Wednesday, 30 June 2010

కాన్సర్ కి ,సెల్ టవర్ లకు సంబంధం ఉందా?


 జనరల్ గా మన అందరికి ....సెల్ ఫోన్  టవర్ లకు  దగ్గరలో నివసిస్తున్నట్లయితే  కాన్సర్ సోకే అవకాశం ఎక్కువ      అనే అభిప్రాయం ఉంది.కానీ అది తప్పని ఇటీవల పరిశోధనలు తెలుపుతున్నాయి.ఇంపీరియల్ కాలేజ్,లండన్ వారి పరిశోధన ఫలితాలు ..... చిన్న పిల్లలకు వచ్చే కాన్సర్ కు ,సెల్ ఫోన్ టవర్ లకు దగ్గర లో నివసించటానికి సంబంధం లేదని తెలుపుతున్నాయి.మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.

Sunday, 20 June 2010

రావణ్

రావణ్ సినిమా విడుదలైన మరుసటి రోజే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసాము.నేను అతి కష్టం మీద ఒక పావు గంట మాత్రమే చూసాను.సినిమా అంత దరిద్రంగా ఉంది మరి(ప్రింట్ అనుకునేరు,ప్రింట్ కాదు).విక్రం ఐ న్యూస్ లో ఇంటర్వ్యు ఇస్తూ ఒక్క బాష లో కాదు,మూడు బాషల్లోనూ సినిమా ను చూడండి అని చెప్పాడు.ఒకటి చూడటమే కష్టం అయితే  ఇక మూడూ బాషల్లోనూ ఏమి చూస్తాము?  సినిమాలో  రాంజా,రాంజా ,బెహనేదో ....ఈ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి.

Friday, 11 June 2010

జోక్స్

     ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: నీ బర్త్ డేట్ ఏమిటి?
     అభ్యర్ధి:   అక్టోబర్  13   
     ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: ఏ సంవత్సరం?
     అభ్యర్ధి: ప్రతి సంవత్సరం
    ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి     .  అప్పుడు   అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి     ఎలా తప్పించుకుంటారు?
   అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను.
   ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీకు M .S .office  తెలుసా?
   అభ్యర్ధి:మీరు అడ్రస్ ఇస్తే తెలుసుకుంటాను సర్.
     ****************************

   విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి తన భార్య తో.....నేను విదేశీ వాడి   లాగా కనిపిస్తున్నానా? అని అడిగాడు.
  భార్య:లేదే ,ఎందుకలా అడిగారు?
  భర్త:లండన్ లో అందరూ నన్ను విదేశీ వా అని అడిగారు మరి?
        ****************************
  టీచర్ :గాంధి జయంతి గురించి వ్రాయండి అని స్టూడెంట్స్ కి చెప్పింది.
  ఒక స్టూడెంట్ ఇలా వ్రాసాడు.
  గాంధి చాలా గొప్పవాడు.కానీ జయంతి ఎవరో నాకు తెలియదు.
     ****************************

Wednesday, 9 June 2010

పేరు తో తంటాలు

పేరు లో నేముంది టపాలు చదివాకా నాకు కూడా నా పేరు వల్ల పడ్డ ఇబ్బందులు రాయాలనిపించింది.మరీ చారి గారు పడినన్ని ఇబ్బందులు కాకపోయినా ,కొద్దో గొప్పో కష్టాలు పడ్డాను.
నాకు అనూరాధ అని పేరు పెట్టినప్పుడు ,మా అమ్మ వాళ్ళ వదిన ,అనూరాధ ఏంటి?మనోబాధ లాగా!అయినా నక్షత్రాల పేరు పెట్టుకుంటారా ఎవరైనా ? పేరు బాగోలేదు ,వేరే పేరు పెట్టమన్నారు అంట.కానీ మా అమ్మ కు ఆ పేరు బాగా నచ్చినందువల్ల,మరియు ఆ టైం లో అనూరాధ అనే పేరు హవా నడుస్తుండటం తో ఆ పేరే ఉంచేశారు.
నా పేరు తో మొట్టమొదటిసారి గా ఇబ్బంది ఎదురైంది.. నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదివేటప్పుడు.మా స్కూల్ లో ,స్కూల్ వదలటానికి గంట ముందు అన్ని క్లాస్ ల వాళ్ళని (1to5th )స్కూల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అందరి తో ఒకటి నుంచి ఇరవయ్ వరకు ఎక్కాలు,తెలుగు సంవత్సరాల పేర్లు,నెలల పేర్లు,నక్షత్రాల పేర్లు చెప్పించే వారు.అదేంటో తెలియదు కానీ ప్రతి రోజూ నక్షత్రాల పేర్లు చెప్పేటప్పుడే నా టర్న్ వచ్చేది.అదికూడా హస్త లేదా చిత్త నక్షత్రం దగ్గర నా ముందు వాళ్ళు ఆపితే అక్కడ నుంచి నేను కంటిన్యు చేయాల్సి వచ్చేది.విశాఖ వరకు బాగానే చెప్పేదాన్ని.ఆ తరవాతే నోరు పెగిలేది కాదు నా పేరు చెప్పటానికి.ఎప్పుడు చెపుతాన అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు చూసి ,పేరు చెప్పంగానే అందరూ పక్కున నవ్వే వాళ్ళు.ఇలా ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నన్ని రోజులు బాధ పడ్డాను.నేను నా పేరు పలకటానికి ఎందుకు మొహమాట పడ్డానో,వాళ్ళు ఎందుకు నవ్వేవాళ్ళో ,ఇప్పటికి నాకు అర్ధం కాదు. 

ఇక నేను 7th చదివేటప్పుడు ..మా క్లాస్ లో అనూరాధ పేరు తో ఎనిమిది మందిమి ఉండేవాళ్ళము.attendence పిలిచేటప్పుడు ఇంటి పేరు తో సహా పిలిచేవారు కాబట్టి ఇబ్బందేమీ ఉండేది కాదు.క్లాస్ లో అక్షింతలు వేసేప్పుడే .ఎవరిని తిడుతున్నారో తెలిసేది కాదు.మనల్ని కాదులే అని ఇకిలించుకుంటా కూర్చుంటే ,తిడుతున్నా సిగ్గు లేదా ?ఇకిలిస్తున్నావు అని extra అక్షింతలు.మనల్నే తిడుతున్నారేమో అని లోకంలోని విషా దాన్నంతా మన ఫేస్  లోనే కనబరిస్తే ,నిన్ను కాదు గా తిట్టేది నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అక్షింతలు.

8th క్లాస్ కు స్కూల్ మారాను.హైదరాబాద్ లో h .f .h .s లో జాయిన్ అయ్యాను.మొదటి రోజు క్లాస్ లో ,మా టీచర్.. అందరి పేర్లు పిలిచి రోల్ నంబర్స్ చెప్పింది.క్లాస్ అయిపోయి టీచర్ క్లాస్ నుంచి వెళ్ళటం ఆలస్యం ,నామీద ప్రశ్నల వర్షం కురిపించారు.
అల్లూరు సీతా రామ రాజు మీకు ఏమవుతారు?
అల్లూరు సీతా రామ రాజు  ది మీది ఒకే ఊరా?
అల్లూరు సీతా రామ రాజు అసలు ఫొటోస్ చూసావా?బుక్ లో ఉన్నట్లే ఉంటారా?
నాకేమీ అవరు .అయినా ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నారు?అన్నాను.
మీ ఇంటి పేరు కూడా అల్లూరు కదా,అందుకని మీ relative ఏమో అని అడుగుతున్నాము అని అన్నారు.మా ఇంటి పేరు అల్లూరు కాదు వల్లూరు అని చెప్పాను.అయినా వదలకుండా నువ్వు అబద్దం చెపుతున్నావు ,టీచర్ నీ పేరు పిలిచినప్పుడు విన్నాము అని కొంచం సేపు వాదించి వదిలేసారు.ఎందుకయినా మంచిది అని ,రిజిస్టర్ లో నా పేరు
 వి .అనూరాధ గా మార్పించేసుకున్నాను.
ఆ తరువాత graduation అయిపోయేంతవరకు ఏ సమస్య లేదు.నేను స్కూల్ లో వర్క్ చేసేటప్పుడు  మళ్లీ...గవర్నమెంట్ స్కూల్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యి మళ్లీ మా స్కూల్ లో తెలుగు టీచర్ గా జాయిన్ అయ్యారు.అందరిని పరిచయం చేసుకుంటున్నారు.నేను నా పేరు అనూరాధ అని చెప్పాను.అనూ... ఏమనాలి?రాధా...నీకు ఏమి రాదా ?అయితే పిల్లలకు పాఠాలు ఎలా చెపుతున్నావు అమ్మాయ్? అని ఏమనకోకు అమ్మాయ్ ,నీ కంటే పెద్దవాడిని ,సరదాగా అన్నాను.సీరియస్ గా తీసుకోకు అన్నారు.ఇంతటితో నా పేరు తో తంటాలు సమాప్తం.


Monday, 7 June 2010

అసూయ-ఆడవాళ్లు

అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తరవాత పుట్టారు అని అంటూ ఉంటారు కదా!అలా ఎందుకంటారు అని ఆలోచించగా ,చించగా నాకు ఈ సమాధానం తట్టింది.
అసూయ.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని మొదటి అక్షరం తో మొదలయ్యింది.
ఆడవాళ్లు.....మొదటి  అక్షరం తెలుగు అక్షరమాల లోని రెండో అక్షరం తో మొదలయ్యింది.అందుకనే అలా అంటున్నారు అని నేను అనుకుంటున్నాను.మరి అది కరక్టే నంటారా?

Sunday, 6 June 2010

మెతుకు పట్టుకు చూస్తే చాలా?

అన్నం ఉడికింది ,లేనిది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలని అందరూ చెప్తుంటే నేనూ చాలనే అనుకున్నాను.నేను వంట మొదలు పెట్టిన తరువాతే ఆ statement  తప్పని తెలిసింది.నలపాయ పడితే పైన ఉడికినా మధ్యలో బియ్యం ఉడకకుండా  గింజలు గానే ఉంటుంది.(ఇప్పుడు కుక్కర్లు వచ్చినవి కనుక ఆ అవసరం లేదనుకోండి).ఈ ఒక్క విషయమనే కాదు,మనం నిత్యం చాలానే విషయాలలో తొందరపడి తప్పుడు statements ఇస్తూ ఉంటాము.మనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యీ అవగానే అతని కులాన్ని  బట్టో,లేకపోతే అతను ఏ ప్రాంతం వాడో ,ఆ ప్రాంతాన్ని బట్టి అతని గుణగణాల్ని అంచనా వేస్తూ ఉంటాము. అలాగే ప్రతీ విషయాన్నీ జనరలైజ్ చేస్తూ ఉంటాము....ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు ,మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు.
ఫలానా జిల్లా వాళ్ళందరూ మోసగాళ్ళు.ఫలానా కులం వాళ్ళందరూ 
పొగరుబోతులు. మాత్రుమూర్తులందరూ గొప్ప త్యాగమూర్తులు.(మరి రోడ్ల మీద,తుప్పల్లో,చెత్తకుండీల్లో రోజుల పసికందులు ఎందుకు దొరుకుతున్నారో తెలియదు)etc .,etc .,ఒక వ్యక్తి  గొప్ప గా ప్రవర్తించినా ,నీచంగా ప్రవర్తించినా ,అది ఆ వ్యక్తి కే పరిమితం చేయకుండా మొత్తం జాతి కి ఆపాదిస్తాం.

మనం దేనినయినా జడ్జ్ చేసేటప్పుడు ఏదో ఒక విషయమే పరిగణన లోకి తీసుకొని చేయకూడదని తెలిపే ఈ కథ చదవండి.
ఒక ఊరిలో ఒక వ్యక్తి కి నలుగురు కొడుకులు ఉన్నారు.తండ్రి, వాళ్ళకి ఏ విషయం లో కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు.నలుగురు కొడుకుల్ని ఎక్కడో దూరాన ఉన్న 'pear ' చెట్టు ను చూసి వచ్చి ఎలా ఉందో చెప్పమన్నాడు.ఒకరు వెళ్లి వచ్చినాక ఇంకొకరు అలా నలుగురు వెళ్లి చూసివచ్చారు.పెద్ద కొడుకు....చెట్టు అంతాఎండిపోయినట్టు ఉంది.ఒక్క ఆకు కూడా లేదు,ఆ చెట్టు చచ్చి పోవచ్చు అని చెప్పాడు.
రెండో కొడుకు.....చెట్టు చాలా పచ్చగా ఉంది.కొత్త చివుళ్ళ తో అని చెప్పాడు.
మూడో కొడుకు ...పూలు విరగబూసి ,చెట్టు ఎంతో అందం గా ఉంది అని చెప్పాడు.నాలుగో కొడుకు....కాయలు,పళ్ళతో నిండి ఉంది అని చెప్పాడు.అప్పుడు తండ్రి మీ నలుగురు చెప్పింది కరక్టే,కానీ నలుగురు  నాలుగు 'seasons ' లో వెళ్లి చూడటం వల్ల మీ నలుగురి అభిప్రాయాలు నాలుగు రకాలు గా ఉన్నాయి.కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఒక్క విషయం మీద బేస్ అయ్యి తీసుకోకూడదు అని చెప్పాడు.

we cannot judge a person or tree by only one season ,and that the  essence of who they are,and the pleasure,joy and love that come from that life can only be measured at the end,when all the seasons are up. if you give up when it is winter ,you will miss the promise of your spring,the beauty of your summer,fulfillment of your fall.So don't let the pain of one season destroy the joy of all the rest.Don't judge life by one difficult season.