

Tuesday, 24 July 2018

Coir Museum (పీచు మ్యూజియం )Kalavoor (Alappuzha)

అలెప్పీ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.ఎక్కువ మంది, పీచు మ్యూజియం - ఏముంటుందిలే చూడటానికి అనుకుని వెళ్లక పోవచ్చు.విషయాసక్తి ఉన్న వాళ్లకి తప్పకుండా నచ్చుతుంది . 

ఈ మ్యూజియం,కొబ్బరి పీచు పరిశ్రమ 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా కాయిర్ బోర్డు కాంప్లెక్స్ లోనే 2014 లో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు.ఈ సందర్భం గా భారత ప్రభుత్వం 60 రూపాయల నాణెం విడు దల చేసింది.



ఈ మ్యూజియం లో కొబ్బరి పీచు తో  చేసిన బొమ్మలు,పీచు తీసే యంత్రాలు,పీచు  నుంచి తాళ్లు ,కాళ్ళు తుడుచుకునే పట్టాలు తయారు చేసే యంత్రాలు ఉన్నాయి.కొబ్బరి పీచు తో చేసిన కొన్ని బొమ్మలు ...






















కనిపిస్తున్న ఇంటి నమూనా లో వాడిన తలుపులు, కిటికీ లు, గోడలు అన్నీ కొబ్బరి పీచు +ప్లై వుడ్  కాంబినేషన్ లో తయారయ్యాయి. ఇవి ఫైర్ మరియు వాటర్ ప్రూఫ్ అంట. బెంగళూరు కాయిర్ బోర్డు వారి దగ్గర మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి.

   
కొబ్బరికాయలు నుంచి పీచు - దాని నుంచి తాళ్లు,ఇతర వస్తువుల  తయారీ ప్రాసెస్ ... బొమ్మల తో .

మ్యూజియం చూసిన తర్వాత, దగ్గర లో ఉన్న మరారికులం బీచ్ కి వెళ్ళాము. బీచ్ కి వెళ్లే దారిలో మహాదేవ (శివుడు) గుడి ఉంది.బీచ్ నుంచి వస్తూ శివుడు ని దర్శించుకుని వచ్చాము.