Thursday 23 December 2010

జీవితం


జీవితం ఓ హిమసాగరం
సమస్యల సూర్యకిరణాలు తాకితే
కరిగి తల్లడిల్లుతుంది ఘోషగా
సుఖాల మలయపవనాలు వీచినప్పుడు
నిశ్చల మనోప్రాంగణంలో ప్రశాంతంగా నిదురిస్తుంది.
*************************************
జీవితాన్ని ఎంతో మంది ఎన్నో విధాలు గా నిర్వచించారు.సినీ కవులు జీవితాన్ని పోరాటం ,ఆట,దీపావళి తో పోల్చారు.దేనికదే సరైన నిర్వచనం అనిపిస్తుంది.జీవితం గురించి నాకు నచ్చిన  'Quotes' కొన్ని.

.*  Life is a rope that swings us through hope.

* Like a rose,Life was meant to have its thorns.Let the beauty  of     the rose inspire you,don't let the thorns discourage you. 

* Life is not a problem to be solved,but a gift to be enjoyed. 


Life is like Piano
the white keys represent happiness
and black shows sadness
but as you go through life's journey
remember that the black keys too make music

We grow old filled with regrets for things not done,for words not said,for love not shown,for dreams not completed.Life is short,Act today.Do all that makes you happy now.

జీవితం ఎంతో చిన్నది కదా!మరి దాన్ని సద్వినియోగపర్చుకోండి.

Laugh when you can
Apologize when you should
Let go off what you can't change
Forgive quickly
Take chances&have no regrets

Tuesday 21 December 2010

మా పిల్లల తెలుగు


ఆడుకోటానికి వెళ్ళిన మా అమ్మాయ్,అమ్మా అన్నం చేసావా?ఆకలేస్తుంది అంటూ వచ్చింది.అన్నం చేసావా ఏంటి?ఏం భాష అది?అన్నం వండావా   అనాలి అన్నాను నేను.
ఆ...అదేలే చేసావా?మా అమ్మాయి.
మళ్ళీ అదే మాట...నేను
ఏదోలే అమ్మా ,నాకు అన్నం పెట్టు ఆకలి గా ఉంది అంది మా అమ్మాయి.
ఏం బాష,ఆ....అదేలే,ఏదోలే ఈ టైపు సంబాషణ మా ఇంట్లో ప్రతి రోజూ మాక్జిమం ఎన్నిసార్లో చెప్పలేను కానీ మినిమం ఒక్కసారైనా వుంటుంది.
నా జుట్టులు ఊడిపోతున్నాయి,ఏదో ఒకటి చెయ్యమ్మా అంటుంది.
జుట్టులు కాదు.......వెంట్రుకలు అనాలి అని నేను అంటే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అన్నట్లు  ఆ...అదేలే అని మా అమ్మాయి రొటీను సమాధానం.
పెరుగు కొంచం పులిసినట్లున్నా ఈ పెరుగు కుళ్లిపోయింది, నాకొద్దు అంటుంది.
కూరగాయలు,పళ్ళు అయితే కుళ్ళిపోయాయి అంటారు,పెరుగు పులిసిపోయింది అనాలి అని నేనంటే తన రొటీన్ డైలాగ్ వదులుతుంది.
పెరుగు వేసేటప్పుడు కొత్తదా,పాతదా అని అడుగుతుంది.
పెరుగు కొత్తదా,పాతదా ఏంటే,నీ బాష తో నన్ను చంపుతున్నావు-నేను
తన దృష్టిలో కొత్తది అంటే మధ్యాహ్నభోజనం లోకయితే పొద్దున్న తోడుపెట్టినది,రాత్రి భోజనం లోకి అయితే మధ్యాహ్నం తోడుబెట్టినది . ముందు రోజు తోడుపెట్టినది అయితే పాత పెరుగు.ఆ పెరుగు వేసుకోదన్నమాట.
మా అమ్మాయి మాటలు ఇలా ఉంటే ,మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ప్రతి దానికి దొరికింది అనే మాట వాడుతుంది.
మచ్చుకు కొన్ని......
నాకు రన్నింగ్ రేస్ లో సెకండ్ ప్రైజ్ దొరికింది.
ఇవాళ సాకేత్ బర్త్డే ,అందరికీ ఒక చాక్లేటే,నాకు రెండు చాక్లెట్లు దొరికాయి.
నేను విన్నప్పుడు సరిచేస్తూ ఉంటాను.
ఒకరోజు స్కూల్ నుంచి  నాకు రోప్ దొరికిన్దంటూ వచ్చింది.రోప్ దొరకటం ఏమిటి?ఎక్కడ దొరికింది అని అడిగాను నేను.అమ్మ ఫిఫ్టీన్రూపీస్ ఇచ్చిందా,టెన్ రూపీస్ కి ఈ రోప్ దొరికింది.
బాడ్జ్ ఫైవ్ రూపీస్,బాడ్జ్ దొరకలేదు ,అందుకని చాక్లెట్ కొనుక్కొని తిన్నాను అంది.డబ్బులు పెట్టి 
కొనుక్కున్నావు కదా,రోప్ కొనుక్కున్నాను అనాలి,
దొరికిందని అనకూడదు అని చెప్పాను. అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ని సప్పోర్ట్ చేస్తాడు.వాళ్ళ అమ్మాయి మాటలన్నీ కరక్టే అంటాడు.హిందీ లో ప్రైజ్ మిలా అంటారు,అంటే దొరికిందనే కదా అర్ధం.ప్రైజ్ వచ్చిందన్నా ,దొరికిన్దన్నా ...ఏదైనా కరెక్టే అని వాదిస్తాడు.సరే వాళ్ళ నాన్నే అలా మాట్లాడుతుంటే ,ఇంక ఆ అమ్మాయి ఏమి నేర్చుకుంటుందిలే అని నేను వదిలేసాను.దేవుడి ని వేడుకుంటున్నాను.......నేను తెలుగు మర్చిపోవటమో, మా పిల్లలు సరైన తెలుగు మాట్లాడటమో ...ఈ రెండిటి లో ఏదో ఒకటి చేయమని.ఈ రెండిటి లో మొదటి కోరిక  నేరవేర్చటమే దేవుడికి కూడా ఈజీ అనుకుంటా.

Sunday 12 December 2010

సంక్రాంతి

డిసెంబర్-16సంక్రాంతి నెల మొదలు.పండగలన్నింటి లోకి నాకు సంక్రాంతి పండగ అంటే చాలా ఇష్టం.దసరా,వినాయకచవితి,శ్రీరామనవమి లాంటి పండగలు వారం రోజులపాటు సందడి చేస్తే ,సంక్రాంతి పండగ కు మటుకు నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.ఇప్పటి రోజుల గురించి కాదు,మా చిన్నప్పటి సంగతి.ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడాకళా,కాంతికోల్పోయింది.నెలపట్టినరోజునుంచిసంక్రాంతిప్రత్యేకముగ్గులు
గొబ్బెమ్మలు,వాటిపైనబంతిపూలతోవాకిళ్ళుకళకళ,హరిదాసులు,గంగిరెద్దులవాళ్ళు,బుడబుక్కలవాళ్లు,కాబూలివాళ్ళు వస్తే వాళ్లకు బియ్యం వెయ్యటానికి....మాచెల్లెళ్లలతోపోటిపడటం ,అరిసెలు వండుతుంటే...బెల్లం పాకం కోసం...ప్లేట్ లోనీళ్ళు పోసుకుని ఎదురు చూడటం,చలిమిడి కోసం...నాకు ముందు అంటే నాకు ముందు అని గోల చెయ్యటం,వండిన అరిసెలను గడ్డి పై ఆరబెట్టటానికిపరుగులు పెట్టటం,  
పరుగులుపెడుతూనే,ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది అన్న అమ్మమ్మ మాటలు లెక్కచేయకుండా  అందులో కొన్ని అరిసెలను స్వాహా చెయ్యటం, ధాన్యపుబస్తాలనే ప్లే గ్రౌండ్ గాచేసుకుని ఆటలుఆడటం,భోగి మంటలు .....అవిఅన్నీ గుర్తుకు వస్తే,ఆదిత్య 369సినిమా లో లాగా టైం మెషీన్ ఒకటి దొరికి అప్పటి రోజులలోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోవాలని ఉంది.

Wednesday 8 December 2010

వాడిన గులాబీ

ఈ రోజు ఓ పుస్తకం తిరగేస్తుంటే కనిపించింది.
 వాడిపోయి,ఎండిపోయిన ఓ గులాబీ
దాన్ని చూడగానే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి
   ఒకప్పుడు అది మంచి రంగులో ఉండేది.
దాని అందం ప్రాతః కాలపు మంచు లా ఉండేది
అది ఒకప్పుడు  నువ్వు ,నాకు పంపిన గులాబీయే
ఇప్పుడు పుస్తకంలో రంగు పోయి,ఎండిపోయి ఉంది.
నా హృదయం బాధతో విలవిలలాడుతోంది
 మూగగా రోదిస్తుంది.
ఎర్ర రోజాపుష్పాల బొకేలో "ఫర్ సం ఒన్ స్పెషల్ "
అని రాసున్న ట్యాగ్ పట్టుకుని వచ్చింది.



ఇప్పుడు ఒంటరి గా వాడిపోయి ఉంది.
చనిపోయిన ప్రేమకు సాక్ష్యంగా .



ఆ గులాబీ ని ఎప్పటికి దాచుకుంటాను,ఎందుకంటే
ప్రేమ మళ్ళీ నా గుండె తలుపు తట్టినప్పుడు
ఇంతకు ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా
హెచ్చరిస్తూ ఉంటుందని  

ఇంగ్లిష్ లో చదివిన ఒక పోయం నచ్చి ఇలా తెలుగు(మక్కీ కి మక్కీ అనువాదం కాదు కానీ)  లో రాసాను.ఎలా ఉంది?

Saturday 4 December 2010

ఆడవాళ్ళమండి,చాలా గొప్పవాళ్ళ మండి


అమ్మ చెప్పినట్లు వదిన చేయకపోతే ,అమ్మ ను వదిన గౌరవించటం లేదు,సరిగా చూడటం లేదు అంటాం,అదే మన అత్తగారు మనకేమైనా సలహా ఇస్తే పాటించకపోగా,అన్నిట్లోనూ ఈవిడ జోక్యం చేసుకుంటుంది అనుకుంటాము.
అన్న వదినను   అపురూపంగాచూసుకుంటే,పెళ్ళాం   కొంగుపట్టుకుతిరుగుతున్నాడు,పెళ్ళాంవచ్చాక తల్లి,తోబుట్టువులు పనికిరాని
 వారై పోయారు  అంటాం,మన శ్రీవారు మాత్రం వాళ్ళ వాళ్లకు ప్రాముఖ్యం ఇవ్వకుండా ,మన మాట వింటూ మన చుట్టే తిరగాలి.
కోడలు తెచ్చిన కట్నం చాలలేదని రాచి రంపాన పెడతాము,మన అమ్మాయిని మాత్రం అత్తవారి ఇంట్లో బాగా చూడాలి అనుకుంటాము.
అందరూ ఆడవాళ్లే,కానీ ఏ ఇద్దరినీ సమానంగా చూడలేము.
పిల్లలు లేని వాళ్ళను గొడ్రాలు అని అవమానిస్తాం.భర్త చనిపోయిన స్త్రీ పొద్దున్నే కనిపిస్తే ,పొద్దున్నే దీని మొహం చూడాల్సి వచ్చిందని వాపోతాం.
పెళ్ళైనవాడని తెలిసినా ...అతనినే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకో ఆడదాని జీవితం లో కలతలు రేపుతాం.
సాటి ఆడవారు అని అయినా చూడకుండా అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తాం.
డబ్బుల కోసం ....సినిమాలలో,అడ్వర్ టైజ్మెంట్లలో అంగాంగ ప్రదర్శనలు చేస్తాం,పొట్టకూటి కోసమని సమర్ధించుకుంటాం.
మగవాళ్ళ దౌర్జన్యాలగురించి ప్రశ్నిస్తాము కానీ,మనసాటివారి మీద మనమే చేస్తున్న  దౌర్జన్యాల గురించి,వారిని పెట్టే మానసిక హింస గురించి ఎవరం మాట్లాడం.ఎందుకంటే మనం ఆడవాళ్ళం ,గొప్పవాళ్ళం కదా !

హైదరాబాద్ లో కన్నతల్లే తన ముగ్గురు కుమార్తెలతో బలవంతం గా వ్యభిచారం చేయిస్తుందన్న వార్త చూసిన తరువాత...ఇలా రాయాలని
అనిపించింది.

Tuesday 23 November 2010

అబ్బాయిలూ,అంకుళ్ళూ,మీ హక్కు ను మీరు తిరిగి సాధించుకోండి

ఇది కేవలం సరదా కోసం రాసింది.అఫెండ్ అయ్యే మేటర్ ఏమీ లేదు కానీ ,ముందు జాగ్రత్తగా తెలియచేస్తున్నాను.

మా ఫ్రెండ్ విజయ..రేపు నేను సెలవు తీసుకుంటున్నాను అంటే ఎందుకు అని అడిగా.వాళ్ళ అమ్మగారు అర్జంట్ గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందని,
రేపువంట తనే చెయ్యాలి కాబట్టి సెలవుతీసుకుంటున్నా అంది.ఏమన్నా డవుట్స్ వస్తే ఫోన్ చేస్తానని చెప్పింది.నాకు వంట అంతంత మాత్రమే వచ్చు.సరే నాకు తెలిస్తే చెపుతాలే అన్నాను నేను.నెక్స్ట్ డే 11  గంటలకు విజయ ఫోన్ .మామిడికాయ పప్పు వండుతున్నాను.అందులో ఉప్పు వేస్తారా?అని.ఒక్కసారే విరగబడి నవ్వటం మొదలు.మా రిసెప్షనిస్ట్ నన్ను వింతగా చూడటం గమనించి ,బలవంతాన నవ్వు ఆపుకుని,వేయాలి అని చెప్పాను.మామిడి కాయ పుల్లగా ఉంటుంది కదా ,ఉప్పు వేస్తారా?మళ్లీ అడిగింది.ఏ కూర లో అయినా ఉప్పు కారం వేస్తారు.మామిడికాయ పుల్లగా ఉంటే పులుపు కోసం చింతపండు వెయ్యరు కానీ ఉప్పు వెయ్యాలి అని చెప్పాను.సరే నేను ఇలా అడిగానని ఎవరికీ చెప్పకే ప్లీజ్ అంది తను.ఎవరికి చెప్పనని హామీ ఇచ్చాక కానీ ఫోన్ పెట్టేయలేదు.మరుసటి రోజు ఇన్స్టిట్యూట్ లో తనని చూసాక ,అమ్మయ్య ,బాగానే ఉన్నావా?నీ వంట తిన్నాకా మీరందరూ ఎలా ఉన్నారో అని భయపడ్డాను అన్నాను.ఈ వంట ఆడవాళ్లే చెయ్యాలని రూల్ ఎవరు పెట్టారో అంది తను.ఇంక ఎవరూ?మన ఆడవాళ్లే,సమానత్వం పేరు తో వంట చేసే హక్కును మగవాళ్లనుంచి లాక్కున్నాం,పాపం మగవాళ్ళు ... వాళ్ళ హక్కును కోల్పోయినందుకు ఎంత బాధపడుతున్నారో ,ఏమిటో!అన్నాను.ఏమిటి,వంట చెయ్యటం మగవాళ్ళ హక్కా?అంది విజయ.అవును.నలభీమపాకం అనే మాట విన్నాం కానీ,దమయంతి హిడింబి పాకం అనే మాట ఎప్పుడైనా విన్నామా?పురాణాల కాలం నుంచి కూడా మగవాళ్ళే వంట చేసేవారు.మనవాళ్ళు ఎప్పుడు ఆ హక్కును మగవారి నుంచి లాక్కున్నారో కానీ ,వంట చేసే తిప్పలు మనకు వచ్చాయి అన్నాను నేను.మగవారు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు మొదలు పెట్టారు గా,మొట్ట మొదటగా వంట చేసే హక్కును సాధించుకుంటే బాగుంటుంది కదా అంది తను.అవును అని వంతపాడాను.అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజయినా,అలాంటి ఉద్యమం ఏమయినా చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసాము.మా ఆశ అడియాస అయ్యింది.
"ఆశా నిరాశేనా?జీవితానా వంట చెయ్యటం తప్పదా "
అని పాడుకుంటున్న మాకు ,రెండు రోజుల క్రితం బ్లాగ్ వాతావరణం చూసాకా మిణుకు,మిణుకు మంటున్న మా ఆశ,1000 వాట్ల బలుబు లాగా వెలిగింది. అబ్బాయిలూ,అంకుళ్ళూ,పోటీ పడి చేసిన వంటలు చూసాకా ,పాపం వాళ్ళు ఇన్ని రోజులూ ,వాళ్ళ హక్కును కోల్పోయి ఎంత బాధపడి ఉంటారో కదా అనిపించింది.అందుకనే అబ్బాయిలూ,అంకుళ్ళూ,మీ హక్కు కోసం ఇప్పటికైనా ఉద్యమించండి.వంట చేసే హక్కును సాధించుకోండి.నాలాంటి,విజయ లాంటి వాళ్ళ సప్పోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.

Thursday 18 November 2010

ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై

నా ఆధీనం లో నేను లేను.నా మనసు ఒకచోట,తనువు ఒకచోట ఉంది.నా మనసు గాలి లో తేలిపోతుంది.ఇవాళ మళ్లీ జీవించాలని ఉంది.ఇవాళ మళ్లీ చనిపోవాలని ఉంది.నిన్నటి అంధకారం లో నుంచి బయటకు వచ్చి మనసు లోలోనే రేపటిని చూస్తున్నాను.కొత్త దారిలో ప్రయాణిస్తున్నాను.ప్రయాణంలో ఎక్కడైనా తప్పిపోతానేమో!ఇవాళ మళ్లీ జీవించాలని ఉంది.ఇవాళ మళ్లీ చనిపోవాలని ఉంది.గైడ్ సినిమా లోని 'ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై'అన్న ఈ పాట నాకు చాలా,చాలా......ఇష్టం.మీరూ వినండి/చూడండి. 

Wednesday 17 November 2010

నిక్ నేమ్స్

ఇవాళ ఎందుకో అకస్మాత్తుగా మా కాలేజ్ ఫ్రెండ్స్,లెక్చరర్స్,మేము వాళ్లకు పెట్టిన నిక్ నేమ్స్  గుర్తొచ్చాయి.జీవితంలో ప్రతి ఒక్కరూ,ఎప్పుడో ఒకప్పుడు ,ఎవరికో ఒకరికి,సరదా గానో,కోపం తోనో నిక్ నేమ్ పెట్టని వారు ఉండరేమో కదా?
మా కెమిస్ట్రీ మేడంకు -బి.పి.మేడం....మా కెమిస్ట్రీ మేడం చాలా సాఫ్ట్.చాలా నెమ్మది గా మాట్లాడే వారు.కానీ ఉన్నట్టుండి ఏమయ్యేదో తెలియదు గానీ ,ఒక్కసారే పూనకం వచ్చినట్లు పెద్ద,పెద్దగా అరిచేసేవారు.అందుకని ఆ పేరు.
ప్లాంట్ పాథాలజీ సర్ కు-చార్కోల్ రాట్....ఈ పేరు ఆయన టీచ్ చేసే సబ్జెక్టు కు రిలేటెడ్.ఆయన చాలా నల్లగా ఉండేవారు.అందుకని ఆ పేరు  పెట్టాము.
(చార్కోల్ రాట్ వ్యాధి వచ్చిన మొక్క,వ్రేళ్ళు,ఆకులు,కాయలు,పళ్ళు,ఏ భాగం అఫెక్ట్ అయితే ఆ భాగం నల్లగా చార్కోల్ లాగా అవుతుంది.)
ఎంటమాలజి సర్ కు-ఇన్ సెక్ట్....ఇది కూడా సబ్జెక్టు కు రిలేటెడ్.సర్, పొట్టిగా చాలా సన్నగా గాలి వీస్తే పడిపోయేలాగా ఉండేవారు.
ఇంగ్లిష్ మేడం కు -చైనీ డాల్ ...
బొద్దుగా,ముద్దుగా చైనీయుల పోలికలతో,బొమ్మ  లా ఉండేవారు.
హాస్టల్ వార్డన్ సిస్టర్ మెర్సీ కు-సాడిస్ట్,డెవిల్.....నేతిబీరకాయ లో నెయ్యి ఎంతో సిస్టర్ మెర్సీ లో మెర్సీ అంత.అసలు జాలి,దయ అనే మాటలకు అర్ధం తెలియదు ఆమెకు.అరటికాయ తొక్కల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయని ,ఆ తొక్కల తో కూర వండించి హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ తో తిన్పించిన ఘనత ఆమెది.
 క్లాస్మేట్ డేవిస్- టిక్రో(తమిల్నాడ్ కాకి)నల్లగా ,ముక్కు కాకి ముక్కులా షార్ప్ గా ఉండేది.
మా క్లాస్ లో వివేకానంద పేరు గల వాళ్ళు  ఇద్దరు ఉండేవారు.అందులో ఒకరు లావుగా,1984ఒలింపిక్స్ మస్కట్ అప్పు లాగా ఉండేవాడు.అందుకని అతనికి అప్పు అని పేరు.రెండో అతను ఎప్పుడూ కళ్ళు ఆర్పుతూ ఉండేవాడు.అతనికి బ్లింక్ అని పేరు పెట్టాము.కానీ తరువాత అదొక జబ్బు అని,నర్వస్ వీక్నేస్స్ వల్ల అని తెలిసి అలా పిలవటం మానివేసాము.
మా ప్రిన్సిపాల్ గారు మా క్లాస్ వాళ్ళందరికీ కలిపి ఇచ్చిన బిరుదు-రౌడీ బ్యాచ్ అని.

Tuesday 16 November 2010

Why are there so many different philosophies?

 Why are there so many different philosophies?

 పై ప్రశ్న కు "Art of Living" గురువు శ్రీ రవిశంకర్ గారు ఇచ్చిన సమాధానం.

 Why not? God loves diversity. What if there was only okra to eat? But you have potatoes, tomatoes, beans, all kinds of fruits, vegetables and flowers. God seems to love diversity. He has created so many of us in different shapes, features and colors. He is definitely not a military person, an army general. A spirit that loves diversity must be diverse in itself too. That is what the rishis (Ancient saints) found in meditation. There is only one Ganesh and one Vishnu, but in so many different forms. See unity in diversity and celebrate diversity. Our rishis in the past had spoken of tolerance, acceptance, diversity and equal opportunity.

Why the difference? Find the common thread in different religions. According to different places, there are different customs. Time has created differences. There was one Buddha, now we have thirty-two forms of Buddhism, one Jesus Christ and now seventy-two sects of Christianity, and one Prophet Mohammed and now five different sects of Islam. In Hinduism, the variations cannot even be counted! But everyone believes in the Vedas, the Upanishads. How many different sects? Why should they not be there? Let it be there. See unity in diversity.

Monday 25 October 2010

కొలస్ట్రాల్-మంచీ,చెడు



కొలస్ట్రాల్ రెండు రకాలు.మంచి కొలస్ట్రాల్(HDL కొలస్ట్రాల్)చెడు కొలస్ట్రాల్(LDL కొలస్ట్రాల్)

LDL కొలస్ట్రాల్:
కొలస్ట్రాల్ రక్తం ద్వారా లిపో ప్రోటీన్స్ అనబడే ప్రోటీన్ ప్యాకేజస్ లో ప్రయాణిస్తూ ఉంటుంది.మన శరీరం లోని కణాలు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ ldlఉత్పత్తి అయితే ఆ కొలస్ట్రాల్ ధమనుల గోడలు కు పేరుకుపోతుంది.(atherosclerotic plaque ).
HDL కొలస్ట్రాల్:
ఈ కొలస్ట్రాల్ ధమనుల గోడలు కు ఉన్న LDL కొలస్ట్రాల్ డిపాజిట్స్ ను లివర్ కు పంపిస్తుంది.Inflammation (వాపు) ను అణచి వేసి ధమను ల లోపలి కణజాలాన్ని రక్షిస్తుంది.యాంటి ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది.Antithromboticగా పనిచేస్తుంది.కరోనరీ ఆర్టరీస్ లో  క్లాట్స్ ఏర్పడకుండా చేయటం ద్వారా గుండెపోటు ను నిరోధిస్తుంది.మన శరీరం లో HDL కొలస్ట్రాల్ తక్కువ ఉన్నట్లయితే గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువ. LDL కొలస్ట్రాల్  ఎక్కువ స్థాయి లో ఉండటం కంటే  HDL కొలస్ట్రాల్  తక్కువ స్థాయి లో ఉండటం  ప్రమాదకరం. 

కొలస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్స్ లెవెల్స్ &వర్గాలు
Total cholesterol level                           category

Less than 200 mg/dL                          Desirable
200–239 mg/dL                                Borderline high

240 mg/dL and above                            High


LDL cholesterol level


Less than 100 mg/dL                            Optimal


 (less than 70 mg/dL for people at high risk)

100–129 mg/dL                           above optimal
130–159 mg/dL                           Borderline high

160–189 mg/dL                                High

190 mg/dL and above                    Very high


HDL cholesterol level


Less than 40 mg/dL                Low (representing risk)

60 mg/dL and above                High (heart-protective)


Triglyceride Level

Less than 150 mg/dL                          Normal

150–199 mg/dL                            Borderline high

200–499 mg/dL                                   High

500 mg/dL and above                       Very high
మనం తినే ఆహారాన్ని  బట్టి మన ఒంట్లో కొలస్ట్రాల్ స్థాయులు ఆధారపడి ఉన్నాయి.వివిధ ఆహార పదార్ధాలు కొలస్ట్రాల్ స్థాయి ని తగ్గిస్తాయి.కొన్ని కరిగే పీచు పదార్ధాన్ని విడుదల చేసి కొలస్ట్రాల్ రక్తం లో కలవకుండా నిరోదిస్తే , కొన్ని పాలీఅన్సాచురేటేడ్  ఫాట్స్ ద్వారా డైరెక్ట్ గా చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

కొలస్ట్రాల్ ను తగ్గించే  ఆహార పదార్ధాలు:
వోట్స్,బార్లీ,బీన్స్,వంకాయ,బెండ,నట్స్,పొద్దుతిరుగుడు,కుసుమ గింజల నూనె,యాపిల్స్,ద్రాక్ష,స్ట్రాబెర్రీలు,సిట్రస్ జాతికి చెందిన పళ్ళు(నిమ్మ,బత్తాయి,నారింజ,కమలా),సోయా పాలు,ఇతర సోయా  ఉత్పత్తులు.

నిషేధించవల్సిన ఆహార పదార్ధాలు:
సాచు రేటెడ్ ఫాట్స్.మాంసం,పాలు మరియు ఇతర డైరీ ప్రాడక్ట్స్ .
కొబ్బరి,పాం ఆయిల్  లో సాచు రేటెడ్ ఫాట్స్ ఉంటాయి.
ట్రాన్స్ ఫాట్స్ -కుకీస్ మరియు వేపుడు పదార్ధాలలో ఉంటాయి.ఇవి చెడు కొలస్ట్రాల్ ను పెంచటమే గాకుండా మంచి కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బ్లడ్ వెస్సెల్స్ లో బ్లడ్ క్లాట్ అవటానికి కారణం అవుతాయి.ఈ ట్రాన్స్ ఫాట్స్ అనేవి మన ఆహారం లో రోజుకు రెండు గ్రాములు మించకూడదు.

Source :Harvard Medical School  Newsletter  

Monday 18 October 2010

ఖలేజా చూడాలంటే ఖలేజా ఉండాలి

కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసా.ఎదురుగా మా కాలనీ వాళ్ళందరూ కనిపించారు.ఏమయ్యింది ,కట్ట కట్టుకుని అందరూ ఒకసారే వచ్చారు అని మనసులో అనుకుంటూ  పైకి మాత్రం ఒక చిరునవ్వు విసిరా.అందరూ దణ్ణాలు పెట్టుతూ అను గారు ,మీరు దేవత,మమ్మల్ని ఈ దరిద్రపుగొట్టు సినిమా ల బారి నుంచి రక్షించటానికి వచ్చిన దేవత అన్నారు.మనసులో ఉప్పొంగిపోతూ పైకి మాత్రం అమాయక ఫేస్ తో నేను దేవత ఏమిటండీ,ఖలేజ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యిందా?అన్నాను.బ్లాక్ అవలేదు,వైట్ అవలేదు కానీ మీరు మా దేవత,దేవత అని కోరస్ పలికారు.ఊ...మీరు ఇన్నిసార్లు నన్ను దేవత అంటుంటే నాకు నిజమేనేమో అని అనిపిస్తుంది.రావిచెట్టు కు పూలు పూయించాలా?మందార చెట్టుకు కాయలు కాయించాలా ?నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆవేశం గా అన్నాను.అవేమీ వద్దు కానీ ,సూర్య,త్రివిక్రమ్ అనే వాళ్ళు సినిమాలు డైరెక్ట్ చేయకుండా చేయండి చాలు అన్నారు.ఏంటీ?ఆ పని నేను చేయగలనా అని ఆశ్చర్య పోయాను.హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు ,మీకు మీ శక్తి తెలియట్లేదు తల్లీ ....మీరు అనుకోండి చాలు అంతే అయిపోతుంది అన్నారు వాళ్ళు.సరే అని అనుకున్నాను.వెంటనే t .v 9  లో బ్రేకింగ్ న్యూస్ అని 'సూర్య,త్రివిక్రం ఇక నుంచి డైరెక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని 'ఫ్లాష్ చేసాడు.హా!నిజంగా నాకు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్య పడెంతలో...ఢాం అని పెద్దగా శబ్దం వినిపించి ఉలిక్కిపడి ఇహలోకం లోకి వచ్చాను.అయ్యో ఇదంతా ఊహేనా,నిజం అయితే ఎంత బాగుండు అనిపించింది.
 
   ఖలేజాలో మహేష్ కొత్తగా కాదు ,పరమ చెత్తగా నటించాడు.బూతు డైలాగులు వల్లించటమే కొత్తదనం అనుకుంటున్నారు ....డైరెక్టర్ ,హీరో లు.అనూష్క కారెక్టర్,సినిమా లో లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు.పరమ వేస్ట్ ,చీము,నెత్తురు లేని డంబ్ కారెక్టర్ .ఈ సినిమా చూడాలంటే చూసిన తరువాత కలిగే వికారాలను తట్టుకునే ఖలేజా,ముందుమనకుఉండాలి.ఈ సినిమా చూస్తే,టైం,మనీ ,
మైండ్ ...పోవటం ఖాయం.

Sunday 19 September 2010

దేవుడు చూస్తాడు ,కానీ....ఆలస్యంగా

నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు నాన్ డిటైల్ లో ఒక షార్ట్ స్టోరీ ఉండేది.'GOD SEES THE TRUTH BUT WAITS 'అని.
అందులో  ఒకతను వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళటానికి బయలుదేరతాడు.భార్య తనకు చెడ్డ కల వచ్చిందని ,మరుసటి రోజు వెళ్ళమని చెపుతుంది.కానీ అతను ,తనకు అలాంటి నమ్మకాలేమీ లేవని ఆ రోజే బయలుదేరి వెళతాడు.ఆ రోజు రాత్రి ఒక ఊళ్ళో బస చేస్తాడు.అతను బస చేసిన హోటల్ కే ఒక హంతకుడు వస్తాడు.పోలీసులు వెంటపడుతుండటం తో హత్య కు వాడిన కత్తి ని వ్యాపారి బ్యాగ్ లో దాస్తాడు.హంతకుడు తప్పించుకుంటాడు.వ్యాపారి ని పోలీసులు పట్టుకుంటారు.అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.ఆ వ్యాపారి శిక్ష అనుభవిస్తూ జైలు లో ఉంటాడు.ఆ వ్యాపారికి డెబ్బయి ఏళ్ళు ఉన్నప్పుడు ,ఆ జైలు కు ఒక కొత్త ఖైదీ వస్తాడు.అతను జైలు కు ఏ నేరం మీద  వచ్చాడు అని అడుగుతారు .అందుకు ఆ ఖైదీ ప్రస్తుతం తను ఏ నేరం చేయక పోయినా జైలు కు వచ్చానని ,40 ఏళ్ళ క్రితం తను ఒక హత్య చేసినా పట్టుబడలేదని చెపుతాడు.పాత ఖైదీలను వారు జైలు కు ఎందుకు వచ్చారో చెప్పమని అడుగుతాడు.అలా తెలుసుకుంటున్న క్రమం లో తను చేసిన హత్యకు వ్యాపారి శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుసుకుంటాడు.తన నేరం అంగీకరిస్తానని ,ఆ వ్యాపారి జైలు నుంచి వెళ్లిపోవచ్చని చెపుతాడు.అప్పుడు ఆ వ్యాపారి....ఇప్పుడు నేను బయటకు వెళ్లి మాత్రం ఏమి చేస్తాను?అనుభవించాల్సిన వయసంతా జైలు లోనే గడిపాను.నా భార్య ,పిల్లలు ఎక్కడ ఉన్నారో,అసలు ఉన్నారో లేదో తెలియదు.ఈ ముసలి వయసు లో ఏ పనీ చేయలేను అంటాడు.

తప్పు  చేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది,దేవుడు చూస్తూనే ఉంటాడు అంటారు.జీవితాంతం అన్యాయాలు,అక్రమాలు చేస్తా , కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఆనందంగా బ్రతికే వాళ్లకు రేపో మాపో పోతారనగా శిక్ష పడినా ఉపయోగం ఏమిటి?దేవుడు చూస్తానే ఉంటాడు గా ,మరి వెంటనే శిక్ష పడేలాగా చేయకుండా ,ఆలస్యం ఎందుకు చేస్తాడు?ఈ జన్మ లో కాకపోయినా వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే అంటారు.ఈ జన్మ లో ఆనందం గానే ఉన్నాము కదా,తప్పులు చేస్తున్నా.....ఉందో,లేదో తెలియని ఆ వచ్చే జన్మ గురించి ఎవరు ఆలోచిస్తారు?ఎంత మంచి గా ఉన్నా కష్టాలు పడుతుంటే ,పూర్వ జన్మలో ఎంత పాపం చేసావో అందుకే నీకు ఇన్ని కష్టాలు అంటారు.మంచి గా ఉండి కష్టాలు పడె బదులు ఆనందం గా ఉండటానికి ఏమయినా చేయోచ్చు అని అనుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లేగా?దాని బదులు ఎప్పుడు చేసిన తప్పుకు అప్పుడే శిక్ష విథించేస్తే ఈ గోల అంతా ఉండదు కదా?
అప్పుడు జనాలు అందరూ మంచివాళ్ల గా అయిపోతారేమో!  

Thursday 16 September 2010

వద్దంటే బహుమతులు

బహుమతులు వద్దనుకునే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటున్నారా?పోటీ లో పాల్గొని గెలుచుకునే బహుమతులు గురించి కాదు నేను చెప్పేది.అలాగే ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు ,ఫంక్షన్ చేస్తున్న వాళ్లకు ఇచ్చే బహుమతుల గురించి కూడా కాదు.ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళకు ఇచ్చే బహుమతుల గురించి.బారసాల మొదలుకుని మరణం వరకు వివిధ రకాల ఫంక్షన్స్ లో ఇచ్చే బహుమతుల గురించి. ఒక అయిదు ,ఆరు దశాబ్దాల క్రితం కుటుంబం లో ఎవరయినా చనిపోతే వారి జ్ఞాపకార్థం ఇత్తడి గ్లాసులు బాగా దగ్గరి బందువులకు మాత్రమే ఇచ్చుకునే వారట.కాలక్రమేణా బంధువులందరికీ ఇవ్వటం ,ఆ తరువాత బంధువులు కానివారికి కూడా ఇవ్వటం ,ఇత్తడి స్థానాన్నిస్టీల్ ఆక్రమించటం జరిగింది. అలాగే గ్లాసుల స్థానం లో ప్లేటులు,తపాలాలు,గిన్నెలు ,బాక్స్లు,etc .,etc .,ఇవ్వటం మొదలు పెట్టారు.ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ 90 ల లో వోణీ ల ఫంక్షన్ లో,ఎంగేజి మేంట్ (మ్యారేజ్ )ఫంక్షన్ ల లో కూడా ఇవ్వటం మొదలు పెట్టారు.చనిపోతే కర్మ రోజే కాకుండా ఐదో రోజు గారెలు ,పూర్ణాలు పంచేటప్పుడు కూడా ఒక గిన్నో,ప్లేటో ఇవ్వటం మొదలు పెట్టారు.అలాగే ఎంగేజి మేంట్ కు ఒకటి ,పెళ్లి లో మరొకటి.ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని భేధభావం చూపెట్టకుండా బారసాల మొదలుకుని అన్ని ఫంక్షన్ లకు,గృహప్రవేశాలకు,పుట్టిన రోజులకు  ఏదో ఒక వస్తువు ఇవ్వటం మొదలు పెట్టారు.స్టీల్ వే కాకుండా స్తోమతను బట్టి,కాదేది బహుమతి కి అనర్హం అన్నట్లు వెండి కుంకుం భరిణలు ,బంగారపు పోగులు ,ప్లాస్టిక్ వస్తువులు ,గాజు ,పింగాణి పాత్రలు ఇస్తున్నారు.ప్రస్తుత ట్రెండ్ గాజు బౌల్స్ ఇవ్వటం.సరే వెండి,బంగారం అంటే రేర్ గా వచ్చేవి కాబట్టి పరవాలేదు.వచ్చిన ఇబ్బంది అంతా స్టీల్,గాజు వాటితోనే.ఈ ఇరవై ఏళ్ళలో మాకు వచ్చిన స్టీల్,గాజు వస్తువులు ఎక్కడ సర్దాలో తెలియక పిచ్చెక్కుతోంది.మేము విజయవాడ లో ఉన్నప్పుడు స్టీల్ సామాను చాలా వరకు ఉల్లిపాయల వాడికి వేసి వదిలిన్చుకున్నాను.గాజు సామాను వదిలించుకోవటానికి ఏలాంటి మార్గము లేదు.(చేతిలోంచి జార విడిస్తే వదిలించుకోవచ్చు అనుకోండి.కానీ కావాలని జార విడువ లేము కదా)ఈ వేలం వెర్రి, జనాలను ఎప్పుడు వదులుతుందో?ఆచారం గా మారిన ఈ బహుమతులు ఇచ్చే పద్దతి ని తొందరలో నే జనాలు వదిలి పెడతారని ఆశిద్దాము.

ఈ పోస్ట్ రాయటానికి కారణం .........
ఈ మధ్య మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ,మా పిన్ని స్టీల్ ,గాజు సామాను చూపించి నీకు నచ్చినవి తీసుకు వెళ్ళు.మా ఇంట్లో అలమారాలు అన్ని నిండిపోయాయి ,ఎక్కడ సర్దాలో తెలియటం లేదు అంటే నాదీ అదే పరిస్తితి ,నాకు వద్దు బాబోయ్ అని వచ్చేసాను.

Monday 13 September 2010

చావు-విషాదమా?ఆనందమా?


ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న ?ఈవిడ కు మతి గాని పోయిందా...అని అనుకుంటున్నారా?అలాంటిదేమీ లేదు లెండి.చావు అనేది విషాదకరమయిన సంఘటనే...అందరి  దృష్టి లో .మరయితే ఎవరయినా చనిపోయినప్పుడు ,వారి కుటుంబ సభ్యులను పలకరించటానికి వెళ్ళినప్పుడు  స్వీట్స్ తీసుకొని వెళతాము,ఎందుకు?నాకు తెలిసినంతవరకూ మన కుటుంబ సభ్యులు ఎవరయినా చనిపోయినప్పుడు ఏడవకూడదు.ఏడిస్తే మన కన్నీళ్లు అడ్డుపడి ,చనిపోయిన వారి ఆత్మ,స్వర్గానికి వెళ్ళటానికి వైతరిణి దాటటం కష్టమవుతుందట.కానీ ,చనిపోయిన వారి తో మనకున్న అనుబంధం,వారి తాలూకు జ్ఞాపకాలు మనల్ని ఏడిచేలా చేస్తాయి.ఇప్పటి కాలం లో కొంతమంది ఏడుపు రాకపోయినా ఇతరులు ఏమనుకుంటారో అని ,తప్పక ఏడిచే వాళ్ళు ఉన్నారు.మా మామ గారు చనిపోయినప్పుడు ,మా అత్తగారు,ఆడపడుచు ....ఉన్నన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళనే పట్టించుకున్నాడు,ఇంట్లో వాళ్లకు చేసిందేమీ లేదు,అదీ..ఇదీ అని మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్తా,పలకరించటానికి వచ్చే వాళ్ళను గేటు దగ్గర చూడగానే శోకాలు మొదలు పెట్టారు.వాళ్ళు వెళ్ళిపోగానే మళ్లీ మామూలు గానే మాటలు మొదలు.అలా ఎవరయినా రావటం చూడగానే ఏడుపు ,వెళ్ళిపోగానే రకరకాలుగా మాట్లాడుకోవటం .....ఇదే తంతు కొనసాగింది.ఒక సంవత్సరంన్నర  క్రితం మా అక్కయ్య గారమ్మాయి రోడ్  యాక్సిడెంట్ లో చనిపోయింది.పలకరించటానికి వెళ్ళాము.బావగారు వచ్చిన వాళ్ళందరిని ,చాలా క్యాజువల్ గా నవ్వుతూ పలకరిస్తున్నారు.మాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.వచ్చిన వాళ్ళందరూ తలా ఒక రకం గా మాట్లాడారు.బ్రహ్మకుమారి సంఘం లో ఉన్నాడు కదా ...అందుకనే అలా దుఃఖ పడకుండా మామూలు గా ఉండగలుగుతున్నాడు అని కొందరు,చిన్న వయసు లో నే పిల్ల చనిపోయింది కదా ,షాక్ లో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు ....

నేనయితే  గీత లో చెప్పినట్లు చావు విషాదకరమయినది కాదు అనే అనుకుంటున్నాను.
  
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా
తధా దేహాంతర ప్రాప్తిః  ధీర స్తత్ర న ముహ్యతి

బాలుడు శైశవం ,బాల్యం,యౌవనం,మొదలగు మార్పులు చెందినప్పుడు ఎట్లా దుఃఖించట్లేదో,అట్లే మరణం అంటే ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహం ధరించుట అని జ్ఞానులు గ్రహించి మరణ విషయమై చింతించరు.

Tuesday 3 August 2010

చిన్ననాటి తీపి గురుతులు

నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.అసలు పేరు తో ఎవరూ పిలిచేవారు కాదు.అందరూ మా స్కూల్ ను  రైలు కట్ట బడి అని పిలిచేవారు.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన డబ్బులు (5,10పైసల నాణాలు) ఉంటే డబ్బులు లేకపోతే పిన్నీసులు పెట్టె వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయిన వాటిని తీసుకుని సంబరపడేవాళ్ళం.రైలు వచ్చి ఆగిన తరువాత ఇంజిన్ దగ్గరకు వెళ్లి,డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు.వాళ్ళను  గ్రీజ్ అడిగే వాళ్ళం.డ్రైవర్ వెళ్ళండి అని అరిచే వాడు కానీ ,వేరే అతను ఒకళ్లిద్దరికి గ్రీజ్ ఇచ్చి ,ఇక వెళ్ళండి,రైలు కదులుతుంది అని పంపించేసేవాడు.ఆ ఇచ్చిన గ్రీజ్ ను తలా కొంచం పంచుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం.అంతకు ముందు మా ఇంట్లో కొట్టుడు పంపు పాడయినప్పుడు  బాగు చేయటానికి వచ్చినతను ,పంపు బాగుచేసినాక నట్టులకి గ్రీజ్ రాయటం చూసాను.గ్రీజ్ రాస్తే పంపు పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యం తో నేను ఇంటికి వెళ్ళగానే ,గ్రీజ్ ను పంపు కు నట్టు కనిపించిన చోటల్లా రాసాను.ఈ క్రమం లో గ్రీజ్ ,పంపు కే కాకుండా ,నా బట్టలకు,వంటికి కూడా అంటింది.పాపం ఇప్పటి వాళ్లకు తెలిసినట్లు గా ......మరక మంచిదేనని అప్పటి వాళ్లకు తెలియదు గా ! అందుకని మా అమ్మమ్మ బట్టలతో పాటూ నన్నూ ఉతికి ఆరవేసేది.

Thursday 29 July 2010

కోపం

తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతక కర్త.కోపం వలన నష్టం తప్పించి ,లాభం ఏమీ ఉండదని తెలిసినప్పటికీ ,జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు కోపం తో చిందులు వేయని వారు ఉండరేమో.కోపం గురించి నాకు నచ్చిన quotes కొన్ని.

Holding  on to anger is like grasping a hot  coal  with the intent of throwing it at someone else;you are the one who gets burned-Buddha

Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured.

Anger is only one letter short of 'Danger'.

Anger blows out the lamp of the mind-Robert Green Ingersoll

Temper tantrums ,however fun they may be to throw,rarely solve whatever problem is causing them.-Lemony Snicket 

To carry a grudge is like being stung to death by one bee -William.H.Walton

Sunday 25 July 2010

Foodles


నిన్న మా అమ్మాయి స్కూల్లో ఇచ్చారని foodlesప్యాకెట్ ఒకటి తీసుకు వచ్చింది. సేమ్, నూడుల్స్   లాగానే ఉన్నాయి.కాకపొతే నూడుల్స్ ని గోధుమ పిండి తో తయారు చేస్తే ఈ ఫూడుల్స్ ని గోధుమ పిండి,వరిపిండి,రాగి,మొక్కజొన్న పిండులతో తయారు చేశారు.ఆ ప్యాకెట్ ని చూడగానే నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది.నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ,మా స్కూల్ లో maggiపాకెట్స్ ఇచ్చారు.ఒక్కో స్టూడెంట్ కు రెండు పాకెట్స్ ఇచ్చారు.వాటిని ఇంటికి తీసుకు వెళ్లి మా అమ్మ కు ఇస్తే ,వాటిని ఎలా వండాలో నాకు తెలియదు అంది.ప్యాకెట్ మీద ఎలా తయారు చేయాలో రాసి ఉంది ,నేను వండుతాను అని ఎంతో శ్రద్దగా చదివి నూడుల్స్ ను వండాను.చిన్న బౌల్స్ లో సర్ది అందరి కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను.మాకు ఎవరికి నూడుల్స్ నచ్చలేదు.అందరం ఒక స్పూన్ కంటే ఎక్కువ తినలేకపోయాము.అంతా బయటికి తీసుకు వెళ్లి పారవేసాము.సరే నేను తెచ్చిన రెండు పాకెట్స్ వండి అలా పారబోసాము.మా తమ్ముడు కిచ్చిన రెండు పాకెట్స్ ని ఏమి చెయ్యాలా అని ఆలోచించి ,సేమియా లాగానే ఉన్నాయి కాబట్టి పాయసం చేసుకుందాము అని మా అమ్మకు సలహా ఇచ్చాను.మా అమ్మ నూడుల్స్ తో పాయసం చేసింది.సేమియా పాయసం లాగా టేస్ట్ గా లేకపోయినా,తియ్యగా ఉంది కాబట్టి ఎలాగో అలాగా బలవంతాన తాగేసాము.అప్పుడు,అసలు తినటానికి ఇష్టపడని వాళ్లము ...ఇప్పుడు ఎంతో ఇష్టం గా తింటున్నాము.ఇడ్లి,దోశ చేస్తే వాటిల్లోకి చట్ని చేయాలి.చపాతీ నో ,పూరి నో అయితే కూర వండాలి.ఈ బాధ లేమి లేకుండా ,నూడుల్స్ అయితే రెండు నిమిషాల లో చేసేసుకోవచ్చు.మనమే చేయాలని లేదు.పిల్లలయినా తయారు చేసేసుకోవచ్చు.నేను నెలవారీ సరకులు తెచ్చేటప్పుడే ,రెండు డజన్లు నూడుల్స్ పాకెట్స్ తీసుకు వస్తాను.వంట చేయటానికి బద్దకించి నప్పుడు  నూడుల్స్  జిందాబాద్.ఫూడుల్స్ ,నూడుల్స్  అంత టేస్ట్ గా లేకపోయినా పరవాలేదు,తినొచ్చు.

Friday 23 July 2010

మునగాకు-పోషక విలువలు


జ్యేష్ట మాసపు ఎండల తరువాత వచ్చే ఆషాడపు జల్లులకు శరీరం లో ముఖ్యం గా ఉదరం లో జీర్ణ ప్రక్రియలో జరిగే మార్పులకు మునగాకు మేలు చేస్తుందని ,ఆషాడ మాసం లో మునగాకు తప్పక  తినాలని అంటారు.అయితే ఒక్క ఆషాడం లోనే కాదు,ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం.

మునగాకులో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు,(కాల్షియం,ఫాస్ఫరస్,ఇనుము,పొటాషియం )విటమిన్ 'A ','C' ఎక్కువగా ఉన్నాయి.

మునగాకుల  లో కాల్షియం ఎక్కువ గా ఉంటుంది కనుక ,మునగాకు రసం ఒక చెంచాడు ..కప్పు పాల లో కలిపి పిల్లలకు రోజూ తాగిస్తుంటే ఎముకలు దృడం గా ఉంటాయి. 

గర్భిణులకు .....కప్పుడు పాలలో రెండు స్పూన్ల ములగాకు రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగితే రక్త హీనత,కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

మునగాకు లో ఉన్న పొటాషియం వల్ల మెదడు ,నరాలు చక్కగా పనిచేస్తాయి.
విటమిన్ 'A ','C' వల్ల ఉపయోగాలు అందరికి తెలిసినవే.


Wednesday 21 July 2010

Garbage Truck Psychology

మన మూడ్ ఎక్కువ గా ఎదుటివాళ్ళు మనతో ప్రవర్తించే విధానం పైనే ఆధారపడి ఉంటుంది.మన బాస్ మనల్ని అకారణం గా తిట్టినా/విసుకున్నా ,ఎవరైనా మనతో దురుసుగా ప్రవర్తించినా ,వెంటనే మన మూడ్ పాడవతుంది.ఏ పని చేయబుద్ది అవదు.వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు అనే ఆలోచిస్తూ మన పనులు పాడు చేసుకుంటూ ఉంటాము.వాళ్ళు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్,కోపం,అసంతృప్తి అనే చెత్తను  మన మీద వేసి వదిలించుకుంటే మనం ఆ చెత్తను తీసి అవతల పారవేయాలా?లేదా ?ఆ చెత్తను పదిలంగా దాచుకోము కదా?అందుకని అలాంటి మనుషులు గురించి ఆలోచించి మన మూడ్ పాడు చేసుకోవటం మంచిది కాదు.వాళ్ళను పట్టించు కోకుండా ఉంటే మనం సంతోషం గా ఉంటాము అని తెలిపే ఈ కథ చదవండి.

How often do you let other people's nonsense change your mood?
Do you let a bad driver, rude waiter, curt boss, or an insensitive employee ruin your day? However, the mark of a successful person is how quickly one can get back their focus on what's important.

David J. Pollay explains his story in this way...

Sixteen years ago, I learned this lesson. I learned it in the back of a New York City taxi cab. Here's what happened. I hopped in a taxi, and we took off for Grand Central Station. We were driving in the right lane when, all of a sudden, a black car jumped out of a parking space right in front of us. My taxi driver slammed on his breaks, skidded, and missed the other car's back end by just inches!

The driver of the other car, the guy who almost caused a big accident, whipped his head around and he started yelling bad words at us. My taxi driver just smiled and waved at the guy. And I mean...he was friendly. So, I said, "Why did you just do that? This guy almost ruined your car and sent us to the hospital!"

And this is when my taxi driver told me what I now call, "The Law of the Garbage Truck."

"Many people are like garbage trucks. They run around full of garbage, full of frustration, full of anger and full of disappointment. As their garbage piles up, they need a place to dump it. And if you let them, they'll dump it on you. When someone wants to dump on you, don't take it personally. You just smile, wave, wish them well, and move on.

You'll be happy you did." I started thinking, how often do I let Garbage Trucks run right over me? And how often do I take their garbage and spread it to other people: at work, at home, on the streets? It was that day I said, "I'm not going to do it anymore."

Life's too short to wake up in the morning with regrets. Love the people who treat you right. Forget about the ones who don't. Believe that everything happens for a reason.

Never let the garbage truck run over you...

మరి మీరేమి చేస్తారు?వేరే వాళ్ళ చెత్తను మీరు క్యారీ చేస్తారా?వదిలించుకుంటారా? 

Monday 19 July 2010

సక్సెస్

జీవితం లో సక్సెస్ అనేది కొంతమంది నే వరిస్తుంది.మరి మిగతా వాళ్ళు సక్సెస్ కాకపోవటానికి కారణం ఏమిటి?జనరల్ గా మనం అనుకునేదేమిటంటే సక్సెస్ అవటానికి కారణం వాళ్ళు అదృష్టవంతులు అవటం ,కాకపోవటానికి దురదృష్టం కారణం అని.నిజం గా అదృష్టం ,దురదృష్టం అనేవి ఉంటాయా?ప్రయత్నలోపం వల్ల కూడా సక్సెస్ సాదించలేకపోవచ్చు కదా?ఫెయిల్ అవుతామన్న భయం వల్ల అసలు ప్రయత్నమే చేయకపోవచ్చు.
Many of  life's failures are people who didnot realize how close they were to success when they gave up-Thomas Edison.

A winner is someone who recognizes his god given talents,works his tail off to develop them into skills and uses these skills to accomplish his goals-
Larry bird

Efforts may fail.But don't fail to make efforts.Great things will always come late.There is no shortcut to success,only way is hardwork

Our doubts are traitors,and make us lose the good we often might win,by fearing to attempt-William Shakespeare

One reason so few of us achieve,what we truly want is that we never direct our focus.We never concentrate our power.Most people dabble their way through life,never deciding to master anything in particular-Anthony Robins.

ఫలానాది సాధించాలన్న కోరిక ఉన్నంత మాత్రాన అది సాధించలేము.ఎలాగైనా సాధించాలి అన్న తపన ఉంటేనే సాధించగలం.
Desire is the starting point of all achievements,not hope,not a wish,but a keen pulsating desire which transcends everything-Napoleon hill

అలాగే, ఏదో ఒకటి సాధించాలని కాకుండా ఖచ్చితమైన లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే సాదించగలము.
 
People with goals succeed,because they know where they are going.
 
సక్సెస్ కాకపోవటానికి ,90 % ప్రతీ దానికి excuses వెతికే మనస్తత్వమే కారణం .
90%of the failures come from people who have the habit of making excuses-George Washington Carver


Tuesday 13 July 2010

విందుభోజనం

ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు.చదివినాక నిజంగా జరిగిందా అని కూడా అనిపించవచ్చు.ఎవరైనా నాకు చెప్పితే నేను నమ్మేదాన్ని కాదేమో కానీ ,ఆ పరిస్థితి నాకే ఎదురైంది కాబట్టి ,ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మక తప్పటం లేదు.
మేము అద్దె కుండే ఇంట్లో మొత్తం నాలుగు పోర్షన్ లు ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు,ఫస్ట్ ఫ్లోర్ లో రెండు.గ్రౌండ్ ఫ్లోర్ లో,సునీత,వాణి వాళ్ళు అద్దె కుంటే , ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్ ,ఇంకొక దాంట్లో మేము ఉండేవాళ్ళము.సునీత వాళ్ళది ప్రేమ వివాహం.పెళ్ళికి పెద్ద వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ,అంతస్తుల తేడా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ వాళ్లకు,అత్తగారి వాళ్లకు సరిపడేది కాదు.వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు
వాళ్ళ అత్తగారు వాళ్ళు,వీళ్ళ ఇంటికివచ్చేవారుకాదు. అలాగేవాళ్ళ అమ్మావాళ్ళు ఉన్నప్పుడు అత్తగారువాళ్ళువచ్చేవారుకాదు.సునీతవాళ్ళపాపకు ఆరో నెల .అన్నప్రాసన చేయటానికి మంచిరోజు చూసుకున్నారు.
మా కాంపౌండ్ లో వారిని,పక్కింటి వారిని మాత్రమే పిలుస్తున్నానని చెప్పింది. ఏమన్నా గొడవ జరిగితే బాగోదుఅని ఎక్కువ మందిని పిలవటం లేదని చెప్పింది. సరే అన్నప్రాసనకు వెళ్ళాము.

ఆ కార్యక్రమం అవగానే పాపను నిద్ర పుచ్చటానికని సునీత ,వెనకాలే వాళ్ళ అమ్మ,అత్తగారు,వాళ్ళ తరపు బంధువులు అందరూ లోనికి వెళ్లారు. గెస్ట్ లం హాల్ లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.కడుపు లో ఎలుకలు పరిగెత్తే వరకు ఎవరికీ భోజనం సంగతి గుర్తుకు రాలేదు.టైం చూస్తే ఒకటిన్నర అయ్యింది.ఏమిటి ,వీళ్ళు ఇంకా భోజనానికి పిలవలేదు,నేను లోనికి వెళ్లి కనుక్కొని వస్తాను ఉండండి అని మా ఇంటి ఓనర్ గారు లోనికి వెళ్ళారు.విషయం ఏమిటంటే.........పాతిక,ముప్పై మందికంటే ఎక్కువ అవరు కదా ,ఇంట్లో నే వంట చేయోచ్చు లే అనుకుందట సునీత.అయితే వాళ్ళ అమ్మ ఏమో,నేను వంట చేస్తే మీ అత్తగారు వాళ్ళు కూర్చొని తింటారా?నేను చేయను అందట.వాళ్ళ అత్తగారు ఏమో అమ్మాయి తరపు వాళ్ళు,మీరు చేయకపోతే,మేము చేస్తామా?మేము చేయం అందట.ఎంత బతిమాలినా ఇద్దరు ససేమిరా అని మొండికేసారంట .నేను డయాబెటిక్ ని.నెమ్మదిగా తల నెప్పి స్టార్ట్ అయ్యింది.వాళ్ళు ఎప్పుడు రాజీకొస్తారో,ఏమిటో నండీ,నేను ఇంటికివెళ్లి ఏమన్నా లేకపోతే పడిపోయే లాగున్నాను అని అక్కడనుంచి వచ్చేసాను.మా పిల్లలిద్దరికి బాక్స్ లో పెట్టగ మిగిలిన అన్నం కొంచం ఉంటె అది తిన్నాను.(భోజనానికి వెళుతున్నాను కదా అని నాకు వండుకోలేదు)రెండు అయ్యింది.శివయ్య సీరియల్ చూద్దామని టి.వి.పెట్టాను.ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.ఎవరా అని చూస్తే మా ఇంటి ఓనర్.వాళ్ళు ఎవరూ కదిలే లాగా లేరండి.వాణి గారు మనమే చేద్దాం అన్నారు ,మీరు కూడా రండి అని పిలిచారు.కుక్కరు, బాండి,కత్తిపీట తీసుకు రండి,నేను కూడా మావి తీసుకు వెళుతున్నాను అన్నారు.వంట చేయటం అంటే నాకు పరమ చిరాకు.ఇంట్లో తప్పదు కాబట్టి ,ఎలాగో వండాను అనిపిస్తాను.ఇప్పుడు హాయిగా సీరియల్ చూద్దామనుకుంటే ,ఇదేమి కర్మరా బాబు అనుకుంటూ ,ఆవిడ చెప్పిన సరంజామా అంతా తీసుకుని వెళ్ళాను.మొత్తానికి వంట చేసి ,గెస్ట్ లు మయిన మేము హోస్ట్ లు గా మారి,మా హోస్ట్ లకు ముందు వడ్డించి ,వారు తిన్న తరువాత ,మేము కూడా తిని ఇంటికి చేరాము.

Wednesday 7 July 2010

బంద్ చేస్తే ధరలు తగ్గుతాయా?

నిన్న ,నేను సరుకులు తెచ్చుకోవటానికి షాప్ కు వెళ్ళాను.అప్పుడే ఒక ఆవిడ monthly కార్డు(పాలు) కు డబ్బులు పే చేయటానికి వచ్చింది.ఎనిమిది వందలు ఇచ్చి కార్డు తీసుకుని చిల్లర కోసం నుంచుంది.షాప్ అతను డబ్బులు  సరిపోయాయి అని అన్నాడు. ఏడు వందల అరవయ్యి కదా ,ఎనిమిది వందలు తీసుకున్నారేంటి ?అని అడిగింది.పాల రేటు పెరిగిందమ్మ అన్నాడు షాప్ అతను.దానికి ఆమె... నిన్ననే కదా షాప్ బంద్ చేయిన్చినాము ,రేటు తగ్గించాలి కానీ ,ఎలా  పెంచుతావు అని అడిగింది.దానికి షాప్ అతను రేటు తగ్గటం కాదు,ఎన్ని సార్లు బంద్ చేయించితే అన్ని సార్లు రేట్లు పెరుగుతాయి అని అన్నాడు.ఆవిడ,మరి రేట్లు తగ్గనప్పుడు బంద్ చేయడం దేనికి?అన్నది. ఆమె అడిగిన తీరు కు నాకు నవ్వు వచ్చింది కానీ ,ఎలాగో నవ్వకుండా ఆపుకున్నాను.ఒక్క క్షణం ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.ఆవిడ అంటే సాధారణ గృహిణి,పెద్దగా చదువుకోలేదు,కాబట్టి బంద్ చేస్తే ధరలు తగ్గుతాయనే భ్రమ లో ఉండవచ్చు.కానీ ప్రతిపక్ష నాయకులకు ఏమయ్యింది?వాళ్ళకూ అలాంటి  భ్రమలు ఉన్నాయా?ఏమాశించి ఈ బంద్ లు జరుపుతున్నారు?ధరలు పెరిగితే ఏమి చెయ్యాలో మేము చూసుకుంటాము,మీరు మా కోసం బంద్ లు నిర్వహించక్కరలేదు ,అని ప్రజలు నాయకులకు చెప్పే రోజు వస్తుందా? 

Saturday 3 July 2010

హెల్త్ చెకప్

జనరల్ గా మనందరమూ వ్యాధి బాగా ముదిరిన తరువాత ,ఇక వెళ్ళక తప్పదు కాబట్టి డాక్టర్ దగ్గరకు వెళతాం.అంతే కానీ, ముందు జాగ్రత్త గా ఏలాంటి కేర్ తీసుకోము.రొటీన్ చెకప్ లాంటివి  అసలు చేయించుకోము.కాన్సర్ లాంటి జబ్బులు ,ఎర్లీ స్టేజి లోనే గుర్తిస్తే ,జబ్బు పూర్తి గా నయమవటానికి అవకాశం ఉంది.కుటుంబం లో ఎవరికైనా గుండె జబ్బులు,మధుమేహం,కాన్సర్,పక్షవాతం లాంటివి ఉన్నట్లయితే ,మిగతా కుటుంబ సభ్యులు తప్పకుండ ఈ క్రింద పేర్కొన్న టెస్ట్ లు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి.అలాంటి జబ్బుల హిస్టరీ లేనివాళ్ళు కూడా టెస్ట్లు చేయించుకుంటే మంచిది.

బ్లడ్ ప్రషర్,కొలస్ట్రాల్:సంవత్సరానికి ఒకసారి......20సం.నిండిన ప్రతి ఒక్కరు

బ్లడ్ గ్లూకోజ్ :సంవత్సరానికి ఒకసారి......45 సం.నిండిన ప్రతి ఒక్కరు
  

కళ్ళు:సంవత్సరానికి ఒకసారి

డెంటల్ :ఆరు నెలల కు ఒకసారి

బోన్ డెన్సిటి :రెండు సంవత్సరాలకి ఒకసారి 55 సం.నిండిన స్త్రీలు ,60 సం.నిండిన పురుషులు.

మామ్మోగ్రాం:సంవత్సరానికి ఒకసారి......40  సం. నిండిన స్త్రీలు

పాప్ స్మియర్ :సంవత్సరానికి ఒకసారి.....21 సం.నిండిన స్త్రీలు

ప్రోస్టేట్: సంవత్సరానికి ఒకసారి......50 సం.నిండిన  పురుషులు.ఫ్యామిలీ హిస్టరీ (ప్రోస్టేట్ కాన్సర్)ఉన్నవాళ్లు 40 వ సం. నుంచి టెస్ట్ చేయించుకోవాలి.


Wednesday 30 June 2010

కాన్సర్ కి ,సెల్ టవర్ లకు సంబంధం ఉందా?


 జనరల్ గా మన అందరికి ....సెల్ ఫోన్  టవర్ లకు  దగ్గరలో నివసిస్తున్నట్లయితే  కాన్సర్ సోకే అవకాశం ఎక్కువ      అనే అభిప్రాయం ఉంది.కానీ అది తప్పని ఇటీవల పరిశోధనలు తెలుపుతున్నాయి.ఇంపీరియల్ కాలేజ్,లండన్ వారి పరిశోధన ఫలితాలు ..... చిన్న పిల్లలకు వచ్చే కాన్సర్ కు ,సెల్ ఫోన్ టవర్ లకు దగ్గర లో నివసించటానికి సంబంధం లేదని తెలుపుతున్నాయి.మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.

Sunday 20 June 2010

రావణ్

రావణ్ సినిమా విడుదలైన మరుసటి రోజే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసాము.నేను అతి కష్టం మీద ఒక పావు గంట మాత్రమే చూసాను.సినిమా అంత దరిద్రంగా ఉంది మరి(ప్రింట్ అనుకునేరు,ప్రింట్ కాదు).విక్రం ఐ న్యూస్ లో ఇంటర్వ్యు ఇస్తూ ఒక్క బాష లో కాదు,మూడు బాషల్లోనూ సినిమా ను చూడండి అని చెప్పాడు.ఒకటి చూడటమే కష్టం అయితే  ఇక మూడూ బాషల్లోనూ ఏమి చూస్తాము?  సినిమాలో  రాంజా,రాంజా ,బెహనేదో ....ఈ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి.

Friday 11 June 2010

జోక్స్

     ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: నీ బర్త్ డేట్ ఏమిటి?
     అభ్యర్ధి:   అక్టోబర్  13   
     ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: ఏ సంవత్సరం?
     అభ్యర్ధి: ప్రతి సంవత్సరం
    ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి     .  అప్పుడు   అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి     ఎలా తప్పించుకుంటారు?
   అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను.
   ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీకు M .S .office  తెలుసా?
   అభ్యర్ధి:మీరు అడ్రస్ ఇస్తే తెలుసుకుంటాను సర్.
     ****************************

   విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి తన భార్య తో.....నేను విదేశీ వాడి   లాగా కనిపిస్తున్నానా? అని అడిగాడు.
  భార్య:లేదే ,ఎందుకలా అడిగారు?
  భర్త:లండన్ లో అందరూ నన్ను విదేశీ వా అని అడిగారు మరి?
        ****************************
  టీచర్ :గాంధి జయంతి గురించి వ్రాయండి అని స్టూడెంట్స్ కి చెప్పింది.
  ఒక స్టూడెంట్ ఇలా వ్రాసాడు.
  గాంధి చాలా గొప్పవాడు.కానీ జయంతి ఎవరో నాకు తెలియదు.
     ****************************

Wednesday 9 June 2010

పేరు తో తంటాలు

పేరు లో నేముంది టపాలు చదివాకా నాకు కూడా నా పేరు వల్ల పడ్డ ఇబ్బందులు రాయాలనిపించింది.మరీ చారి గారు పడినన్ని ఇబ్బందులు కాకపోయినా ,కొద్దో గొప్పో కష్టాలు పడ్డాను.
నాకు అనూరాధ అని పేరు పెట్టినప్పుడు ,మా అమ్మ వాళ్ళ వదిన ,అనూరాధ ఏంటి?మనోబాధ లాగా!అయినా నక్షత్రాల పేరు పెట్టుకుంటారా ఎవరైనా ? పేరు బాగోలేదు ,వేరే పేరు పెట్టమన్నారు అంట.కానీ మా అమ్మ కు ఆ పేరు బాగా నచ్చినందువల్ల,మరియు ఆ టైం లో అనూరాధ అనే పేరు హవా నడుస్తుండటం తో ఆ పేరే ఉంచేశారు.
నా పేరు తో మొట్టమొదటిసారి గా ఇబ్బంది ఎదురైంది.. నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదివేటప్పుడు.మా స్కూల్ లో ,స్కూల్ వదలటానికి గంట ముందు అన్ని క్లాస్ ల వాళ్ళని (1to5th )స్కూల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అందరి తో ఒకటి నుంచి ఇరవయ్ వరకు ఎక్కాలు,తెలుగు సంవత్సరాల పేర్లు,నెలల పేర్లు,నక్షత్రాల పేర్లు చెప్పించే వారు.అదేంటో తెలియదు కానీ ప్రతి రోజూ నక్షత్రాల పేర్లు చెప్పేటప్పుడే నా టర్న్ వచ్చేది.అదికూడా హస్త లేదా చిత్త నక్షత్రం దగ్గర నా ముందు వాళ్ళు ఆపితే అక్కడ నుంచి నేను కంటిన్యు చేయాల్సి వచ్చేది.విశాఖ వరకు బాగానే చెప్పేదాన్ని.ఆ తరవాతే నోరు పెగిలేది కాదు నా పేరు చెప్పటానికి.ఎప్పుడు చెపుతాన అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు చూసి ,పేరు చెప్పంగానే అందరూ పక్కున నవ్వే వాళ్ళు.ఇలా ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నన్ని రోజులు బాధ పడ్డాను.నేను నా పేరు పలకటానికి ఎందుకు మొహమాట పడ్డానో,వాళ్ళు ఎందుకు నవ్వేవాళ్ళో ,ఇప్పటికి నాకు అర్ధం కాదు. 

ఇక నేను 7th చదివేటప్పుడు ..మా క్లాస్ లో అనూరాధ పేరు తో ఎనిమిది మందిమి ఉండేవాళ్ళము.attendence పిలిచేటప్పుడు ఇంటి పేరు తో సహా పిలిచేవారు కాబట్టి ఇబ్బందేమీ ఉండేది కాదు.క్లాస్ లో అక్షింతలు వేసేప్పుడే .ఎవరిని తిడుతున్నారో తెలిసేది కాదు.మనల్ని కాదులే అని ఇకిలించుకుంటా కూర్చుంటే ,తిడుతున్నా సిగ్గు లేదా ?ఇకిలిస్తున్నావు అని extra అక్షింతలు.మనల్నే తిడుతున్నారేమో అని లోకంలోని విషా దాన్నంతా మన ఫేస్  లోనే కనబరిస్తే ,నిన్ను కాదు గా తిట్టేది నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అక్షింతలు.

8th క్లాస్ కు స్కూల్ మారాను.హైదరాబాద్ లో h .f .h .s లో జాయిన్ అయ్యాను.మొదటి రోజు క్లాస్ లో ,మా టీచర్.. అందరి పేర్లు పిలిచి రోల్ నంబర్స్ చెప్పింది.క్లాస్ అయిపోయి టీచర్ క్లాస్ నుంచి వెళ్ళటం ఆలస్యం ,నామీద ప్రశ్నల వర్షం కురిపించారు.
అల్లూరు సీతా రామ రాజు మీకు ఏమవుతారు?
అల్లూరు సీతా రామ రాజు  ది మీది ఒకే ఊరా?
అల్లూరు సీతా రామ రాజు అసలు ఫొటోస్ చూసావా?బుక్ లో ఉన్నట్లే ఉంటారా?
నాకేమీ అవరు .అయినా ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నారు?అన్నాను.
మీ ఇంటి పేరు కూడా అల్లూరు కదా,అందుకని మీ relative ఏమో అని అడుగుతున్నాము అని అన్నారు.మా ఇంటి పేరు అల్లూరు కాదు వల్లూరు అని చెప్పాను.అయినా వదలకుండా నువ్వు అబద్దం చెపుతున్నావు ,టీచర్ నీ పేరు పిలిచినప్పుడు విన్నాము అని కొంచం సేపు వాదించి వదిలేసారు.ఎందుకయినా మంచిది అని ,రిజిస్టర్ లో నా పేరు
 వి .అనూరాధ గా మార్పించేసుకున్నాను.
ఆ తరువాత graduation అయిపోయేంతవరకు ఏ సమస్య లేదు.నేను స్కూల్ లో వర్క్ చేసేటప్పుడు  మళ్లీ...గవర్నమెంట్ స్కూల్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యి మళ్లీ మా స్కూల్ లో తెలుగు టీచర్ గా జాయిన్ అయ్యారు.అందరిని పరిచయం చేసుకుంటున్నారు.నేను నా పేరు అనూరాధ అని చెప్పాను.అనూ... ఏమనాలి?రాధా...నీకు ఏమి రాదా ?అయితే పిల్లలకు పాఠాలు ఎలా చెపుతున్నావు అమ్మాయ్? అని ఏమనకోకు అమ్మాయ్ ,నీ కంటే పెద్దవాడిని ,సరదాగా అన్నాను.సీరియస్ గా తీసుకోకు అన్నారు.ఇంతటితో నా పేరు తో తంటాలు సమాప్తం.


Monday 7 June 2010

అసూయ-ఆడవాళ్లు

అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తరవాత పుట్టారు అని అంటూ ఉంటారు కదా!అలా ఎందుకంటారు అని ఆలోచించగా ,చించగా నాకు ఈ సమాధానం తట్టింది.
అసూయ.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని మొదటి అక్షరం తో మొదలయ్యింది.
ఆడవాళ్లు.....మొదటి  అక్షరం తెలుగు అక్షరమాల లోని రెండో అక్షరం తో మొదలయ్యింది.అందుకనే అలా అంటున్నారు అని నేను అనుకుంటున్నాను.మరి అది కరక్టే నంటారా?

Sunday 6 June 2010

మెతుకు పట్టుకు చూస్తే చాలా?

అన్నం ఉడికింది ,లేనిది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలని అందరూ చెప్తుంటే నేనూ చాలనే అనుకున్నాను.నేను వంట మొదలు పెట్టిన తరువాతే ఆ statement  తప్పని తెలిసింది.నలపాయ పడితే పైన ఉడికినా మధ్యలో బియ్యం ఉడకకుండా  గింజలు గానే ఉంటుంది.(ఇప్పుడు కుక్కర్లు వచ్చినవి కనుక ఆ అవసరం లేదనుకోండి).ఈ ఒక్క విషయమనే కాదు,మనం నిత్యం చాలానే విషయాలలో తొందరపడి తప్పుడు statements ఇస్తూ ఉంటాము.మనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యీ అవగానే అతని కులాన్ని  బట్టో,లేకపోతే అతను ఏ ప్రాంతం వాడో ,ఆ ప్రాంతాన్ని బట్టి అతని గుణగణాల్ని అంచనా వేస్తూ ఉంటాము. అలాగే ప్రతీ విషయాన్నీ జనరలైజ్ చేస్తూ ఉంటాము....ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు ,మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు.
ఫలానా జిల్లా వాళ్ళందరూ మోసగాళ్ళు.ఫలానా కులం వాళ్ళందరూ 
పొగరుబోతులు. మాత్రుమూర్తులందరూ గొప్ప త్యాగమూర్తులు.(మరి రోడ్ల మీద,తుప్పల్లో,చెత్తకుండీల్లో రోజుల పసికందులు ఎందుకు దొరుకుతున్నారో తెలియదు)etc .,etc .,ఒక వ్యక్తి  గొప్ప గా ప్రవర్తించినా ,నీచంగా ప్రవర్తించినా ,అది ఆ వ్యక్తి కే పరిమితం చేయకుండా మొత్తం జాతి కి ఆపాదిస్తాం.

మనం దేనినయినా జడ్జ్ చేసేటప్పుడు ఏదో ఒక విషయమే పరిగణన లోకి తీసుకొని చేయకూడదని తెలిపే ఈ కథ చదవండి.
ఒక ఊరిలో ఒక వ్యక్తి కి నలుగురు కొడుకులు ఉన్నారు.తండ్రి, వాళ్ళకి ఏ విషయం లో కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు.నలుగురు కొడుకుల్ని ఎక్కడో దూరాన ఉన్న 'pear ' చెట్టు ను చూసి వచ్చి ఎలా ఉందో చెప్పమన్నాడు.ఒకరు వెళ్లి వచ్చినాక ఇంకొకరు అలా నలుగురు వెళ్లి చూసివచ్చారు.పెద్ద కొడుకు....చెట్టు అంతాఎండిపోయినట్టు ఉంది.ఒక్క ఆకు కూడా లేదు,ఆ చెట్టు చచ్చి పోవచ్చు అని చెప్పాడు.
రెండో కొడుకు.....చెట్టు చాలా పచ్చగా ఉంది.కొత్త చివుళ్ళ తో అని చెప్పాడు.
మూడో కొడుకు ...పూలు విరగబూసి ,చెట్టు ఎంతో అందం గా ఉంది అని చెప్పాడు.నాలుగో కొడుకు....కాయలు,పళ్ళతో నిండి ఉంది అని చెప్పాడు.అప్పుడు తండ్రి మీ నలుగురు చెప్పింది కరక్టే,కానీ నలుగురు  నాలుగు 'seasons ' లో వెళ్లి చూడటం వల్ల మీ నలుగురి అభిప్రాయాలు నాలుగు రకాలు గా ఉన్నాయి.కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఒక్క విషయం మీద బేస్ అయ్యి తీసుకోకూడదు అని చెప్పాడు.

we cannot judge a person or tree by only one season ,and that the  essence of who they are,and the pleasure,joy and love that come from that life can only be measured at the end,when all the seasons are up. if you give up when it is winter ,you will miss the promise of your spring,the beauty of your summer,fulfillment of your fall.So don't let the pain of one season destroy the joy of all the rest.Don't judge life by one difficult season.
    

Tuesday 18 May 2010

కాకతాళీయం/యాదృచ్చికం, దీనిని ఏమంటారు?

అబ్రహం లింకన్ కాంగ్రెస్ కు ఎన్నికయింది 1846లో
జాన్ ఎఫ్.కెన్నెడీ కాంగ్రెస్ కు ఎన్నికయింది 1946లో
అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయింది 1860లో
జాన్ ఎఫ్.కెన్నెడీ ప్రెసిడెంట్ గా ఎన్నికయింది 1960లో
ఇద్దరూ శుక్రవారమే కాల్చి చంపబడ్డారు.
లింకన్ సెక్రటరీ పేరు కెన్నెడీ
కెన్నెడీ సెక్రటరీ పేరు లింకన్
లింకన్ ను హత్య చేసిన 'జాన్ విల్కేస్ బూత్ '1839 లో జన్మించాడు.
కెన్నెడీ ను హత్య చేసిన 'lee harwey oswald '1939 లో జన్మించాడు.
లింకన్ ను 'ఫోర్డ్' అనే థియేటర్ వద్ద కాల్చి చంపారు.
కెన్నెడీ ను ఫోర్డ్ కంపనీ తయారు లింకన్ అనే పేరు గల కారు లో ప్రయాణిస్తుండగా కాల్చి చంపారు.

విచిత్రం గా ఉంది కదూ !

Saturday 1 May 2010

అజ్ఞానం లోనే ఆనందం ఉంది

అజ్ఞానం లోనే ఆనందం ఉంది.అవునండి,సరిగ్గానే చదివారు.ఏమిటీ అందరూ జ్ఞానాన్ని పెంచుకోండి,జీవితంలోకి వెలుగు తెచ్చుకోండి  అని చెపుతుంటే ,నువ్వేమో అజ్ఞానం లోనే ఆనందం ఉందని చెపుతున్నావు,నిన్న ఏమన్నా చింపాంజీ వారసుల తెలుగు సినిమా గానీ చూసావా అని అడుగుతున్నారా?అబ్బే అదేమీ లేదండి.కాకపోతే నేను సంపాదించుకున్న మిడి మిడి జ్ఞానం వల్ల పడిన కష్టాల వల్ల అలా అనవలసి వచ్చింది.కొంచం జ్ఞానం సంపాదించుకున్నందువల్లె  ఇన్ని కష్టాలు పడ్డాను,ఇక ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే ఎన్ని కష్టాలు పడాలో అని అజ్ఞానం లోనే ఆనందం ఉందనే నిర్ణయానికి వచ్చేసాను.జ్ఞానం ఎక్కువ ఉంటె ప్రతీ విషయాన్ని ఎందుకు ,ఏమిటి అని ప్రశ్నిస్తూఉంటాం.అదిఅలాగే ఎందుకుండాలి?ఇలా కూడా ఉండొచ్చు గా అనిపిస్తుంది. సో జీవితమంతా ప్రశ్నించటం తోను ,శోధించటంతోనే సరిపోతుంది.సరే ఇంతగా ప్రశ్నిస్తున్న,శోధిస్తున్నా ,మనకు నచ్చిన సమాధానం దొరుకుతుందా అంటే అనుమానమే.అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే ఈకష్టాలు ఇంకొంచం ఎక్కువగా ఉంటాయి.చదువుకున్నాక ఇంట్లో కూర్చోవాలంటే కూర్చో లేము.సరే ఉద్యోగం చేస్తుంటే ఆనందం ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి.రెండు పడవల మీద కాళ్ళు  పెట్టి ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది.ఇంట్లో పని,ఆఫీస్ పని మనకు మనమే శారీరక హింస పెట్టుకోవటం.దీనికి తోడూ ఆఫీస్ లో మగ కొలీగ్ ల వెక్కిరింపు మాటలు.ఇదంతా అవసరమా?అసలు చదువుకోపోతే(ఉద్యోగం వచ్చేంత) ఈ బాధ అంతా ఉండదు గా!జ్ఞానం పెరగటం వల్ల వచ్చిన ఇంకో నష్టం ఏమిటంటే ,నేను నీతో సమానం గా చదువుకుని ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను ,నీ గొప్ప ఏమిటి?నువ్వు ఇంటి పనులు చేయాల్సిందే అని ప్రతి రోజూ ఆయన గారితో గొడవ పెట్టుకుంటూ ఇంటిలోని వారికి   కిష్కిందకాండ దృశ్యాన్ని చూపించాల్సి వస్తుంది.అదే ఆడవారికి పురాణాల జ్ఞానం తప్పించి వేరే ఏ జ్ఞానము లేకపోతె,పతియే ప్రత్యక్ష దైవం అని పరవశించి పోతూ బ్రతికేస్తూ ఉంటారు.సదరు భర్త గారికి ఒకరో,ఇద్దరో ఆడ స్నేహితులు ఉన్నా  మా ఆయన అచ్చు ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని ఆనంద పడుతూ ఉంటారు.మరి ఇదంతా చదివాక మీరు కూడా అజ్ఞానం లోనే ఆనందం ఉందని ఏకీభవిస్తారా? 


గమనిక:ఇది సరదాకు రాసినది.ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోవద్దని మనవి.

Wednesday 28 April 2010

చాణక్య Quotes

Chanakya....Indian politician, strategist and writer (350 BC-275 BC) చాణక్యుడు చంద్రగుప్తుని కాలం నాటి వాడు.కౌటిల్యుడు అనేది చాణక్యుడి మరో పేరు.ఆయన ప్రవచించిన సుభాషితాలు కొన్ని .

"A person should not be too honest.
Straight trees are cut first
and Honest people are victimised first."


"Even if a snake is not poisonous,
it should pretend to be venomous."

"The biggest guru-mantra is: Never share your secrets with anybody.. ! It will destroy you."


"There is some self-interest behind every friendship.

There is no Friendship without self-interests.
This is a bitter truth."


"Before you start some work, always ask yourself three questions - Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply
and find satisfactory answers to these questions, go ahead."

"As soon as the fear approaches near, attack and destroy it."

"Once you start a working on something, don't be afraid of failure and don't abandon it.


People who work sincerely are the happiest."




"The fragrance of flowers spreads



only in the direction of the wind.



But the goodness of a person spreads in all direction."


పెళ్లి-ఓ రెండు quotes

Getting married is easy
Staying married is difficult

Staying happily married for a lifetime should rank among the fine arts.
                           ---Roberta Flack

Marriage,humanly speaking,is a job.

Happiness or unhappiness has nothing to do with
There never was a marriage yet that could not be made a success,not a  marriage yet that could not have ended in bitterness and failure

Tuesday 27 April 2010

ఆయాచితం గా పేరు

 కొంత మంది కి ఎంతో కష్ట పడితే కాని పేరు రాదు(ఏ దైనా సాదించినం దుకు,ప్రశంసో,కొండకచోతెగడ్త అయినా కావచ్చు  ).కొంతమందికి ఎక్కువ కష్టపడకుండానే పేరు వస్తుంది.కొంతమందికి అసలు ఏ మాత్రం కష్ట పడకుండానే పేరు లభిస్తుంది.చివరి కేటగిరి వారు మనకు మన ఇంట్లో మరియు ఆఫీస్ లో కూడా తారస పడతారు.మన ఇంట్లో మన అక్కో,తమ్ముడో,అన్నో,చెల్లెలో ,మన దృష్టిలో దుర్మార్గులు అయి ఉండవచ్చు.(ఎందుకంటే,మన వస్తువులు లాగేసుకుంటూ ఉంటారు,వాళ్ళ పనులు మనతో చేయించుకుంటూ ఉంటారు.(రికార్డు రాయించు కోవటం  ,నోట్స్ రాయించు కోవటం,etc..) కానీ,అమ్మ,నాన్నల  దృష్టిలో,మన బంధువుల దృష్టిలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు.(నోట్లో నాలుక లేని వారు,వినయవంతులు,బుద్దిమంతులు ...etc ...etc ..)వాళ్ళు ఎంత బుద్దిమంతులో మనకు మాత్రమే తెలుసు,ఎందుకంటే వాళ్ళ ప్రతాపమంతా మన దగ్గరే కదా చూపించేది.అలాగే ఆఫీస్ లో మనం ఎంతో కష్టపడుతుంటాం ,కానీ ,బాసు దగ్గర మంచి పేరు తెచ్చుకునేది మాత్రం మనం కాదు.అఫ్కోర్స్ మనకు పేరు వస్తుంది,కానీ నెగిటివ్ గా.(అసలు పని మీద శ్రద్ద లేదు,భాద్యతగా ఫీల్ అవటం లేదు etc ...etc ...)సో ...ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే,అసలు ఎవరికైతే పేరు రావాలో వాళ్ళకు రాదు,అర్హత లేకపోయినా కొంతమందికి ఆయాచితం గా పేరు లభిస్తుందని.ఇది మనుషులకే కాదు,ఊళ్లకు కూడా వర్తిస్తుంది.మా అమ్మమ్మ వాళ్ళ వూరు లో నారింజ తోటలు ఉన్నాయి.కానీ పేరు మాత్రం పక్కనే ఉన్న వడ్లపూడి కి నారింజ కు ప్రసిద్ది అనే పేరు వచ్చింది.అలాగే,మా తాతమ్మ గారి వూళ్ళో(లింగాయపాలెం) జామ తోటలు ఎక్కువ ఉన్నాయి.(ప్రస్తుతం కాదు,ఒకప్పుడు)కానీ పేరు మాత్రం రాయపూడి కి వచ్చింది.ఆవూరికి బస్సు సౌకర్యం లేదు.రాయపూడి లో దిగి నడిచి వెళ్ళాలి.బహుశా అందుకనే జామకాయలకు రాయపూడి ప్రసిద్ది చెందిందేమో!మీకూ ఇలాంటివి ఏమైనా తెలుసా?