Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Sunday, 29 September 2019

చాక్ అండ్ డస్టర్


చాలాకాలం గా మన సినిమాలలో టీచర్లను బఫూన్ ల లాగా చూపిస్తున్నారు. అందుకు భిన్నం గా టీచర్లను గొప్పగా చూపిస్తూ తీసిన చిత్రమే ఈ చాక్ అండ్ డస్టర్ . నాటకీయత పాలు కొంచం ఎక్కువైనా,కొద్దిపాటి లోపాలున్నా   అంతగా పట్టించుకోనక్కరలేదు. సినిమా అద్భుతం అని చెప్పను కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సెలెబ్రిటీ ల పుట్టినరోజులు గుర్తుంచుకుని మరీ విష్ చేస్తాము. గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్తాము  కానీ మనకు చదువు నేర్పించిన గురువును గుర్తు పెట్టుకుని  వారికి విషెస్ చెప్పము అని. నిజమే కదా ! సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే జరుపుకుంటాము.ఆ రోజైనా గురువులకు ఎంతమందిమి విష్ చేస్తాము ? ఈ సినిమా చూడాలని అనుకునేవారు కోసం లింక్ ఇస్తున్నాను. 





   

Saturday, 3 September 2016

జనతా గారేజ్



కాన్సెప్ట్ బాగుంది కానీ తీసిన విధానం చాలా బోరింగ్ . స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే మీద ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది. ఇంటర్వెల్ వరకు ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని , ఆ తర్వాత సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది.(మధ్య మధ్య లో కొన్ని సీన్స్ exception) ప్రణామం అన్న పాట బాగుంది . పర్యావరణం ,పొల్యూషన్ గురించి మాట్లాడే హీరో , ఫ్రెండ్స్ తో కలసి అడవుల్లోకి బైక్ మీద వెళతాడు.మొక్కల్ని ప్రేమించే మనిషి ,మనుషులను భయంకరం గా కొట్టగలడా ? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కాజల్ డాన్స్ ఎందుకో తెలియదు. NTR నటన బాగుంది.ఇప్పుడు వస్తున్న రొటీన్ సినిమాలలోని హీరోకు(పబ్బుల్లో తాగి చిందులు తొక్కటం,etc)  భిన్నం గా హీరో ని చూపించినందుకు సంతోషం. 






Wednesday, 20 April 2011

మెటిల్డా

మెటిల్డా 
డైరెక్టర్ -Danny DeVito

Writer: Roald Dahl 

screenplay :Nicholas Kazan 

మెటిల్డా చాలా తెలివైన అమ్మాయి.స్కూల్ కి వెళ్ళటం,పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.ఇంట్లో మిగతా ముగ్గురు(తల్లి,తండ్రి,అన్న)కి టి.వి.కాలక్షేపం.తల్లి బింగో ఆడుతుంటుంది.తండ్రి కార్ల అమ్మకం చేస్తుంటాడు.మెటిల్డా చెపితేనే కానీ ,తనను స్కూల్ కి పంపే వయసు వచ్చిందని తెలుసుకోలేనంత గా తమ వ్యాపకాల లో మునిగి పోయి ఉంటారు.ఎలాగైతేనేం ,మెటిల్డా ని స్కూల్ కి పంపిస్తారు.ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పరమ క్రూరురాలు.మెటిల్డా తనకున్న పవర్స్ తో ...ఆ ప్రిన్సిపాల్ ని స్కూల్ నుంచి ఎలా పంపించివేసింది,తన టీచర్ కు ...ప్రిన్సిపాల్ నుంచి ,ఆమె ప్రాపర్టీ ని తిరిగి ఎలా ఇప్పించింది అన్నది కథ.మెటిల్డా గా మారా విల్సన్ చాలా బాగా యాక్ట్ చేసింది.చాలా క్యూట్ గా ఉంది.ప్రిన్సిపాల్ పాత్ర లో Danny DeVito అంతే బాగా యాక్ట్ చేసింది.పిల్లలకు,చైల్డిష్ మెంటాలిటీ ఉన్న నా లాంటి పెద్దలకు నచ్చే సినిమా ఇది. 







Monday, 18 October 2010

ఖలేజా చూడాలంటే ఖలేజా ఉండాలి

కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసా.ఎదురుగా మా కాలనీ వాళ్ళందరూ కనిపించారు.ఏమయ్యింది ,కట్ట కట్టుకుని అందరూ ఒకసారే వచ్చారు అని మనసులో అనుకుంటూ  పైకి మాత్రం ఒక చిరునవ్వు విసిరా.అందరూ దణ్ణాలు పెట్టుతూ అను గారు ,మీరు దేవత,మమ్మల్ని ఈ దరిద్రపుగొట్టు సినిమా ల బారి నుంచి రక్షించటానికి వచ్చిన దేవత అన్నారు.మనసులో ఉప్పొంగిపోతూ పైకి మాత్రం అమాయక ఫేస్ తో నేను దేవత ఏమిటండీ,ఖలేజ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యిందా?అన్నాను.బ్లాక్ అవలేదు,వైట్ అవలేదు కానీ మీరు మా దేవత,దేవత అని కోరస్ పలికారు.ఊ...మీరు ఇన్నిసార్లు నన్ను దేవత అంటుంటే నాకు నిజమేనేమో అని అనిపిస్తుంది.రావిచెట్టు కు పూలు పూయించాలా?మందార చెట్టుకు కాయలు కాయించాలా ?నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆవేశం గా అన్నాను.అవేమీ వద్దు కానీ ,సూర్య,త్రివిక్రమ్ అనే వాళ్ళు సినిమాలు డైరెక్ట్ చేయకుండా చేయండి చాలు అన్నారు.ఏంటీ?ఆ పని నేను చేయగలనా అని ఆశ్చర్య పోయాను.హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు ,మీకు మీ శక్తి తెలియట్లేదు తల్లీ ....మీరు అనుకోండి చాలు అంతే అయిపోతుంది అన్నారు వాళ్ళు.సరే అని అనుకున్నాను.వెంటనే t .v 9  లో బ్రేకింగ్ న్యూస్ అని 'సూర్య,త్రివిక్రం ఇక నుంచి డైరెక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని 'ఫ్లాష్ చేసాడు.హా!నిజంగా నాకు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్య పడెంతలో...ఢాం అని పెద్దగా శబ్దం వినిపించి ఉలిక్కిపడి ఇహలోకం లోకి వచ్చాను.అయ్యో ఇదంతా ఊహేనా,నిజం అయితే ఎంత బాగుండు అనిపించింది.
 
   ఖలేజాలో మహేష్ కొత్తగా కాదు ,పరమ చెత్తగా నటించాడు.బూతు డైలాగులు వల్లించటమే కొత్తదనం అనుకుంటున్నారు ....డైరెక్టర్ ,హీరో లు.అనూష్క కారెక్టర్,సినిమా లో లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు.పరమ వేస్ట్ ,చీము,నెత్తురు లేని డంబ్ కారెక్టర్ .ఈ సినిమా చూడాలంటే చూసిన తరువాత కలిగే వికారాలను తట్టుకునే ఖలేజా,ముందుమనకుఉండాలి.ఈ సినిమా చూస్తే,టైం,మనీ ,
మైండ్ ...పోవటం ఖాయం.

Sunday, 20 June 2010

రావణ్

రావణ్ సినిమా విడుదలైన మరుసటి రోజే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసాము.నేను అతి కష్టం మీద ఒక పావు గంట మాత్రమే చూసాను.సినిమా అంత దరిద్రంగా ఉంది మరి(ప్రింట్ అనుకునేరు,ప్రింట్ కాదు).విక్రం ఐ న్యూస్ లో ఇంటర్వ్యు ఇస్తూ ఒక్క బాష లో కాదు,మూడు బాషల్లోనూ సినిమా ను చూడండి అని చెప్పాడు.ఒకటి చూడటమే కష్టం అయితే  ఇక మూడూ బాషల్లోనూ ఏమి చూస్తాము?  సినిమాలో  రాంజా,రాంజా ,బెహనేదో ....ఈ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి.