Monday 19 June 2017

ముక్తేశ్వర్ ధామ్

ద్వాపర యుగం లో,పాండవుల వనవాసపు 12 వ సంవత్సరం లో తలదాచుకున్న గుహలు - ఈ ముక్తేశ్వర్ ధామ్.ఇక్కడ పాండవులు సుమారు ఒక ఆరు మాసాలు ఉన్నారని నమ్మకం . దీని గురించి ప్రస్తావన స్కంధ పురాణంలో ఉందంట.పెద్ద కొండ, పక్కనే రావి నది ప్రవహిస్తూ చూడటానికి ఎంతో ఆహ్లాదం గా ఉంది.పాండవులు నివాసం ఉండటానికి ఈ కొండలో 5 గుహలు తొలిచారంట.ప్రస్తుతం మూడు గుహలు మాత్రమే చూడటానికి వీలుగా ఉన్నాయి.

          
గుహల వద్దకు వెళ్ళటానికి మెట్ల దారి 


రావి నది 




గుహ అంతర్భాగం 

మూడవ గుహ లోని పైకప్పు ,ఇక్కడ పాండవులు మెడిటేషన్ చేసే వారు అని అక్కడ పూజారి చెప్పారు 




మెట్ల పక్కనే ఉన్న కొండ , నాకు శివుని రూపం కనిపించింది. మీకూ కనిపిస్తుందేమో చూడండి :)


మూడవ గుహ కి దారి 



Thursday 8 June 2017

అందమైన రైల్వే స్టేషన్ - ఉదయపూర్

రైల్వే స్టేషన్ వచ్చింది,దిగండి అన్నది విని   క్షణం నోట మాట రాలేదు.చాలా సేపటివరకు నమ్మకం కలగలేదు.ప్రవేశ ద్వారానికి ఎదురుగా రోడ్డు కవతల రాణా ప్రతాప్ విగ్రహం.ప్రవేశ ద్వారానికి రెండు పక్కల గోడల పైన,టెర్రకోట బొమ్మలు.స్టేషన్ లోపల గోడల పైన,పై కప్పు  మీద పెయింటింగ్ లు      --- చాలా అందం గా ఉంది . కొన్ని ఫోటో లు మీ కోసం  :)






స్టేషన్ లోపల ...