Thursday 13 July 2017

కర్ణాటక కోవెల యాత్ర - ముగింపు

యాత్ర అంతా సవ్యం గానే జరిగినా చిన్న అసంతృప్తి.ఎక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు తక్కువ సమయం,తక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు ఎక్కువ సమయం... బేలూర్,తిరుగు ప్రయాణం రోజు చూడాల్సిరావటం,చాలా తక్కువ సమయం ఇవ్వటం వల్ల-హడావిడిగా పరుగులుపెట్టి...సరిగా చూడలేకపోయాము.హొయసల రాజు విష్ణువర్ధనుడు  కట్టించిన చెన్నకేశవ /విజయనారాయణ ఆలయం శిల్పకళ అద్భుతం.   

ఈ రాజ గోపురం తర్వాతి కాలం లో విజయనగర రాజులు కట్టించారట 

గరుడ ధ్వజ స్థంభం 












Wednesday 5 July 2017

శనివార్ వాడా

ఒకప్పటి పేష్వాల నివాసం. ఇప్పుడు శిధిలమై పునాదులు మాత్రమే మిగిలాయి.చరిత్ర అంటే ఇష్టపడే వాళ్ళు ,ఒకసారి సందర్శించొచ్చు.ప్రతి ఒక్క చోట బోర్డులు ఉండటం వల్ల ఒకప్పుడు అక్కడ సభ జరిగేది,ఫలానా వారు నివాసం ఉన్నారు.ఇక్కడ కూర్చొని నృత్య ప్రదర్శనలు చూసేవారు అని ఊహించుకోవాల్సిందే. 1730 లో ఒక శనివారం రోజు పేష్వా బాజీరావు 1 ఈ వాడా కి శంఖుస్థాపన చేశారు.1732 లో పూర్తయ్యింది.శనివారం రోజున మొదలు పెట్టటం వల్ల ,దీనికి శనివార్ వాడా అని పేరు.ఈ కోటలో సుమారు వెయ్యి మంది నివసించేవారట.1828 లో జరిగిన అగ్నిప్రమాదం తో కోట మొత్తం ధ్వంసం అయ్యింది.

           
ప్రవేశ ద్వారం 


       ఒకప్పటి చరిత్ర కి ఆనవాళ్లు 



ఫౌంటెన్
మంత్రుల సమావేశం జరిగే ప్రదేశం


దీనికి ఎదురుగా రంగమహల్ ఉండేదట. ఇక్కడ కూర్చొని నృత్యం చూసేవారట 




Sunday 2 July 2017

కాపీ

ఈగ ,లేదా ఇంకోటేదో సినిమా చూడగానే ఇది ఫలానా సినిమా కి కాపీ ,కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు ,కాపీ కాదు స్ఫూర్తి పొందారు,వగైరా ... ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాము  😊. అయితే మన తెలుగు సినిమాల నుంచి కూడా స్ఫూర్తి పొందేవారు లేదా కాపీ కొట్టేవారు ఉన్నారు. లేదా వారికే స్వయం గా అలాంటి కథ తట్టి ఉండొచ్చు.చెప్పలేం.ఇవాళ " The parent trap" అనే సినిమా చూసాను.ఏవో కొద్దీ మార్పులతో అచ్ఛం లేత మనసులు అనే సినిమా లానే ఉంది.కాకపొతే తెలుగు సినిమా నేను పుట్టకముందు వచ్చినది.ఇంగ్లిష్ సినిమా 1998లో తీసినది/విడుదల.రెండు సినిమాల లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

The parent trap



Letha Manasulu