Showing posts with label సరదా. Show all posts
Showing posts with label సరదా. Show all posts

Saturday, 14 September 2013

పేరు ప్రఖ్యాతులు



What we have done for ourselves alone dies with us; what we have done for others and the world remains and is immortal.

ఇప్పటివరకూ ఏది చేసినా నాకు మాత్రమే చేసుకున్నా.ఇకనుంచి లోకానికి కూడా ఏమన్నా చేయాలని నిర్ణయించుకున్నాను.అలా చేస్తే కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతులు వస్తే నా పేరు చిరస్మరణీయం అవుతుందని ఒక దురాశ /పేరాశ. అలా పేరు సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ,
 సైంటిస్ట్ నయినా కాకపోతి కొత్త ఆవిష్కరణలు చేయగా అని రాయినయినా కాకపోతి ట్యూన్ లో పాడుకుంటూ ఉంటే ,ఒక అద్భుతమయిన ఆలోచన తట్టింది.
వంటిల్లే పెద్ద ప్రయోగశాల అని (ఆల్రెడీ ఎవరన్నా అన్నారా?) కొత్త కొత్త వంటలు కనిపెట్టి లోకానికి సేవ చేయోచ్చు కదా అని.
ఆలోచన వచ్చిందే తడవు ,కొత్తగా  -  ఆరోగ్యానికి మంచి చేసే వంటలు ఏమి చెయ్యొచ్చా అనుకుంటుంటే వంటింట్లో ఎదురుగా కాకరకాయలు కనిపించాయి.చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు,తినరు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా ! కావున నా ప్రయోగం దీనితో మొదలు చేస్తే బాగుంటుంది అనుకున్నాను.కూర టైప్ లో వండితే కాకరకాయ అని తెలిసిపోతుంది కాబట్టి ఏదన్నా స్నాక్ లాంటిది ట్రై చేస్తే బెటర్ అని కాకరకాయ కారప్పూస ,స్వీట్ - కాకరకాయ హల్వా చేసి చక్కగా అలంకరించి ఫోటో లు తీసి, చేసే విధానం రాసి పత్రిక కు పంపించాను.వాళ్ళ పత్రికలో అది ప్రచురించలేక పోతున్నందుకు చింతిస్తూన్నాము అనే నోట్ తో భద్రం గా  వెనక్కి వచ్చెయ్యటం కూడా జరిగింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడు లా బంగాళా దుంప బాసుంది,బీరకాయ బిర్యాని, కాబేజీ కజ్జికాయ ,చేమదుంప చేకోడి , పపాయా పాపకార్న్ లాంటి వినూత్న వంటకాలు కనిపెట్టి వాటిని పత్రికలకు పంపించటం ,అవి రాకెట్ వేగం తో తిరిగి రావటం కామన్ అయిపోయింది.ఇక ఇలా లాభం లేదని ,నేనే స్వయం గా బుక్ పబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయం లో ,అంతర్జాలం లో విహరిస్తుంటే - మీ బుక్ ని మీరే పబ్లిష్ చేసుకోండి అనే ప్రకటన కనిపించి,సంతోషాన్ని కలిగించింది. కొద్దిగా ఆలస్యం గా నయినా ఇలా పేరు తెచ్చుకుంటు న్నందుకు ఆనందం గా ఉంది   :))



Thursday, 13 October 2011

Just for Laugh


సాలిడ్ టీ కూడా ఉంటుందా?



Contact చేయటానికి నంబర్ లేదు

  
కన్నడం లో మాట్లాడితే 1% discount extra అంట.ఆంధ్రా లో కూడా ఇలాంటి స్కీం పెడితే బాగుంటుంది కదూ!





 Holiday కి వచ్చిన తిప్పలు


 Golden opportunity for Smokers


Tuesday, 23 November 2010

అబ్బాయిలూ,అంకుళ్ళూ,మీ హక్కు ను మీరు తిరిగి సాధించుకోండి

ఇది కేవలం సరదా కోసం రాసింది.అఫెండ్ అయ్యే మేటర్ ఏమీ లేదు కానీ ,ముందు జాగ్రత్తగా తెలియచేస్తున్నాను.

మా ఫ్రెండ్ విజయ..రేపు నేను సెలవు తీసుకుంటున్నాను అంటే ఎందుకు అని అడిగా.వాళ్ళ అమ్మగారు అర్జంట్ గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందని,
రేపువంట తనే చెయ్యాలి కాబట్టి సెలవుతీసుకుంటున్నా అంది.ఏమన్నా డవుట్స్ వస్తే ఫోన్ చేస్తానని చెప్పింది.నాకు వంట అంతంత మాత్రమే వచ్చు.సరే నాకు తెలిస్తే చెపుతాలే అన్నాను నేను.నెక్స్ట్ డే 11  గంటలకు విజయ ఫోన్ .మామిడికాయ పప్పు వండుతున్నాను.అందులో ఉప్పు వేస్తారా?అని.ఒక్కసారే విరగబడి నవ్వటం మొదలు.మా రిసెప్షనిస్ట్ నన్ను వింతగా చూడటం గమనించి ,బలవంతాన నవ్వు ఆపుకుని,వేయాలి అని చెప్పాను.మామిడి కాయ పుల్లగా ఉంటుంది కదా ,ఉప్పు వేస్తారా?మళ్లీ అడిగింది.ఏ కూర లో అయినా ఉప్పు కారం వేస్తారు.మామిడికాయ పుల్లగా ఉంటే పులుపు కోసం చింతపండు వెయ్యరు కానీ ఉప్పు వెయ్యాలి అని చెప్పాను.సరే నేను ఇలా అడిగానని ఎవరికీ చెప్పకే ప్లీజ్ అంది తను.ఎవరికి చెప్పనని హామీ ఇచ్చాక కానీ ఫోన్ పెట్టేయలేదు.మరుసటి రోజు ఇన్స్టిట్యూట్ లో తనని చూసాక ,అమ్మయ్య ,బాగానే ఉన్నావా?నీ వంట తిన్నాకా మీరందరూ ఎలా ఉన్నారో అని భయపడ్డాను అన్నాను.ఈ వంట ఆడవాళ్లే చెయ్యాలని రూల్ ఎవరు పెట్టారో అంది తను.ఇంక ఎవరూ?మన ఆడవాళ్లే,సమానత్వం పేరు తో వంట చేసే హక్కును మగవాళ్లనుంచి లాక్కున్నాం,పాపం మగవాళ్ళు ... వాళ్ళ హక్కును కోల్పోయినందుకు ఎంత బాధపడుతున్నారో ,ఏమిటో!అన్నాను.ఏమిటి,వంట చెయ్యటం మగవాళ్ళ హక్కా?అంది విజయ.అవును.నలభీమపాకం అనే మాట విన్నాం కానీ,దమయంతి హిడింబి పాకం అనే మాట ఎప్పుడైనా విన్నామా?పురాణాల కాలం నుంచి కూడా మగవాళ్ళే వంట చేసేవారు.మనవాళ్ళు ఎప్పుడు ఆ హక్కును మగవారి నుంచి లాక్కున్నారో కానీ ,వంట చేసే తిప్పలు మనకు వచ్చాయి అన్నాను నేను.మగవారు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు మొదలు పెట్టారు గా,మొట్ట మొదటగా వంట చేసే హక్కును సాధించుకుంటే బాగుంటుంది కదా అంది తను.అవును అని వంతపాడాను.అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజయినా,అలాంటి ఉద్యమం ఏమయినా చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసాము.మా ఆశ అడియాస అయ్యింది.
"ఆశా నిరాశేనా?జీవితానా వంట చెయ్యటం తప్పదా "
అని పాడుకుంటున్న మాకు ,రెండు రోజుల క్రితం బ్లాగ్ వాతావరణం చూసాకా మిణుకు,మిణుకు మంటున్న మా ఆశ,1000 వాట్ల బలుబు లాగా వెలిగింది. అబ్బాయిలూ,అంకుళ్ళూ,పోటీ పడి చేసిన వంటలు చూసాకా ,పాపం వాళ్ళు ఇన్ని రోజులూ ,వాళ్ళ హక్కును కోల్పోయి ఎంత బాధపడి ఉంటారో కదా అనిపించింది.అందుకనే అబ్బాయిలూ,అంకుళ్ళూ,మీ హక్కు కోసం ఇప్పటికైనా ఉద్యమించండి.వంట చేసే హక్కును సాధించుకోండి.నాలాంటి,విజయ లాంటి వాళ్ళ సప్పోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.

Monday, 7 June 2010

అసూయ-ఆడవాళ్లు

అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తరవాత పుట్టారు అని అంటూ ఉంటారు కదా!అలా ఎందుకంటారు అని ఆలోచించగా ,చించగా నాకు ఈ సమాధానం తట్టింది.
అసూయ.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని మొదటి అక్షరం తో మొదలయ్యింది.
ఆడవాళ్లు.....మొదటి  అక్షరం తెలుగు అక్షరమాల లోని రెండో అక్షరం తో మొదలయ్యింది.అందుకనే అలా అంటున్నారు అని నేను అనుకుంటున్నాను.మరి అది కరక్టే నంటారా?