Showing posts with label ఊహలు. Show all posts
Showing posts with label ఊహలు. Show all posts

Monday, 13 June 2011

ఊహల్లోనే......



నేస్తం......

ఎన్నో ఊసులు-నీతో చెప్పాలనుకుంటాను
ఏవో సందేహాలు-నను వెనక్కు లాగుతుంటాయి
చెప్పాలనుకున్న ఊసులన్నీఊహలుగానే మిగిలిపోతాయి

ఇసుకతో కట్టిన గూళ్ళు అల తాకగానే కరిగిపోయినట్లు ,
ఇహలోకం లోకి రాగానే ఊహలు మాయమవుతాయని తెలుసు
అయినా ఆ ఊహల్లోని  ఆనందం ,నన్ను నిజాన్ని గుర్తించనివ్వటం లేదు

ఊహలు ఎంత మధురం గా ఉన్నా,వాస్తవం లోకి రాక తప్పదు
ఆ చేదు ని రుచి చూడక తప్పదు

అందుకే ఊహలు ఎప్పటికి నిజమవ్వవని మనసుకు తెలిసినా,
కనులు తెరిచి నిజాన్ని చూడటానికి నిరాకరిస్తున్నాను  .
   

Monday, 18 October 2010

ఖలేజా చూడాలంటే ఖలేజా ఉండాలి

కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసా.ఎదురుగా మా కాలనీ వాళ్ళందరూ కనిపించారు.ఏమయ్యింది ,కట్ట కట్టుకుని అందరూ ఒకసారే వచ్చారు అని మనసులో అనుకుంటూ  పైకి మాత్రం ఒక చిరునవ్వు విసిరా.అందరూ దణ్ణాలు పెట్టుతూ అను గారు ,మీరు దేవత,మమ్మల్ని ఈ దరిద్రపుగొట్టు సినిమా ల బారి నుంచి రక్షించటానికి వచ్చిన దేవత అన్నారు.మనసులో ఉప్పొంగిపోతూ పైకి మాత్రం అమాయక ఫేస్ తో నేను దేవత ఏమిటండీ,ఖలేజ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యిందా?అన్నాను.బ్లాక్ అవలేదు,వైట్ అవలేదు కానీ మీరు మా దేవత,దేవత అని కోరస్ పలికారు.ఊ...మీరు ఇన్నిసార్లు నన్ను దేవత అంటుంటే నాకు నిజమేనేమో అని అనిపిస్తుంది.రావిచెట్టు కు పూలు పూయించాలా?మందార చెట్టుకు కాయలు కాయించాలా ?నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆవేశం గా అన్నాను.అవేమీ వద్దు కానీ ,సూర్య,త్రివిక్రమ్ అనే వాళ్ళు సినిమాలు డైరెక్ట్ చేయకుండా చేయండి చాలు అన్నారు.ఏంటీ?ఆ పని నేను చేయగలనా అని ఆశ్చర్య పోయాను.హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు ,మీకు మీ శక్తి తెలియట్లేదు తల్లీ ....మీరు అనుకోండి చాలు అంతే అయిపోతుంది అన్నారు వాళ్ళు.సరే అని అనుకున్నాను.వెంటనే t .v 9  లో బ్రేకింగ్ న్యూస్ అని 'సూర్య,త్రివిక్రం ఇక నుంచి డైరెక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని 'ఫ్లాష్ చేసాడు.హా!నిజంగా నాకు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్య పడెంతలో...ఢాం అని పెద్దగా శబ్దం వినిపించి ఉలిక్కిపడి ఇహలోకం లోకి వచ్చాను.అయ్యో ఇదంతా ఊహేనా,నిజం అయితే ఎంత బాగుండు అనిపించింది.
 
   ఖలేజాలో మహేష్ కొత్తగా కాదు ,పరమ చెత్తగా నటించాడు.బూతు డైలాగులు వల్లించటమే కొత్తదనం అనుకుంటున్నారు ....డైరెక్టర్ ,హీరో లు.అనూష్క కారెక్టర్,సినిమా లో లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు.పరమ వేస్ట్ ,చీము,నెత్తురు లేని డంబ్ కారెక్టర్ .ఈ సినిమా చూడాలంటే చూసిన తరువాత కలిగే వికారాలను తట్టుకునే ఖలేజా,ముందుమనకుఉండాలి.ఈ సినిమా చూస్తే,టైం,మనీ ,
మైండ్ ...పోవటం ఖాయం.

Saturday, 27 March 2010

ఒక మాను స్వగతం







కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అంటారు.ఆడది గా పుట్టేకంటే అడవి లో మానై పుట్టినా బాగుండు అంటారు.అంటే కష్టాలు మనుషులకు మాత్రమే ఉంటాయా?ఇంక ఎవరికీ ఉండవా?మా కష్టాలు ఎవరికి తెలుసు?పీత కష్టాలుపీతవి అన్నట్లు మాకష్టాలు మాకు ఉన్నాయి.అడవిలో ఎప్పుడు దావానలం వ్యాపించి మమ్ములను దహించి వేస్తుందో, ఎప్పుడు ఎవరు వచ్చి మమ్ములను గొడ్డళ్ళ తో నరుకుతారో అని బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటాము.అలా గొడ్డళ్ళ తో నరికి తీసుకు వెళ్లి మీ మనుషులు మమ్ముల్ని ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారు.రంపాలతో కోస్తారు.చిత్రిక పట్తారు .మీ మనుషుల లో ఉన్నట్లే మా లోనూ అదృష్ట వంతులు ,దురదృష్ట వంతులు ఉన్నారు. దురదృష్ట వంతులును తీసుకు వెళ్లి పొయ్యి లో కట్టెలు గానో ,శవాలను  కాల్చతనికో   ఉపయోగిస్తారు.అదే అదృష్ట వంతులని బొమ్మలు గానో, ఫర్నిచర్ గానో  మలిస్తే,గొప్ప వారి ఇంట్లో కొలువు దీరతాయి.దేవుడి బొమ్మలు గా మలిస్తే మరీ అదృష్టం.పూజలు అందుకుంటాయి.మరి ఇంకా మానయి పుట్టాలనే అనుకుంటారా?