చాలాకాలం గా మన సినిమాలలో టీచర్లను బఫూన్ ల లాగా చూపిస్తున్నారు. అందుకు భిన్నం గా టీచర్లను గొప్పగా చూపిస్తూ తీసిన చిత్రమే ఈ చాక్ అండ్ డస్టర్ . నాటకీయత పాలు కొంచం ఎక్కువైనా,కొద్దిపాటి లోపాలున్నా అంతగా పట్టించుకోనక్కరలేదు. సినిమా అద్భుతం అని చెప్పను కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సెలెబ్రిటీ ల పుట్టినరోజులు గుర్తుంచుకుని మరీ విష్ చేస్తాము. గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్తాము కానీ మనకు చదువు నేర్పించిన గురువును గుర్తు పెట్టుకుని వారికి విషెస్ చెప్పము అని. నిజమే కదా ! సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే జరుపుకుంటాము.ఆ రోజైనా గురువులకు ఎంతమందిమి విష్ చేస్తాము ? ఈ సినిమా చూడాలని అనుకునేవారు కోసం లింక్ ఇస్తున్నాను.
Showing posts with label నచ్చినవి. Show all posts
Showing posts with label నచ్చినవి. Show all posts
Sunday, 29 September 2019
Wednesday, 14 October 2015
The Boy in the Striped pyjamas
నేను ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూడను , అర్ధం కావు కనుక. ఎప్పుడన్నా టివీ లో సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూస్తూ ఉంటాను :) అలా చూసిన వాటిలో నచ్చిన సినిమా ఒకటి - The Boy in the Striped pyjamas .
ఈ సినిమా , యుద్ధ సమయం లో పిల్లల అమాయకత్వం , స్నేహం కోసం పడే తపనని అందం గా ఆవిష్కరించింది .
ఈ సినిమా , యుద్ధ సమయం లో పిల్లల అమాయకత్వం , స్నేహం కోసం పడే తపనని అందం గా ఆవిష్కరించింది .
బ్రూనో 8 ఏళ్ల బాలుడు . హోలోకాస్ట్ సమయంలో నాజీ జర్మనీలోని బెర్లిన్ లో తన కుటుంబంతో ఉంటాడు. అతను తన తండ్రికి ప్రమోషన్ వచ్చినందు వల్ల ,గ్రామీణ ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.బ్రూనో కి తనతో ఆడటానికి ఎవరూ లేనందున కొత్త ప్రదేశం నచ్చదు . అంతే కాకుండా తోట లో ఆడడం నిషేధం ,ఇంకో కారణం .
ఒక రోజు బ్రూనో , తల్లి తండ్రుల ఆజ్ఞ మీరి తోట లో ఆడుకుంటూ ఒక శిబిరం చుట్టూ ఉన్న విద్యుత్ ముళ్ల కంచె చేరుకుంటాడు. అక్కడ శిబిరం లో ఉంటున్న తన వయసు బాలుడు తో పరిచయం ఏర్పడుతుంది . బ్రూనో క్రమం తప్పకుండా ఆ పిల్లవాడికి(Shmuel ) ఆహారం తెచ్చి ఇస్తూ ,ఆడుతూ ఉంటాడు.Shmuel , తన తండ్రి కనిపించటం లేదని బాధ పడటం చూసి ,బ్రూనో -తన స్నేహితుడి తండ్రి ని వెదకటం లో సహాయం చేస్తానని హామీ ఇస్తాడు .
ఒక దుర్దినాన ,బ్రూనో ఖైదీల దుస్తులు ధరించి ,కంచె ఆవలి మరణ శిబిరం లోకి ప్రవేశిస్తాడు.స్నేహితులు ఇద్దరు Shmuel తండ్రి కోసం వెతుకుతుండగా , వారిని సైనికులు చుట్టు ముట్టి ఇతర ఖైదీలతో పాటు గాస్ చాంబర్ లో వేస్తారు. అలా ఆ బాలురిద్దరూ విషాదకరం గా మరణిస్తారు.
మనం మంచి చేస్తే మంచి ,చెడు చేస్తే చెడు తిరిగి వస్తాయి అనే దానికి ఉదాహరణ , ఈ సినిమా . తండ్రి చేసిన పాపానికి కొడుకు (బ్రూనో ) బాలి అవటం విషాదకరం .
ఒక దుర్దినాన ,బ్రూనో ఖైదీల దుస్తులు ధరించి ,కంచె ఆవలి మరణ శిబిరం లోకి ప్రవేశిస్తాడు.స్నేహితులు ఇద్దరు Shmuel తండ్రి కోసం వెతుకుతుండగా , వారిని సైనికులు చుట్టు ముట్టి ఇతర ఖైదీలతో పాటు గాస్ చాంబర్ లో వేస్తారు. అలా ఆ బాలురిద్దరూ విషాదకరం గా మరణిస్తారు.
మనం మంచి చేస్తే మంచి ,చెడు చేస్తే చెడు తిరిగి వస్తాయి అనే దానికి ఉదాహరణ , ఈ సినిమా . తండ్రి చేసిన పాపానికి కొడుకు (బ్రూనో ) బాలి అవటం విషాదకరం .
Saturday, 25 April 2015
Tuesday, 6 January 2015
మనిషి మారలేదు
వేషము మార్చెనూ
భాషను మార్చెనూ
మోసము నేర్చెను
అసలు తానే మారెనూ
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలెదు
ఆయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
ఆతని మమత తీరలెదు
ఆయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
ఘొరారణ్యములు ఆక్రమించెను
హిమలయము పై ఝండా పాతెను
ఆకాసం లో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఘొరారణ్యములు ఆక్రమించెను
హిమలయము పై ఝండా పాతెను
ఆకాసం లో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
అతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమే మేలని బోధలు చేసెను
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమే మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు
అతని బాధ తీరలేదు
ఇది 1962 లో వచ్చిన గుండమ్మ కథ చిత్రం లోని పాట . రాసినది పింగళి నాగేంద్ర .
అయినా మనిషి మారలేదు ... అతని కాంక్ష తీరలేదు
నిజమే కాలంతో పాటు ,ఎన్నో మార్పులు వచ్చినా మనిషి మారలేదు
ఒకప్పుడు ఆధిపత్యం కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే ,ఇప్పుడు దేశాల మధ్య ... రాష్ట్రాల మధ్య ...
ఒకప్పుడు రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేవారు . ఇప్పుడు ప్రజల సొమ్ము విగ్రహాల పాలు
ఎంతమంది స్వామీజీ లు ,గురువులు ఉంటే వారి భక్తుల సొమ్ము - అన్ని స్తూపాలు ,విగ్రహాల పాలు
ఇక బాధలు గురించి తెలియనిదేముంది ?అవి కలకాలం కళ కళ లాడుతూ ఉంటాయి :))
Thursday, 4 December 2014
తిలక్ గారు రాసిన ఆర్తగీతం కవిత నుంచి నాకు నచ్చిన పంక్తులు కొన్ని ...
ఇంక నన్ను విసిగింపకు
ఇంక నన్ను నిర్భంధించకు నేస్తం ! ఈ రాత్రి నేను పాడలేను,
ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవుని గా శిరసెత్తుకు తిరుగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను
నా దేశాన్ని గూర్చి పాడలేను,నీ ఆదేశాన్ని మన్నించలేను
ఈ విపంచికకు శ్రుతి కలుపలేను
ఈ విపంచికకు శ్రుతి కలుపలేను
గత చారిత్రక యశ:కలాపమ్ము వివరింపకు .
బహుళ వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
బహుళ వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
ఇంక నన్ను విసిగింపకు
నేడు నేను కన్నీరు గా కరిగిన గీతికను,సిగ్గుతో రెండుగా
చీలిన వెదురు బొంగును,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను
చీలిన వెదురు బొంగును,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను
నేను చూశాను నిజం గా మూర్తీభవత్ దైన్యాన్ని,హైన్యాన్ని
క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?ఏ విజ్ఞాన ప్రకర్షకుపశ్రుతి?
ఏ బుద్దదేవుడి జన్మభూమి కి గర్వస్మృతి
క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?ఏ విజ్ఞాన ప్రకర్షకుపశ్రుతి?
ఏ బుద్దదేవుడి జన్మభూమి కి గర్వస్మృతి
ఇంక నన్ను నిర్భంధించకు నేస్తం ! ఈ రాత్రి నేను పాడలేను,
ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవుని గా శిరసెత్తుకు తిరుగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను
Tuesday, 2 December 2014
నచ్చిన కవిత ఒకటి
మరచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయిన జండా చిహ్నం
మాయమైన మహాసముద్రాలను
మరుభూమి లోని అడుగుజాడ స్మరిస్తుంది
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది
శిలా శాసనం మౌనం గా
ఇంద్రధనుస్సును పీల్చే ఇవాళ్టి మన నేత్రం
సాంద్ర తమస్సు పీల్చే రేపటి మిణుగురు పురుగు
కర్పూర ధూమ ధూపం లాంటి
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట
ఎప్పుడో ఎందుకో నవ్వే పాప
బాంబుల వర్షాలు వెలిసి పోయాక
బాకుల నాట్యాలు అలసిపోయాక
గడ్డిపువ్వులు హేళన గా నవ్వుతాయి
గాలి జాలిగా నిస్వసిస్తుంది
ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
పొలంలో హలంతో రైతు
నిలుస్తాడివాళా ,రేపూ .
ఈ కవిత, శ్రీ శ్రీ గారు రాసినది .
Saturday, 15 February 2014
Itnaa na mujhse tu pyaar badhaa...
itnaa na mujhse tu pyaar badhaa, ke main ek baadal aawaaraa
kaise kisi kaa sahaaraa banoon, ke main khud beghar bechaaraa
Isliye tujhse main pyaar karoon, ke tu ek baadal aawaaraa
janam janam se hoon saath tere, hai naam meraa jal ki dhaaraa
mujhe ek jagah aaraam nahin, ruk jaanaa meraa kaam nahin
meraa saath kahaan tak dogi tum, mai desh videsh kaa banjaaraa
o neel gagan ke deewaane, tu pyaar na meraa pahchaane
main tab tak saath chaloon tere, jab tak na kahe tu main haaraa
kyun pyaar mein tu naadaan baney, ik paagal kaa armaan bane
ab laut ke jaana mushkil hai, maine chhod diya hai jag saara
Thursday, 6 February 2014
కనులను తోచి చేతికందని ఎండమావులున్నాయి
కనులను తోచి చేతికందని ఎండమావులున్నాయి
కనులకు తోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం ...
సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
Thursday, 2 May 2013
Wednesday, 13 June 2012
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని..
చిత్రం : దేవుడే గెలిచాడు
సంగీతం:రమేష్ నాయుడు
గీత రచయిత:జాలాది రాజారావు
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చెరిసగాల భావనతో యుగయుగాల దీవెనతో
రేపు మాపు లాగా కలసి ఉందాము కరిగిపోదాము కరిగిపోదాము
నాలో ... నీలో నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను ..పాడి ఆడతానూ ...
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
నిన్నటిలో నిజం లాగ రేపు తీపిగా ఉంటే
ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే
చావని కోరికలాగే పుడుతుంటాము
తిరిగి పుట్టి చావకుండా బ్రతికుంటాము
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
నా జన్మకు ప్రాణం నీవై
నీ ప్రాణికి ఆత్మను నేనై
కాలానికి ఇరుసువు నీవై తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా మరి ఎన్ని యుగాలైనా
వీడని బంధాలై కావ్యపు గంధాలై
నాలో ... నీలో నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను ..పాడి ఆడతానూ ...
ఈ కాలం పది కాలాల బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
పాట ఇక్కడ వినండి.
ఈ పాట కు మాత్రమే లింక్ ఇద్దామనుకున్నాను కానీ దొరకలేదు.సో, ఈ పాట తో పాటు ఈ సినిమా లోని మిగిలిన రెండు పాటలు కూడా వినేసేయ్యండి. :)
సంగీతం:రమేష్ నాయుడు
గీత రచయిత:జాలాది రాజారావు
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చెరిసగాల భావనతో యుగయుగాల దీవెనతో
రేపు మాపు లాగా కలసి ఉందాము కరిగిపోదాము కరిగిపోదాము
నాలో ... నీలో నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను ..పాడి ఆడతానూ ...
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
నిన్నటిలో నిజం లాగ రేపు తీపిగా ఉంటే
ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే
చావని కోరికలాగే పుడుతుంటాము
తిరిగి పుట్టి చావకుండా బ్రతికుంటాము
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
నా జన్మకు ప్రాణం నీవై
నీ ప్రాణికి ఆత్మను నేనై
కాలానికి ఇరుసువు నీవై తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా మరి ఎన్ని యుగాలైనా
వీడని బంధాలై కావ్యపు గంధాలై
నాలో ... నీలో నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను ..పాడి ఆడతానూ ...
ఈ కాలం పది కాలాల బ్రతకాలని
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
పాట ఇక్కడ వినండి.
ఈ పాట కు మాత్రమే లింక్ ఇద్దామనుకున్నాను కానీ దొరకలేదు.సో, ఈ పాట తో పాటు ఈ సినిమా లోని మిగిలిన రెండు పాటలు కూడా వినేసేయ్యండి. :)
Wednesday, 25 January 2012
పూలు వికసిస్తాయి,వికసించి వాడి పోవడానికి....
खिलते हैं गुल यहाँ, खिल के बिखर ने को
मिलते हैं दिल यहाँ, मिल के बिछड़ ने को
कल रहे ना रहे, मौसम ये प्यार का
कल रुके ना रुके, डोला बहार का
चार पल मिले जो आज प्यार में गुजार दो
झीलों के होठोंपर मेघों का राग हैं
फूलों के सीने में ठंडी ठंडी आग हैं
दिल के आईने में ये तू समा उतार ले
प्यासा हैं दिल सनम प्यासी ये रात हैं
होठों में दबी दबी कोई मीठी बात हैं
इन लम्हों पे आज तू हर खुशी निसार दे
పాట ఇక్కడ వినండి.
Monday, 16 January 2012
Monday, 7 November 2011
His name is Today
His name is Today ....నాకు నచ్చిన poem.రాసింది Gabriela Mistral (Nobel prize Recipient )



We are guilty of many errors and many faults,
But our worst crime is abandoning the children,
Neglecting the fountain of life.
Many of the things we need can wait,
The child cannot wait.
Right now is the time his bones are being formed,
His blood is being made,
And his senses are being developed.
To him we cannot answer ‘tomorrow’
His name is Today.



We are guilty of many errors and many faults,
But our worst crime is abandoning the children,
Neglecting the fountain of life.
Many of the things we need can wait,
The child cannot wait.
Right now is the time his bones are being formed,
His blood is being made,
And his senses are being developed.
To him we cannot answer ‘tomorrow’
His name is Today.
Friday, 2 September 2011
భారత దేశం గురించి ఓ నలుగురు ప్రముఖులు....
We owe a lot to the Indians ,who taught us how to count without which no worthwhile scientific discovery could have been made - ALBERT EINSTEIN
The Sanskrit language whatever be its antiquity is of wonderful structure,more perfect than the Greek,more copious than the Latin and more exquisitely refined than either- Sir William Jones
India is the cradle of the human race,the birth place of human speech,the mother of history,the grand mother of legend and the great grand mother of tradition-
MARK TWAIN
If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts ,has most deeply pondered on the greatest problems of life and has found solutions,I should point to India- MAX MUELLER
Sunday, 24 July 2011
సైకత శిల్పాలు
![]() |
| sand sculpture of (L to R) former British Prime Minister Winston Churchill, US President Franklin D. Roosevelt and Soviet dictator Josef Stalin |
![]() |
![]() |
| A sand sculpture is displayed during the annual Blankenberge sand sculpture Festival 2010 themed "travel around the world", |
![]() |
| A sand sculpture entitled "Flea Circus" carved by Susanne Ruseler from the Netherlands |
![]() |
| Giant Scorpion" carved by Fergus Mulvany from Ireland |
![]() |
| A sand sculpture entitled "Alice and the Caterpillar" carved by Christina Mija from Australia |
![]() |
| A sand sculpture entitled "Enchanted Garden" carved by Meg Murray from Australia |
![]() |
| Gulliver |
![]() |
| Maestro Paganini |
![]() |
| Lair of the spider queen carved by Baldrick Buckle(UK) |
Wednesday, 20 April 2011
మెటిల్డా
మెటిల్డా
డైరెక్టర్ -Danny DeVito
Writer: Roald Dahl
screenplay :Nicholas Kazan
మెటిల్డా చాలా తెలివైన అమ్మాయి.స్కూల్ కి వెళ్ళటం,పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.ఇంట్లో మిగతా ముగ్గురు(తల్లి,తండ్రి,అన్న)కి టి.వి.కాలక్షేపం.తల్లి బింగో ఆడుతుంటుంది.తండ్రి కార్ల అమ్మకం చేస్తుంటాడు.మెటిల్డా చెపితేనే కానీ ,తనను స్కూల్ కి పంపే వయసు వచ్చిందని తెలుసుకోలేనంత గా తమ వ్యాపకాల లో మునిగి పోయి ఉంటారు.ఎలాగైతేనేం ,మెటిల్డా ని స్కూల్ కి పంపిస్తారు.ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పరమ క్రూరురాలు.మెటిల్డా తనకున్న పవర్స్ తో ...ఆ ప్రిన్సిపాల్ ని స్కూల్ నుంచి ఎలా పంపించివేసింది,తన టీచర్ కు ...ప్రిన్సిపాల్ నుంచి ,ఆమె ప్రాపర్టీ ని తిరిగి ఎలా ఇప్పించింది అన్నది కథ.మెటిల్డా గా మారా విల్సన్ చాలా బాగా యాక్ట్ చేసింది.చాలా క్యూట్ గా ఉంది.ప్రిన్సిపాల్ పాత్ర లో Danny DeVito అంతే బాగా యాక్ట్ చేసింది.పిల్లలకు,చైల్డిష్ మెంటాలిటీ ఉన్న నా లాంటి పెద్దలకు నచ్చే సినిమా ఇది.
Saturday, 12 March 2011
అణువు అణువున వెలసిన దేవా
మానవుడు-దానవుడు సినిమా లోని ఈ పాట నాకు చాలా ఇష్టం.
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా
మనిషిని మనిషే కరిచే వేళ,
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకు అందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృభూమి మొర పెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలంను సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగనిరతి మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
వ్యాధులు,బాధలు ముసిరేవేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగా గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులూది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకు అందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
Thursday, 3 February 2011
తు హి తు
లక్ష్మీ నీవే,
దుర్గా నీవే,
సరస్వతీ నువ్వే
నువ్వు నువ్వే
అదే పాట ఇందిరా గాంధి,కుటుంబ సభ్యుల పిక్చర్స్ తో
తు హి తు అనే ఈ స్టార్ ప్లస్ anthem నాకు చాలా నచ్చింది.
Monday, 24 January 2011
దో ఫల్ రుక క్వాభోన్ క కార్వా
జీవితాన్ని ప్రయాణం తో పోల్చారు ,కొంతమంది కవులు.మన జీవన పయనం లో ఎంతో మంది మనకు తారస పడుతుంటారు.అందులో కొంతమంది ...పరిచయం చిన్నదైనా ,మనసుకు చాలా దగ్గర అవుతారు.అలా దగ్గరైన వారు మనకు దూరమవుతుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది కదూ...
వీర్జార లో అలా దూరమవుతున్న ఇద్దరు పాడుకునే ,లతా మంగేష్కర్,సోను నిగం పాడిన ఈ పాట మీరూ వినండి/చూడండి.
Wednesday, 19 January 2011
హర్ జనం మే హమారా మిలన్
1975 లో బి.ఆర్.ఇషారా దర్శకత్వం లో వచ్చిన కాగజ్ కి నావ్ అనే సినిమా లోని మన్ హర్,ఆశా భోంస్లే పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.ఇది రాజ్ కిరణ్ ,సారిక ల మొదటి సినిమా.హ్యూమన్ రిలేషన్స్ మీద తీసిన ఒక మంచి సినిమా.
Subscribe to:
Posts (Atom)




































