Saturday, 27 August 2011

మనకు నచ్చినట్లు ఉండటం సాధ్యమేనా?

 జిందగీ నా మిలేగి దుబారా.అవును నిజమే !జీవితం అన్నది ఒక్కసారే లభిస్తుంది.రెండోసారి దొరకదు.(అఫ్ కోర్స్ పునర్జన్మలు అనేవి ఉంటే మళ్ళీ మళ్ళీ దొరుకుతుందను కొండి.)సరే!జీవితం ఒక్కసారే లభిస్తుంది కాబట్టి ...జీవితాన్ని ఆస్వాదించాలి,అంటే అన్నీ మన మనసుకు నచ్చినవి,ఆనందాన్నిచ్చేవి మాత్రమే చేయాలి.అది ఎవరికైనా సాధ్యమా?చిన్న వయసులో ...జీవితానుభవం తక్కువ కాబట్టి నేను ఏమైనా చేయగలను,మీలాగా కాదు ..నాకు నచ్చిందే నేను  చేస్తాను ...ప్రతి ఒక్కరు ...ఇలా అని అనుకోవటం సహజం.జీవితంలోముందుకు వెళుతున్నకొద్దీ మనకు అర్ధమవుతుంది ...అవన్నీ భ్రమలే అని.

 నేను డిగ్రీ చదివేటప్పుడు మా లైబ్రేరియన్ మేడం ....ఎందుకమ్మా ఈ కోర్సు లో జాయిన్ అయ్యారు.
 ఒకవేళ జాబ్ వచ్చినా పెళ్ళయితే మానేయ్యాల్సిందే.రెగ్యులర్ B .sc కోర్స్ చెయ్యక అన్నారు.ఆవిడ
M .Swచదివారు.డెవలప్మెంట్ ఆఫీసర్ గా గవర్నమెంట్ జాబ్ చేసేవారు కాస్తా మ్యారేజ్ అవటం తో ఆ జాబ్ మానేసి లైబ్రరి సైన్స్ లో బాచిలర్స్ డిగ్రీ తీసుకుని మా కాలేజ్ లో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు.కారణం...డెవలప్మెంట్ ఆఫీసర్ గా ట్రావెల్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది,కాబట్టి అత్తగారింట్లో ఆ జాబ్ చేయటానికి ఒప్పుకోలేదు.అదే లైబ్రేరియన్ అయితే ఎక్కడకు కదలనవసరం లేదు.ఫిక్స్డ్ టైమింగ్స్ అని ....  

   నేను ,నా ఫ్రెండ్స్ గొప్పగా ....మీరు కాబట్టి మానేశారు మేడం ,మేము మీ ప్లేస్ లో ఉంటే మానే వాళ్ళం కాదు.నాకు ఈ జాబ్ అంటే ఇష్టం ,ఈ జాబే చేస్తాను అని చెప్పేదాన్ని అని అన్నాము.దానికి ఆవిడ ఇప్పుడు ఇలాగే మాట్లాడుతారు లేమ్మా ,నేను కూడా అలాగే అనేదాన్ని.ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది ,ఏమి చేస్తారో అని అన్నారు.అప్పుడు అలా వాదించాము కానీ ,తీరా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆవిడ బాటే పట్టాము.అంటే లైబ్రేరియన్స్ అయ్యామని కాదు.ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్న జాబ్ లకే పరిమితం అయ్యామని.

 జనాలలో పాతుకు పోయిన కొన్నిఅభిప్రాయాల వల్ల మనకు ఒక పాట నచ్చితే ఆ పాట నచ్చిందని చెప్పటానికి కూడా జంకాల్సి వస్తుంది,కొన్ని పరిస్థితులలో .ఏదో మాటల లో గులాబి సినిమా లోని 'మేఘాల లో తేలి పొమ్మన్నది'అనే పాట అంటే ఇష్టం అని అన్నాను.నా కొలీగ్ 'ఏమిటి మేడం,మీకు ఆ పాటంటే ఇష్టమా?'అని బోలెడు హా శ్చర్యాన్ని ప్రకటించేసింది.వినకూడని దేదో విన్నట్లు ముఖకవళికలు....దాంట్లో అంత వింత పడాల్సింది ఏముందో నాకు అర్ధం కాలేదు.ఏ నేను మనిషిని కాదా ,అంత ఆశ్చర్య పోతున్నావు అని అన్నాను.దానికి ఆవిడ అలా అని  కాదు మేడం,మీకు మ్యారేజ్ అయ్యింది కదా ,అలాంటి పాటలు ఇష్టం ఉండవు అనుకున్నాను...అని నసిగింది.ఒకటి ఇష్టపడటానికి,మ్యారేజ్ అవటానికి సంబంధం ఏమిటో ఇప్పటికి నాకు అర్ధం కాదు.

        నాకు ఫలానాది ఇష్టం అని చెప్పుకోవటానికే ఇబ్బంది పడే మనం, మనకు నచ్చినది చేయగలిగే ధైర్యం ఉంటుందా?మనకు ఇష్టం ఉన్నా ,లేకపోయినా సమాజం ఆమోదించిన మార్గం లోనే వెళ్ళటానికి మొగ్గు చూపుతాము.సమాజాన్ని ఎదిరించే ధైర్యం ఎంత మందికి ఉంటుంది?అలా కాదని సమాజాన్ని ఎదిరించి తమకు నచ్చినట్లు ఎంతమంది ఉండగలుగుతారు?ఉంటే, వాళ్ళు ..చుట్టూ ఉన్నవాళ్ళ కామెంట్స్ ని పట్టించు కోకుండాఆనందం గా ఉండగలుగుతారా?డౌటే !

Tuesday, 23 August 2011

నీటిని శుద్ధి చేయడానికి అరటి తొక్కలు


బ్రెజీలియన్ పరిశోధకులు - 'గుస్తావో  కాస్ట్రో '... భార లోహాలతో కలుషితమైన   నీటిని శుద్ధి చేయటానికి అరటి తొక్కలు ఉపయోగ పడతాయని కనుగొన్నారు.  గుస్తావో  కాస్ట్రో -తన పరిశోధనలో... అరటి తొక్కలు లో నైట్రోజెన్,సల్ఫర్,కార్బోక్సిలిక్  యాసిడ్ లు ఉన్నాయని కనుగొన్నారు.కార్బోక్సిలిక్  యాసిడ్ లు పాజిటివ్ గా చార్జ్ అయిన లోహాలను నిర్భందిస్తాయి కనుక అరటి  తొక్కలను భార లోహాలతో కలుషితమైన   నీటిని శుద్ధి చేయటానికి ఉపయోగించవచ్చని అనుకున్నారు.
 అరటి తొక్కలను ముక్కలు చేసి,ఎండపెట్టి రాగి,సీసం తో కలుషితమైన బ్రెజిల్లోని Paraná నదిలో కలిపారు.సిలికా,కార్బన్ లాంటి filtering materials   కంటే కూడా బాగా పనిచేశాయి.అంతే కాకుండా వాటికంటే చీప్.

 అరటి తొక్కలు భార లోహాలతో కలుషితమైన   నీటిని శుద్ధి చేయటానికి మాత్రమే, నీటి లోని బాక్టీరియా ని నాశనం చేయలేవు.

The findings were published earlier this year in the journal Industrial & Engineering Chemistry Research, a publication of the American Chemical Society.

Wednesday, 10 August 2011

బ్లడ్ ప్రెషర్ తగ్గించే ఆహార పదార్ధాలు


బి.పి  అంటే తెలియని వారు ఉండరు కనుక బి.పి అంటే ఏమిటో చెప్పనక్కర లేదనుకుంట!
 బి.పి రావటానికి కల కారణాలు..... స్ట్రెస్,ఊబకాయం,ఆహారం లో ఉప్పు ఎక్కువ తీసుకోవటం,మధుమేహం.....
బి.పి ఎక్కువ ఉండటం వల్ల గుండె పోటు,ఇతర గుండె జబ్బులు,కిడ్నీ కి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
బి.పి ని తగ్గించే ఆహార పదార్దాలు :
పాలకూర : పాలకూరలో మెగ్నిషియం,ఫోలేట్ ,ఐరన్,విటమిన్ సి
ఉంటాయి.ఇవి వంటికి ఎంతో ఆరోగ్యకరం.కాబట్టి మీకు పాలకూర అంటే ఇష్టం
లేకపోయినా తినటం అలవాటు చేసుకోండి.అరటి పండు:అరటి పండు లో బి.పి ని తగ్గించే పొటాషియం ఎక్కువగా  ఉంటుంది.రోజూ 

ఒక అరటి పండు తింటే బి.పి ని దూరం గా ఉంచవచ్చు.
కివి:పొటాషియం,విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
 lutein, అనే యాంటి 

ఆక్సిడెంట్ ఎక్కువ గా ఉండటం వల్ల బి.పి. ని సమర్దవంతం గా తగ్గిస్తుంది. 


పాలు : దీని లో  ఉన్న కాల్షియం,విటమిన్ డి ...రెండూ కూడా బి.పి. ని తగ్గించటానికి  
  ఉపయోగపడతాయి.
Blood pressure can be affected modestly by supplements of milk and soy protein, a new, small study found.
The reduction is not large in an individual, but significant at the population level," study leader Dr. Jiang He, chairman of epidemiology at the Tulane University School of Public Health and    Tropical Medicine in New Orleans, told HealthDay News


వెల్లుల్లి:రక్తం గడ్డ కట్టకుండా ,రక్త నాళాలు దళసరిగా అవకుండా నిరోధిస్తుంది.బి.పి.వల్ల కలిగే చెడు ఫలితాలను తగ్గిస్తుంది.


బీన్స్:


బీన్స్ లో మెగ్నీషియం ,పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల, బి.పి ని తగ్గిస్తుంది. Celery: Celeryలో ఉన్న phthalide ,రక్త ప్రసరణ సరిగా జరిగే లా చేస్తుంది. స్ట్రెస్ ని  తగ్గించటానికి కూడా ఉపయోగ పడుతుంది.
రామ ములక్కాయలు:వీటిలో ఉన్నఆంటి యాక్సిడెంట్ lycopene బి.పి. ని తగ్గించటం లో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా టొమాటో లోని కాల్షియం,పొటాషియం,విటమిన్ ఎ,సి మరియు ఇ కూడా బి.పి.ని నివారించటం లో తోడ్పడుతాయి.

Broccoli: దీనిలో పొటాషియం ఎక్కువ గా ఉండటం వల్ల బి.పి.ని తగ్గిస్తుంది.క్రోమియం... కార్డియో  వాస్కులర్ జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.బ్లడ్ షుగర్,ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది 
పొద్దు తిరుగుడు పూల విత్తనాలు, ఆలివ్ నూనె,అవకాడో లు,బొప్పాయి, డార్క్  చాక్ లెట్స్ ,పళ్ళు,కూరగాయల రసాలు బ్లడ్ ప్రెషర్ ని తగ్గించటం లో తోడ్పడతాయి. కాల్షియం,పొటాషియం ఎక్కువ ఉన్న పళ్ళు,కూరగాయలు తినటం మంచిది.ఉప్పు వాడటం వీలైనంత తగ్గించండి. వేపుడు పదార్ధాలు తినటం తగ్గించండి.