Thursday, 23 January 2014

ఖాజీ రంగా నేషనల్ పార్క్ (World Heritage Site)


వేల సంఖ్య లో ఖడ్గమృగాలు,ఏనుగులు,  వందల సంఖ్యలో అడవిదున్నలు ,జింకలు( Swamp deers) బెంగాల్ రాయల్ టైగర్స్ -106   -   పార్క్ లో పెట్టిన బోర్డ్ . 
ఖడ్గమృగాలు పర్వాలేదు,ఎక్కువ సంఖ్య లోనే కనిపించాయి.అడవి దున్నలు ఓ నాలుగు,కొన్ని జింకలు ,పక్షులని మాత్రమే చూడగలిగాము.టైగర్స్ 106 అని రాసారు ,కనీసం ఒక్కటన్నా కనిపిస్తుందేమో అనుకుంటే ఒక్కటి కూడా కనిపించలేదు.జంతువులు కనిపించినా ,కనిపించకపోయినా అడవి లో ప్రయాణం ఒక చక్కటి అనుభూతి.పార్క్ కి వెళ్ళే దారి లో టీ తోటలు,వాటి లోనే మిరియపు తీగలు. 

          
ఫోటో దిగే భాగ్యం దీనికి ఒక్క దానికే కలిగింది 
                                                                        అడవి దున్నల ఫామిలీ 
 
                                                                  ఎక్కడో దూరాన జింకలు 
 పక్షులు 5 ,6 రకాలు కనిపించాయి కాని ఫోటోస్ తీయటం కుదరలేదు.ఆకుపచ్చ పసుపు రంగు కలిసిన పావురాలు చాలా అందం గా ఉన్నాయి.నైట్ అక్కడ ఉండి ,తెల్లవారు ఝామున 3 లేదా 4 గంటలకు వెళితే ఎక్కువ జంతువులు కనిపిస్తాయి అని చెప్పారు.మాకు అంత టైం లేకపోవటం తో సాయంత్రానికి తిరిగి వచ్చేసాము. 
ఇక్కడ తినటానికి బాంబూ చికెన్ దొరుకుతుంది.ఒకసారి తినొచ్చు ,పర్వాలేదు. ఉప్పు కారాలు ,మసాలాలు ఎక్కువ తినేవారికి నచ్చదేమో !  
పార్క్ కి వెళ్ళే దారి లోనే రోడ్ ప్రక్కన చిన్న పాకలు లాగ వేసి కొబ్బరిబొండాలు, బాంబూ పెరుగు(వెదురు బొంగు లో పాలు తోడు పెట్టినది ) అమ్ముతున్నారు. ఈ పిక్ లో ఉన్నది 90 రూపాయలు. టేస్ట్ ఆహా ,ఓహో అనే లా లేదు కాని ఫర్ ఎ చేంజ్ ... 

      

Tuesday, 21 January 2014

హరిక్షేత్రే కామరూపీ

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి - కామాఖ్య మందిర్ ,అస్సాం లోని గౌహాతి లో ఉంది.హరిక్షేత్రే కామరూపీ అని స్తుతించారు అంటే ఒకప్పుడు గౌహాతి ని హరిక్షేత్రం అని వ్యవహరించే వారేమో ! అస్సాం స్టేట్ మ్యూజియం లో ఉన్న ,పురావస్తు శాఖ తవ్వకాలలో బయల్పడిన 10వ శతాబ్దం నాటి విగ్రహాలు   చాలావరకు విష్ణుమూర్తివే !
ఈ ట్రిప్ లో ,నాకు చాలా చిరాకు తెప్పించిన ప్రయాణం అంటే ఇదే !దర్శనానికి సుమారు 6 గంటలు పైనే పట్టింది . అంత సేపు క్యూ లో నిన్చోటం నిజం గా నరకం.ఒక ప్రక్క జనరల్ క్యూ లో ఉన్న వాళ్ళ భజనలు హొరెత్తుతూ ఉంటే ,మా క్యూ లో వెనక ఉన్న వాళ్ళ -  గేట్ ఖోల్ దో,చోడ్ దో అన్న అరుపులు,పిల్లల ఏడుపు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ... 

ఇంతలో ఢాం అనే శబ్దం ! ఏమిటా అని తల త్రిప్పి చూస్తే ,పావురం రెండు గా చీలిపోయి పడి ఉంది.ఒక్క క్షణం అలా ఎలా పడింది అన్నది అర్ధం కాలేదు,బలి ఇచ్చారు అని తర్వాత అర్ధం అయ్యింది.

                     క్యూ లో ఉన్నప్పుడు పైనుంచి తీసినది ,పావురం ఆ వాకిలి దగ్గరే పడింది 

క్యూ లో ముందుకు వెళ్ళిన తర్వాత దృశ్యాలు  ఏమిటంటే ,పావురాలు అమ్మే వాళ్ళు ,బలి ఇచ్చిన మేక తల,తల లేని పావురం శరీరం ఇత్తడి పళ్ళెం లో పెట్టుకుని వెళ్తున్న పండాలు ,వారి వెనకే భక్తి పారవశ్యం లో భక్తులు ... అది చూడలేక ఎందుకొచ్చాను రా భగవంతుడా అని మనసులోనే మొత్తుకున్నాను . 

Sunday, 19 January 2014

మీ ఆరోగ్యం గురించి మీ పాదాలు తెలుపుతాయి

మీ పాదాలు చల్లగా అనిపిస్తున్నాయా?
రక్త ప్రసరణ సరిగా లేకపోవచ్చు (కారణం స్మోకింగ్ ,హై బ్లడ్ ప్రెజర్ ,గుండె జబ్బు)
హైపో తైరాయిడిజం లేదా అనీమియా వల్ల కావొచ్చు 
బ్లడ్ షుగర్ కంట్రోల్  లో లేకపోవటం వల్ల నరాలు దెబ్బ తినటం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు 
కారణం ఏమిటన్నది డాక్టర్ ని సంప్రదించి తెలుసుకోవాలి . 

Raynaud’s disease 

సడెన్ గా మీ కాలి వేళ్ళు తెల్లగా పాచినట్లు అయ్యి ,తర్వాత నీలం రంగు లోకి ,ఆ తర్వాత ఎరుపు రంగు లోకి మారి మళ్లీ మామూలు గా అవుతున్నాయా ?
The cause is a sudden narrowing of the arteries, called vasospasms. Stress or changes in temperature can trigger vasospasms, which usually don’t lead to other health concerns.  
రుమటాయిడ్ ఆర్త్రైటిస్ ,థైరాయిడ్ కూడా కారణాలు కావొచ్చు 

కాళ్ళు ఈడ్చినట్లు నడవటం ( Dragging Your Feet)
The cause may be the slow loss of normal sensation in your feet, brought on by peripheral nerve damage.
కారణం పాదాలు స్పర్శ కోల్పోవటం . ఈ స్పర్శ కోల్పోవటం అన్నది డయాబిటిస్ వల్ల ,ఇన్ఫెక్షన్ వల్ల లేదా విటమిన్ డెఫీషియన్సి వల్ల  కావచ్చు. 

Clubbed Toes

కారణం - లంగ్ లేదా హార్ట్ డిసీజ్ . కాలేయ ,జీర్ణ కోశ జబ్బులు లేదా ఇన్ఫెక్షన్స్. ఒక్కోసారి ఏ జబ్బు లేకపోవచ్చు.

Swollen Feet

poor circulation, a problem with the lymphatic system, or a blood clot. A kidney disorder or under active thyroid can also cause swelling

Burning Feet

A burning sensation in the feet is common among diabetics with peripheral nerve damage. It can also be caused by a vitamin B deficiency, athlete’s foot, chronic kidney disease, poor circulation in the legs and feet (peripheral arterial disease), or hypothyroidism. 

Pain in the Big Toe

Gout is a notorious cause of sudden pain in the big toe joint, along with redness and swelling . Osteoarthritis is another culprit that causes pain and swelling

Spoon-shaped Toenails

Iron deficiency 

కర్టెసీ :WebMD

 

Saturday, 18 January 2014

Nohkalikai Falls

Kba falls నుంచి ఇకో పార్క్ కి వెళ్ళాము.వర్షాకాలం లో వెళ్ళటం బెస్ట్ అనుకుంటా,అక్కడ చూడటానికి ఏమీ లేదు. కొండ పైనుంచి కనిపించే మైదానాలు బంగ్లాదేశ్ లోవి అన్నారు.అందులో నిజం ఎంతో తెలియదు.ఒక వాటర్ ఫాల్ ఉంది కాని ,నీరే లేదు :)
   
అదే వాటర్ ఫాల్ (గూగుల్ సౌజన్యం తో )

Nohkalikai Falls - ఈ జలపాతానికి ఆ పేరు పెట్టటం వెనక ఒక భయంకరమైన కథ ఉంది . kalikai అనే అమ్మాయి భర్త చనిపోవటం తో రెండో పెళ్ళి చేసుకుంటుంది.ఆవిడ కి ఒక కూతురు . ఆవిడ పనికి వెళ్ళినప్పుడు ,భర్త - ఆ  అమ్మాయి ని చంపి కూర వండుతాడు. kalikai తిరిగి వచ్చినాక కూతురు గురించి అడిగితే నాకు తెలియదు అంటాడు . ఆ అమ్మాయిని వెతకటానికి బయలుదేరబోతుంటే ఏమైనా తిని వెళ్ళమని ఆ కూరను తనతో తినిపిస్తాడు.తిన్న తర్వాత వెతకటానికి వెళ్ళబోతూ వక్కల బుట్టలో కూతురి చేతి వేళ్ళు చూసి తట్టుకోలేక దూకి చనిపోతుంది. అందుకే ఆ పేరు -  Fall of Ka Likai 

 ఫాల్స్ కి వెళ్ళే  దారి లో 

పొగ మంచు తో కప్పేసి Monday, 13 January 2014

Wah Kba Falls - Sohra

Mawkdok Dympep Valley 

ఇది షిల్లాంగ్ నుంచి చిరపుంజీ వెళ్ళే దారి లో వస్తుంది. ఆ కొండల నడుమ మబ్బులు తేలియాడుతూ ఉంటూ ఆ అందం చూడాల్సిందే ,చెప్పటానికి అవదు . వ్యాలీ నుంచి Wah Kba జలపాతాలు దగ్గరకు వెళ్ళాము. 
ఈ జలపాతాలు చూడటానికి లోయలో కి వెళ్ళాలి.మెట్లు దిగుతూ ఉన్నాము కాని ,ఎక్కడ జలపాతాలు ఉనికి లేదు.కొంత దూరం వెళ్ళాక మెట్లకు రెండు వైపులా మొగలి పొదలు ,అడవి లా ఉంది.ఎక్కడా జనాలు కూడా కనిపించటం లేదు.మొగలి పొదలు లో పాములు ఉంటాయంటారు కదా,కొంచం భయం వేసింది.తిరిగి వెళ్లి పోదామంటే ,వచ్చిన దూరం తలుచుకుంటే పైకి వెళ్ళే కంటే ఎలాగో అలా వెళ్లి ఫాల్స్ ని చూసి రావటమే బెటర్ అనిపించింది.ఇంతలో ఒక అమ్మాయి ఎదురైంది.ఆ అమ్మాయిని ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాము.చివరి వరకు వెళ్ళలేక మధ్య లో నుంచే వచ్చేసాను అని చెప్పింది.అలా నెమ్మది గా వెళుతూ ఈ ప్లేస్ కి చేరుకున్నాము.

                  
 దాన్ని చూడగానే నీరసం వచ్చేసింది.దీని కోసమా ఇంత శ్రమ పడింది అనిపించింది.ఇది కాదు ,ఇంకా చాలా క్రిందకు వెళ్ళాలి అని ఒకరు చెప్పారు. మళ్లీ నడవటం మొదలు పెట్టాము.ఇంకో మజిలీ !     ఈ నీటి దగ్గర కొంతమంది పిల్లలు ,పెద్దవాళ్ళు ఫోటో లు దిగుతూ ,నీటితో ఆడుకుంటూ కనిపించారు.అప్పటి వరకూ జనాలు ఎవరూ కనిపించటం లేదు అనుకున్నాము కదా ,వాళ్ళను చూడగానే కొంచం రిలీఫ్ !మేము కూడా ఫోటోస్ తీసుకుని కొంచం సేపు అక్కడ ఉండి మళ్ళీ బయలుదేరాము.ఈ సారి కూడా చివరి వరకు వెళ్ళలేదు కానీ ,మధ్యలో నుంచే ఫాల్స్ ని చూసి తిరిగి వచ్చేసాము. 

  
ఫాల్స్ ని చూడటానికి వెళ్ళినప్పుడు సగం దూరం లోయ లోకి వెళ్ళినాక తీసిన ఫోటో

Sunday, 12 January 2014

షిల్లాంగ్

ఒకే టైం లో రెండు వేరు వేరు ప్లేసెస్ లో ఉండాలనుకున్నావు గా ... ఓయ్ సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా ?
గౌహాతి నుంచి షిల్లాంగ్ వెళ్ళేప్పుడు ,సిటీ దాటి వచ్చేసినాక కనీసం ఒక గంట పైనే ప్రయాణం రెండు స్టేట్స్ గుండా! డివైడర్ కి ఒక వైపు అస్సాం ,రెండో వైపు మేఘాలయ.ఆశ్చర్యం ,ఆనందం కలగలిసిన అనుభూతి . గౌహాతి లో అడుగడుగుకు గుడులయితే షిల్లాంగ్ లో అడుగడుగుకు చర్చ్ లు.షిల్లాంగ్ లోని ఉమియం లేక్ కి వెళ్ళాము.చూస్తూ ఉండగానే పొగమంచు,మబ్బులు కమ్మివేయటం  వల్ల ఏమీ కనిపించలేదు.        షిల్లాంగ్ వ్యూ పాయింట్ నుంచి ...

నెక్స్ట్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము . ఇది మూడు అంచల లో ఉంది .

1st level

2nd level
3rd level

జలపాతాలు చూడాలంటే వర్షాకాలం అనువైనది ,కాని ఏమి చేస్తాము ?
అనుకున్నామని జరగవు అన్నీ ,అనుకోలేదని ఆగవు కొన్ని   :))


Thursday, 9 January 2014

వసిష్ఠ ఆశ్రమం

హజో నుంచి తిరిగి వచ్చేప్పుడు దారిలో వసిష్ఠ ఆశ్రమం ,బాలాజీ టెంపుల్,శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర చూసి ఇంటికి వచ్చేసాము.సైన్స్ మ్యూజియం కి వెళ్ళాము ,కానీ అది 4:30 కి మూసి వెయ్యటం వల్ల చూడటానికి వీలు కాలేదు.ఇంకో రోజు వెళ్ళొచ్చు అనుకున్నాము కానీ చూడకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చేసాము.బాలాజీ టెంపుల్ ,తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు.కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఒక హాల్ గుడి ప్రాంగణం లో ఉంది.మేము వెళ్ళిన రోజు 6 గంటలకు సంగీత కచేరి ఉంది.చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అని కచేరి కి అటెండ్ అవలేదు.వసిష్ఠ ఆశ్రమం లో ఉన్న స్ట్రీం(సంధ్య,కాంత,లలిత అనే మూడు నదుల సంగమం) లో ఒక మునక వేస్తే పాపాలు పోయి ఆయువు పెరుగుతుందని ,భక్తుల నమ్మకం.4 గంటలకే బాగా చీకటి పడిపోవటం తో ఫోటో అంత బాగా రాలేదు.  

             

ఆశ్రమం దగ్గర ఉన్న నాగమందిరం 
     

బాలాజీ టెంపుల్ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర మరియు అస్సాం స్టేట్ మ్యూజియం తప్పక చూడాల్సినవి . వాటి గురించి తర్వాతి పోస్ట్ లో !


Wednesday, 8 January 2014

హయగ్రీవ మాధవుని చూడటానికి హజో ...

సుక్రేశ్వరుని దర్శించుకున్నాక హజో కి బయలుదేరాము.హజో కి వెళ్ళే దారి లో సరాయిఘాట్ బ్రిడ్జ్ వస్తుంది.ఇది బ్రహ్మపుత్రా నది మీద కట్టిన మొదటి రైల్ కం రోడ్ బ్రిడ్జ్.అస్సాం ని మిగతా దేశం తో కలిపే ముఖ్యమైన లింక్ . సరాయిఘాట్ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన స్థలం.(మొఘలు లకు మరియు అస్సాం ను పరిపాలించిన అహోం రాజులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం) బ్రహ్మపుత్రా నది అందాన్ని చూస్తూ బ్రిడ్జ్ ఫోటో తీయలేదు :) హజో వెళ్ళే దారిలో రోడ్ కిరువైపులా పచ్చగా కంటికి ఆహ్లాదం కలిగిస్తూ ఆవాల చేలు. 

     
 గుడికి చేరుకునేటప్పటికి 12:30 అయ్యింది.మెట్లు చూసేప్పటికి నీరసం వచ్చేసింది.కడుపు లో ఎలుకలు కాదు,పందికొక్కులు పరుగేడుతుండటం తో అక్కడే ఉన్న స్వీట్ షాప్ లో సమోసాలు కొనుక్కుని తిన్నాము.తర్వాత ,ఆవునెయ్యి వత్తులు వేసి ఉన్న ప్రమిదలు కొనుక్కుని మెల్లగా మెట్లు ఎక్కడం మొదలు పెట్టాము. 


 పిక్ లో కనిపిస్తున్న కొలను పేరు Madhab Pukhuri .
 ఈ గుడి మోనికుట్ కొండ పైన ఉంది.1583 లో రఘుదేవ నారాయణ్ అనే రాజు కట్టించాడు.కొంతమంది చరిత్రకారులు ప్రకారం 6వ శతాబ్దం లో పాలా డైనాస్టీ కి చెందిన రాజులు కట్టించారని... 
హయగ్రీవ మాధవుని గురించి వివిధ కథలు ప్రాచుర్యం లో ఉన్నప్పటికీ ,ఆ గుడి లోని పండా చెప్పిన ప్రకారం...
 
కాశ్యప ప్రజాపతి కొడుకయిన హయగ్రీవుడు అనే రాక్షసుడు మునులను,దేవతలను హింసిస్తూ ఉండటం తో వాళ్ళు ఆ రాక్షసుని బారి నుంచి తమను కాపాడమని విష్ణువు ని ప్రార్ధించారట.ఆ రాక్షసుడుని సంహరించటానికి విష్ణువు హయగ్రీవుని   అవతారం ధరించారట.
 
    
   

Monday, 6 January 2014

సుక్రేశ్వర టెంపుల్

నవగ్రహ టెంపుల్ దగ్గర్నుంచి సుక్రేశ్వర టెంపుల్ కి వచ్చాము.ఈ గుడి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఇటాఖులి కొండ మీద ఉంది.ఈ గుడి ని అహోం రాజు ప్రమత్త సింఘా  1744 లో కట్టించాడు.అదే ప్రాంగణం లో జనార్ధన టెంపుల్ (విష్ణు) ఉంది.

సుక్రేశ్వర టెంపుల్

జనార్ధన టెంపుల్ 


ఆ తర్వాత బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పీకాక్ ఐలాండ్ కి బోట్ లో వెళ్ళాము.ఇక్కడ బస్మాచల కొండ మీద (శివుడు తపస్సు చేస్తుండ గా,కామదేవుడు ఆ తపస్సు కు ఆటంకం కలిగించటం తో శివుడు కోపం తో కామదేవుడు ని కాల్చి భస్మం చేసాడంట. అందుకని కొండకు ఆ పేరు ) శివుని గుడి ఉంది.ఈ గుడి ని అహోం డైనాస్టీ కి చెందిన రాజు గధాధర్ సింఘా 1694 లో కట్టించాడు.

పీకాక్ ఐలాండ్       
     
ఐలాండ్ లో కొండ పైన గుడి కి వెళ్ళే దారి       

Sunday, 5 January 2014

నవగ్రహ టెంపుల్

డిసెంబర్ 22 ఉదయం 7:30 కి సికింద్రాబాద్ లో గౌహాతి ఎక్స్ప్రెస్ ఎక్కి డిసెంబర్ 24 ఉదయం  8:00 గంటలకు గౌహాతి చేరుకున్నాము.రోజంతా రెస్ట్ తీసుకుని,ఆరతి బాగుంటుంది అంటే సాయంకాలం యూనిట్ లో ఉన్న కాళీ మందిరం కు వెళ్ళాము.ఆరతి కార్యక్రమం 7:00 కు మొదలయ్యి 7:30 కి ముగిసింది.మొదట అయిదు వత్తులతో ,తర్వాత సాంబ్రాణి తో , ఆ తర్వాత వింజామర తో విసరటం ... ఆరతి మొదలయ్యినప్పటి నుంచి ముగిసే వరకు ఆపకుండా డ్రం బీట్స్ ,గంటలు మోగిస్తూనే ఉన్నారు.డ్రం బీట్స్ చాలా బాగున్నాయి.అవి వినటానికయినా రోజూ గుడికి వెళ్లాలనిపించింది.

నెక్స్ట్ డే ,చిత్రాంచల్ పర్వతం పైన ఉన్న నవగ్రహమందిరానికి వెళ్ళాము.ఈ గుడి 18వ శతాబ్దం లో అహోం రాజు రాజేశ్వర్ సింఘా కట్టించాడు.ఈ గుడి లో 9 శివలింగాలు ఉన్నాయి.ఒక్కోటి ఒక్కో గ్రహాన్ని సూచిస్తుంది.మధ్యలో ఉన్నది సూర్య గ్రహాన్ని ... చుట్టూ ఉన్నవి మిగతా గ్రహాలు . 


                  గుడి వెలుపల
గుడి లోపల