Wednesday 23 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - కటీల్ ,ఉడిపి

మంగళూరుకి 29కి.మీల దూరంలో ఉన్న కటీల్ లో దుర్గాపరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు.పూర్వం , ఒకానొక కాలం లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనటం తో , జాబాలి అనే మహర్షి , యజ్ఞం చేయ తలపెట్టాడు. యజ్ఞానికి కావాల్సిన హోమధేనువు కోసం   ఇంద్రుడు వద్దకు వెళ్లగా , ఇంద్రుడు నందిని అనే ఆవును తీసుకెళ్లమని చెప్పగా , జాబాలి నందిని వద్దకు వెళ్లి భూమి కి రమ్మని కోరాడు.నందిని అందుకు అంగీకరించక పోవటంతో,కోపించి నందిని ని నది గా మారి భూమి మీద ప్రవహించమని శపించాడు.నందిని క్షమించమని వేడుకోగా, జాబాలి - శాపవిమోచనకు ఆదిశక్తిని ప్రార్ధించమని చెప్పగా,నందిని- అమ్మవారిని ప్రార్ధించిందట.దేవి,శాప విమోచనం సాధ్యం కాదని, తాను అక్కడ కొలువై ఉంటానని చెప్పారట. నందిని నది పుట్టిన స్థానానికి,సముద్రం లో కలిసే ప్రదేశానికి మధ్యలో అమ్మవారు వెలిశారు,అందుకని ఈ ప్రదేశానికి కటీలు అని పేరు . 




నందిని నది

అమ్మవారిని దర్శించుకుని , తిరిగి మంగళూరు చేరుకున్నాము. మరుసటి రోజు ప్రొద్దున్న ఉడిపి వెళ్లి , కృష్ణుడిని దర్శించుకుని , లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , సాయంకాలం Malpe బీచ్ కి వెళ్ళాము.సూర్యాస్తమయాన్ని చూసి తిరిగి బసకి   చేరుకున్నాము.కొంతమంది బీచ్ కి రాము అని చెప్పి, సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లారు.వాళ్ళు, పూజ చాలా బాగా చేశారు, దీపాలు వెలిగించి వచ్చాము ,అని చెప్పటం తో అయ్యో , అనవసరం గా బీచ్ కి వెళ్ళాము అని కొంతమంది బాధ పడ్డారు.మా టూర్ ఆపరేటర్- గోకర్ణ ,మురుడేశ్వర్ చూసి మళ్ళీ ఉడుపి వస్తాము,అప్పుడు వెళ్ళండి అని చెప్పారు.    



13వ శతాబ్దం లో మద్వాచార్యుల వారు, ఇక్కడ కృష్ణ మఠం స్థాపించారు.కనకదాస అనే భక్తుడు , కృష్ణమఠానికి ఎదురుగా ఉండేవాడు. అస్పృస్యుడు అనే కారణం తో గుడిలోకి రానివ్వని కారణం గా ,తూర్పు ముఖానికి ఉన్న విగ్రహం పశ్చిమానికి తిరిగిందట.కనకదాస పేరు మీదుగా ఈ ద్వారానికి కనకన ఖిండి అని పేరు.ఈ ద్వారం నుంచి ప్రవేశం నిషిద్ధం. ఈ ద్వారానికి ఎదురుగా కనకదాస విగ్రహం ఉంది.       





   స్వామిని నేరుగా దర్శించటానికి లేదు. ఈ కిటికీ (నవగ్రహ కిటికీ) నుంచి దర్శనం చేసుకోవాలి .


చంద్రమౌళీశ్వర ఆలయం 

 Malpe beach



బీచ్  ఎంట్రన్స్ వద్ద ... 



Wednesday 16 November 2016

మొన్నటి చంద్రుడు



ప్రత్యేకించి చంద్రుడిని చూడాలని చూడకపోయినా ,చందమామ పలు రూపాలని చాలా సార్లే చూసాను. చిన్నతనం లో మరీ ఎక్కువ గా. వేసవి కాలం లో , సాయంకాలం అవగానే సూర్యుని ప్రతాపానికి కాలిపోతున్న నేల తల్లిని చల్లార్చటానికి,పెరట్లో బకెట్లకు బకెట్లు నీళ్లు చల్లి ,ఆ తర్వాత వరసనే మంచాలు ... 6:30 , ఏడింటి కల్లా భోజనం చేసి పిల్లలమంతా మంచాల మీదకు చేరి కబుర్లు చెప్పుకోవటం , అదొక అద్భుతమైన జ్ఞాపకం. చుక్కల్ని చూసి వాటికి రకరకాల రూపాల్ని ఆపాదించటం , చందమామ లో కుందేలు ఉంటదన్నారు,మచ్చ ఉందన్నారు , ఏదీ కనపడటం లేదే ... ఇలా . ఏం మాట్లాడుకునేవాళ్ళమో పూర్తిగా గుర్తు లేదు కానీ , ఆ కబుర్లకు అంతు అంటూ ఉండేది కాదు . అప్పట్లో చందమామ లో ఉన్న మచ్చలు ఏమి కనిపించలేదు - ఇప్పుడు చాలానే కనిపిస్తున్నాయి , బహుశా ఈ భూమి మీద మనం పొంగి పొర్లిస్తున్న కాలుష్యం కావొచ్చు లేదా చందమామ మనకి చాలా దగ్గరగా వచ్చి  ఉండొచ్చు. ఇంకొన్నాళ్ల తర్వాత , సిటీ లో ... వేసవి లో రోజూ టంచన్ గా ఏడింటికి కరెంట్ పోయేది,మళ్ళీ కరెంట్ వచ్ఛేలోపు భోజనాలు పూర్తిచేసి అంత్యాక్షరి ఆడేవాళ్ళం.అదే పౌర్ణమి రోజయితే ఆనందానికి హద్దు ఉండేది కాదు,ఎందుకంటే,గుడ్డివెల్తురులో,ఉక్కపోత భరిస్తూబొంచెయ్యక్కరలేదు.హాయిగా వెన్నెల్లో  హాయ్ హాయ్ అనుకుంటూ ప్రశాంతం గా తినొచ్చు.ఇక అపార్టుమెంట్లు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా చూడటం తప్ప చంద్రుణ్ణి చూడటం పూర్తిగా మర్చేపోయాను.ఈ మధ్య ఫలానా రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు, భూమికి దగ్గరగా వస్తాడు, పెద్దగా కనిపిస్తాడు , చూడండి , మిస్ అవ్వొద్దు అని అందరూ పదే పదే   ఊదరగొడుతుంటే , ఎలా ఉంటుందో తప్పక చూడాలి , మిస్ కాకూడదు అనుకుంటే , మొదటిసారి చెప్పినప్పుడు ఆకాశం మబ్బులు పట్టేసి అసలు చంద్రుని దర్శనమే అవలేదు.నిన్న మాత్రం చూడగలిగాను.నాకు,చంద్రుడు మరీ అంత పెద్దగా ఏమీ అనిపించలేదు.అంతకుముందు, పర్లి నుంచి తిరిగి వచ్చేప్పుడుట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండటం తో , ఏమి తోచక -  మాఘ పౌర్ణిమ రోజు చంద్రుడిని  ఫోటోలు తీస్తూ టైం పాస్ చేసాను.ఒక్క రంగులో తప్పించి, అప్పటి చంద్రుడికి , మొన్నటి చంద్రుడికి తేడా ఏమి లేదు 😊  



మాఘ పౌర్ణిమ చంద్రుడు 


మొన్నటి చంద్రుడు 


బాక్ లైటింగ్ చేంజ్ చేస్తే ఇలా ... 


Tuesday 8 November 2016

కర్ణాటక కోవెల యాత్ర- ధర్మస్థల



మూడో రోజు ,ధర్మస్థల కి ప్రయాణం. మంజునాథ స్వామి ఆలయం.
800 ఏళ్ల క్రితం,కుడుమ(ఇప్పటి ధర్మస్థల)అనే గ్రామంలో బిర్మన్నపెరగాడే అనే దంపతులు నివసించేవారు.దేవతలు,ధర్మ పరిరక్షణకు అనువైన స్థలం వెదుకుతూ, కుడుమ గ్రామానికి వచ్చారంట. బిర్మన్న దంపతుల ఆతిధ్యానికి మెచ్చి , కలలో కనిపించి - వారు ఉంటున్న ఇంటిని దేవతలను కొలవటానికి ఉపయోగించమని చెప్పారంట.దాని ప్రకారమే వారు ఆ ఇంటిని ఖాళీ చేసి దేవతలను(కాలరాహు,కుమారస్వామి,కన్యాకుమారి)ప్రతిష్టించి పూజలు జరపటం ప్రారంభించారట.పూజా కార్యక్రమాలు నిర్వహించే వారి కోరిక మేరకు శివలింగాన్ని ప్రతిష్టించారట.
చాంతాడంత క్యూ.200రూపాయల టికెట్ తీసుకున్నాము.వృద్ధులు,అంగవైకల్యంఉన్నవారు క్యూలో  కాకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు.మాకు దర్శనం చేసుకోవటానికి మూడున్నర గంటలు పట్టింది.  

గుడి వెలుపల (వెళ్లే దారి లో )వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన రథాలు,పాతవి  ఉన్నాయి . ఎంతో అందం గా ఉన్నాయి. 

గంగాధర స్వామి రథ,శ్రీరంగపట్నం

  

అమృతేశ్వర రథ,హాసన్ 

మల్లేశ్వర స్వామి రథ,బళ్ళారి 








దర్శనం చేసుకుని,అక్కడే లంచ్ చేసి కటీలు కి వెళ్ళాము . వివరాలు తర్వాతి పోస్ట్ లో . 



Tuesday 1 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - మంగళూరు

కుక్కే నుంచి మంగళూరు కి ప్రయాణం

మంగళూరు లో మొదటగా మంగళాదేవి మందిరానికి వెళ్ళాము.అమ్మవారి పేరు తోనే ఈ ఊరు - మంగళాపురం  గా పిలువబడి ,కాలక్రమం లో మంగళూరు గా స్థిరపడింది. 9వ శతాబ్దం లో , అలుప వంశానికి చెందిన కుందవర్మన్ ఈ ఆలయాన్ని , కేరళ గుడుల నిర్మాణ శైలి లో కట్టించాడు  అని ఒక కథనం. ఇంకో కథనం ప్రకారం ,పరశురాముడు నిర్మించగా - తర్వాతి కాలం లో  కుందవర్మన్ విస్తరించాడని.






















అక్కడ్నుంచి,కుడ్రోలి గోకర్ణాథేశ్వరక్షేత్రానికి వెళ్ళాము.మొట్టమొదట నారాయణ గురు ఆధ్వర్యాన , కోరగప్ప 1912 వ సంవత్సరం లో నిర్మించారు . రెనోవేషన్ తర్వాత 1991 లో రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.ఈ క్షేత్రంలో శివునితో పాటు గణపతి,సుబ్రహ్మణ్యస్వామి,అన్నపూర్ణ,భైరవ,శని,కృష్ణ,నవగ్రహాలమందిరాలు కూడా ఉన్నాయి.హనుమాన్ మందిరాన్ని 2007 లో నిర్మించారు .