Thursday, 2 November 2017

చూడ చక్కని శిల్పంఈ పిక్ , నా స్నేహితురాలు పంపించారు. పిక్ తో పాటు ఒక ఆడియో కూడా పంపించారు.ఆడియో   లో పిక్ గురించిన వ్యాఖ్యానం ఉంది.కానీ దానిని బ్లాగ్ లో ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియలేదు.ఈ శిల్పం ఏక రాతి శిల్పమని ,దశావతారాలు ఈ శిల్పం లో చెక్కబబడ్డాయని ... కొన్ని అవతారాలకి రూపం ఉంది,కొన్నిటికి వారి ఆయుధాలు.  బలరాముడు దశావతారాలలో ఒకరా ?ఎప్పుడూ వినలేదు.శిల్పం కుడి వైపు ఒక చేతిలో నాగలి ఉంది, అది బలరాముని   ఆయుధం. వెంకటేశ్వర సుప్రభాతం లో వచ్ఛే ఒక శ్లోకం ఆధారం తో ఈ శిల్పం రూపొందింది అని చెప్పారు. 

ఆ శ్లోకం 

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశ రామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం     


Friday, 27 October 2017

రాజా దినకర్ కేల్కర్ మ్యూజియం

పూనే వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఈ మ్యూజియం ఒకటి.దినకర్ కేల్కర్ అనే అతను ,తన కుమారుని జ్ఞాపకార్ధం కొన్ని వేల వస్తువులు సేకరించి ఈ మ్యూజియం ను ఏర్పరిచారు.మేము వెళ్ళినప్పుడు సందర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒకరిద్దరు , ప్రవేశ రుసుము 100 రూపాయలు అనేటప్పటికి తిరిగి వెళ్లిపోయారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం చూడటానికి సుమారు 3 గంటలు పడుతుంది.17,18 శతాబ్దం నాటి దర్వాజాలు,కిటికీలు,వంట సామగ్రి,దువ్వెనలు, దీపాలు,సంగీత పరికరాలు,ఆయుధాలు, ... ఇలా చెప్పుకుంటూ పోతే ,చాంతాడంత లిస్ట్ అవుతుంది.మస్తానీ మహల్ నమూనా కూడా ఉంది. అన్నిటినీ ఫోటోలు తీయటం అసాధ్యం కాబట్టి ,ఏవో కొన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నానుENTRANCE
గడియ 

Lamp stand 

Hanging Lamps (Nepal)


Chapati impressions (Gujarat)


Mastani mahal

Sunday, 15 October 2017

హవా మహల్


ప్రతాప్ సింగ్ అనే రాజు 1799లో రాచకుటుంబానికి చెందిన స్త్రీలు బయటవారికి కనిపించకుండా,పండుగ/పర్వ దినాలలో ,వీధి వేడుకలు చూడటానికి వీలుగా ఈ హవామహల్ కట్టించాడు.అయిదు అంతస్తుల మహల్ కి 953 కిటికీలు ఉన్నాయంట.అంట అని ఎందుకన్నాను అంటే , నేను లెక్క పెట్టలేదు కనుక :)మనం సాధారణం గా చూసే మహల్ పిక్చర్ ,మహల్ వెనక భాగం.మహల్ ప్రవేశానికి 50 రూపాయలు రుసుము.మహల్  లోపలి  పిక్చర్స్ కొన్ని , మీకోసం . 
కొన్ని పురాతన శిల్పాలు 


Thursday, 13 July 2017

కర్ణాటక కోవెల యాత్ర - ముగింపు

యాత్ర అంతా సవ్యం గానే జరిగినా చిన్న అసంతృప్తి.ఎక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు తక్కువ సమయం,తక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు ఎక్కువ సమయం... బేలూర్,తిరుగు ప్రయాణం రోజు చూడాల్సిరావటం,చాలా తక్కువ సమయం ఇవ్వటం వల్ల-హడావిడిగా పరుగులుపెట్టి...సరిగా చూడలేకపోయాము.హొయసల రాజు విష్ణువర్ధనుడు  కట్టించిన చెన్నకేశవ /విజయనారాయణ ఆలయం శిల్పకళ అద్భుతం.   

ఈ రాజ గోపురం తర్వాతి కాలం లో విజయనగర రాజులు కట్టించారట 

గరుడ ధ్వజ స్థంభం 
Wednesday, 5 July 2017

శనివార్ వాడా

ఒకప్పటి పేష్వాల నివాసం. ఇప్పుడు శిధిలమై పునాదులు మాత్రమే మిగిలాయి.చరిత్ర అంటే ఇష్టపడే వాళ్ళు ,ఒకసారి సందర్శించొచ్చు.ప్రతి ఒక్క చోట బోర్డులు ఉండటం వల్ల ఒకప్పుడు అక్కడ సభ జరిగేది,ఫలానా వారు నివాసం ఉన్నారు.ఇక్కడ కూర్చొని నృత్య ప్రదర్శనలు చూసేవారు అని ఊహించుకోవాల్సిందే. 1730 లో ఒక శనివారం రోజు పేష్వా బాజీరావు 1 ఈ వాడా కి శంఖుస్థాపన చేశారు.1732 లో పూర్తయ్యింది.శనివారం రోజున మొదలు పెట్టటం వల్ల ,దీనికి శనివార్ వాడా అని పేరు.ఈ కోటలో సుమారు వెయ్యి మంది నివసించేవారట.1828 లో జరిగిన అగ్నిప్రమాదం తో కోట మొత్తం ధ్వంసం అయ్యింది.

           
ప్రవేశ ద్వారం 


       ఒకప్పటి చరిత్ర కి ఆనవాళ్లు ఫౌంటెన్
మంత్రుల సమావేశం జరిగే ప్రదేశం


దీనికి ఎదురుగా రంగమహల్ ఉండేదట. ఇక్కడ కూర్చొని నృత్యం చూసేవారట 
Sunday, 2 July 2017

కాపీ

ఈగ ,లేదా ఇంకోటేదో సినిమా చూడగానే ఇది ఫలానా సినిమా కి కాపీ ,కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు ,కాపీ కాదు స్ఫూర్తి పొందారు,వగైరా ... ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాము  😊. అయితే మన తెలుగు సినిమాల నుంచి కూడా స్ఫూర్తి పొందేవారు లేదా కాపీ కొట్టేవారు ఉన్నారు. లేదా వారికే స్వయం గా అలాంటి కథ తట్టి ఉండొచ్చు.చెప్పలేం.ఇవాళ " The parent trap" అనే సినిమా చూసాను.ఏవో కొద్దీ మార్పులతో అచ్ఛం లేత మనసులు అనే సినిమా లానే ఉంది.కాకపొతే తెలుగు సినిమా నేను పుట్టకముందు వచ్చినది.ఇంగ్లిష్ సినిమా 1998లో తీసినది/విడుదల.రెండు సినిమాల లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

The parent trapLetha Manasulu

Monday, 19 June 2017

ముక్తేశ్వర్ ధామ్

ద్వాపర యుగం లో,పాండవుల వనవాసపు 12 వ సంవత్సరం లో తలదాచుకున్న గుహలు - ఈ ముక్తేశ్వర్ ధామ్.ఇక్కడ పాండవులు సుమారు ఒక ఆరు మాసాలు ఉన్నారని నమ్మకం . దీని గురించి ప్రస్తావన స్కంధ పురాణంలో ఉందంట.పెద్ద కొండ, పక్కనే రావి నది ప్రవహిస్తూ చూడటానికి ఎంతో ఆహ్లాదం గా ఉంది.పాండవులు నివాసం ఉండటానికి ఈ కొండలో 5 గుహలు తొలిచారంట.ప్రస్తుతం మూడు గుహలు మాత్రమే చూడటానికి వీలుగా ఉన్నాయి.

          
గుహల వద్దకు వెళ్ళటానికి మెట్ల దారి 


రావి నది 
గుహ అంతర్భాగం 

మూడవ గుహ లోని పైకప్పు ,ఇక్కడ పాండవులు మెడిటేషన్ చేసే వారు అని అక్కడ పూజారి చెప్పారు 
మెట్ల పక్కనే ఉన్న కొండ , నాకు శివుని రూపం కనిపించింది. మీకూ కనిపిస్తుందేమో చూడండి :)


మూడవ గుహ కి దారి