Wednesday, 28 April 2010

చాణక్య Quotes

Chanakya....Indian politician, strategist and writer (350 BC-275 BC) చాణక్యుడు చంద్రగుప్తుని కాలం నాటి వాడు.కౌటిల్యుడు అనేది చాణక్యుడి మరో పేరు.ఆయన ప్రవచించిన సుభాషితాలు కొన్ని .

"A person should not be too honest.
Straight trees are cut first
and Honest people are victimised first."


"Even if a snake is not poisonous,
it should pretend to be venomous."

"The biggest guru-mantra is: Never share your secrets with anybody.. ! It will destroy you."


"There is some self-interest behind every friendship.

There is no Friendship without self-interests.
This is a bitter truth."


"Before you start some work, always ask yourself three questions - Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply
and find satisfactory answers to these questions, go ahead."

"As soon as the fear approaches near, attack and destroy it."

"Once you start a working on something, don't be afraid of failure and don't abandon it.


People who work sincerely are the happiest."
"The fragrance of flowers spreadsonly in the direction of the wind.But the goodness of a person spreads in all direction."


పెళ్లి-ఓ రెండు quotes

Getting married is easy
Staying married is difficult

Staying happily married for a lifetime should rank among the fine arts.
                           ---Roberta Flack

Marriage,humanly speaking,is a job.

Happiness or unhappiness has nothing to do with
There never was a marriage yet that could not be made a success,not a  marriage yet that could not have ended in bitterness and failure

Tuesday, 27 April 2010

ఆయాచితం గా పేరు

 కొంత మంది కి ఎంతో కష్ట పడితే కాని పేరు రాదు(ఏ దైనా సాదించినం దుకు,ప్రశంసో,కొండకచోతెగడ్త అయినా కావచ్చు  ).కొంతమందికి ఎక్కువ కష్టపడకుండానే పేరు వస్తుంది.కొంతమందికి అసలు ఏ మాత్రం కష్ట పడకుండానే పేరు లభిస్తుంది.చివరి కేటగిరి వారు మనకు మన ఇంట్లో మరియు ఆఫీస్ లో కూడా తారస పడతారు.మన ఇంట్లో మన అక్కో,తమ్ముడో,అన్నో,చెల్లెలో ,మన దృష్టిలో దుర్మార్గులు అయి ఉండవచ్చు.(ఎందుకంటే,మన వస్తువులు లాగేసుకుంటూ ఉంటారు,వాళ్ళ పనులు మనతో చేయించుకుంటూ ఉంటారు.(రికార్డు రాయించు కోవటం  ,నోట్స్ రాయించు కోవటం,etc..) కానీ,అమ్మ,నాన్నల  దృష్టిలో,మన బంధువుల దృష్టిలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు.(నోట్లో నాలుక లేని వారు,వినయవంతులు,బుద్దిమంతులు ...etc ...etc ..)వాళ్ళు ఎంత బుద్దిమంతులో మనకు మాత్రమే తెలుసు,ఎందుకంటే వాళ్ళ ప్రతాపమంతా మన దగ్గరే కదా చూపించేది.అలాగే ఆఫీస్ లో మనం ఎంతో కష్టపడుతుంటాం ,కానీ ,బాసు దగ్గర మంచి పేరు తెచ్చుకునేది మాత్రం మనం కాదు.అఫ్కోర్స్ మనకు పేరు వస్తుంది,కానీ నెగిటివ్ గా.(అసలు పని మీద శ్రద్ద లేదు,భాద్యతగా ఫీల్ అవటం లేదు etc ...etc ...)సో ...ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే,అసలు ఎవరికైతే పేరు రావాలో వాళ్ళకు రాదు,అర్హత లేకపోయినా కొంతమందికి ఆయాచితం గా పేరు లభిస్తుందని.ఇది మనుషులకే కాదు,ఊళ్లకు కూడా వర్తిస్తుంది.మా అమ్మమ్మ వాళ్ళ వూరు లో నారింజ తోటలు ఉన్నాయి.కానీ పేరు మాత్రం పక్కనే ఉన్న వడ్లపూడి కి నారింజ కు ప్రసిద్ది అనే పేరు వచ్చింది.అలాగే,మా తాతమ్మ గారి వూళ్ళో(లింగాయపాలెం) జామ తోటలు ఎక్కువ ఉన్నాయి.(ప్రస్తుతం కాదు,ఒకప్పుడు)కానీ పేరు మాత్రం రాయపూడి కి వచ్చింది.ఆవూరికి బస్సు సౌకర్యం లేదు.రాయపూడి లో దిగి నడిచి వెళ్ళాలి.బహుశా అందుకనే జామకాయలకు రాయపూడి ప్రసిద్ది చెందిందేమో!మీకూ ఇలాంటివి ఏమైనా తెలుసా?

Thursday, 22 April 2010

మీ హృదయం పదిలమా?


 డా: దేవి శెట్టి ,హార్ట్ స్పెషలిస్ట్ (నారాయణ హృదయాలయ,బెంగళూరు)మరియు విప్రో ఉద్యోగుల మద్య జరిగిన సంభాషణ .అందరికి ఉపయోగకరం గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను.
ప్ర: గుండె ఆరోగ్యం గా ఉండాలంటే ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలి?
జ:
  1. డైట్ :కార్బోహైడ్రేట్ లు ,నూనె ,తక్కువ,ప్రోటీన్లు ఎక్కువ,ఉన్న ఆహారం తీసుకోవాలి.
  2. వ్యాయామం: రోజూ అరగంట సేపు నడక (కనీసం వారానికి అయిదు రోజులు)
  3. స్మోకింగ్ మాని వేయాలి.
  4. వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి.
  5. బి.పి.,షుగర్ లు కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ప్ర: గుండె జబ్బులు వంశ పారంపర్యం గా వస్తాయా?

జ :అవును.

ప్ర: కొంతమందికి , ఎంతో ఆరోగ్యం గా ఉన్నప్పటికీ హార్ట్ ఎటాక్ రావటానికి కారణం?
జ:దానిని సయిలెంట్  ఎటాక్ అని అంటారు. అందుకనే మేము ,ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిని రెగ్యులర్ గా చెక్ అప్ చేయించు కోమని చెప్పుతున్నాము.

ప్ర: వాకింగ్ మంచిదా?జాగింగ్ మంచిదా?

జ :జాగింగ్ కంటే వాకింగ్ చేయటం  మంచిది.జాగింగ్ చేయటం వల్ల తొందర గా అలసి పోతారు.జాయింట్స్ ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది.   

ప్ర:లో బి.పి.ఉన్నవాళ్ళకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందా?
జ :చాలా అరుదు.

ప్ర:కొలస్ట్రాల్ ఏ వయసు నుంచి మన  శరీరం లోaccumulate అవుతుంది?
 జ:చిన్న వయసు నుంచి accumulate  అవుతుంది.


ప్ర:మందులు వాడకుండా కొలస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చా?
జ:డైట్ కంట్రోల్ ,వాకింగ్ చేయటం,ఆక్రూట్ లు తినటం  ద్వారా తగ్గించు కోవచ్చు.

ప్ర:స్ట్రెస్స్  తగ్గించు కోవటం ఎలా?
జ:జీవితం పట్ల మన ద్రుక్పధం మారాలి.ప్రతి ఒక్క దానిలో ఫర్ఫె క్షన్  కోసం చూడకూడదు.
ప్ర:యోగా వల్ల ఉపయోగం ఉందా?
జ:ఉంది.

ప్ర:చేప తినటం గుండెకు మంచిదా?
జ:కాదు.

ప్ర:వేరు శనగ నూనె,పొద్దుతిరుగుడు నూనె,olive ఆయిల్ ,వీటిలో ఏ నూనె వాడితే మంచిది?

జ:ఏ నూనె అయినా ఒకటే.ఏదీ మంచిది కాదు.

ప్ర:ఇటీవల చాలా చిన్న వయసు వాళ్ళకే (30 -40 )హార్ట్ ఎటాక్ వస్తుంది.కారణం ఏమిటి?

జ:జంక్ ఫుడ్ తినటం,వ్యాయామం లేకపోవటం,స్మోకింగ్ మెయిన్ కారణాలు.జెనెటిక్ కారణాల వల్ల భారతీయులు----యురోపియనులు,అమెరికన్లు కంటె మూడు రెట్లు  ఎక్కువగా హార్ట్  

అటాక్ కు గురి అవుతున్నారు.

ప్ర:మేనరికాల వల్ల,వారి  పిల్లలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా?
జ:ఉంటుంది.
ప్ర:గుండె జబ్బులు ఆడవారికంటే మగవాళ్ళకు ఎక్కువ రావటానికి కారణం?
జ:45 ఏళ్ళు వచ్చే వరకు ,ఆడవారి లో గుండె జబ్బులు రాకుండా సహజ రక్షణ వ్యవస్థ ఉంది.

ప్ర:మధుమేహానికి,గుండె జబ్బులుకు సంబంధం ఉందా?
జ:ఉంది .మధుమేహ రోగులకు, గుండె జబ్బులు రావటానికి ఎక్కువ అవకాశం ఉంది.

ప్ర:హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ప్రధమ చికిత్స ఎలా చేయాలి?
జ:హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి ని పడుకోబెట్టాలి.ఆస్ప్రిన్ టాబ్లెట్ ను నాలిక క్రింద ఉంచాలి.అందుబాటు లో ఉంటె sorbitrate టాబ్లెట్ ను నాలిక క్రింద ఉంచాలి.సాధ్యమైనంత తొందరగా పేషంట్ ను కరోనరీ కేర్ యూనిట్ కు తీసుకువెళ్ళాలి.

Saturday, 17 April 2010

ఇవాళ కొన్ని వందల హత్యలు చేశా

హి....హి.......హి......ఏంటి ? 'టైడ్' వాడకుండానే అవాక్కయ్యారా? ఒకటి కాదు,రెండు కాదు ,ఏకంగా వందల హత్యలు చేసానని చెప్పుకుంటున్నావు,నీకెంత దైర్యం ?అదీ ఒక్క రోజు లో!అని కూడా అనుకుంటున్నారా?మనకంత సీను లేదు లెండి.మనుషుల్ని అనుకుంటున్నారా?అబ్బే! కాదు,నేను చంపింది చీమల్ని.మా వంటింట్లో హటాత్తుగా పుట్టల కు పుట్టలు చీమలు .ఎక్కడి నుంచి వచ్చినయ్యో ,తెలి యదు.అన్ని చీమలను చూడగానే ,బెంబేలు పడి బేగాన్ స్ప్రే తో స్ప్రే చేయగానే చచ్చి పడ్డాయి.నాకు జాలి,దయ అసలు లేవు అనుకుంటున్నారా? వాటి మీద జాలి చూపిస్తే ఆ తరువాత నా మీద నేనే జాలి చూపించుకోవాల్సి వస్తుందని అలా చేసానన్న మాట.

Friday, 16 April 2010

అక్బర్ పరిపాలన

పరిక్షల సీజన్ వచ్చేసింది.పరిక్షలు రాసే వాళ్ళకే కాదండోయ్ ,పేపర్లు దిద్దే వాళ్ళకు కూడా కష్ట కాలమే.కొంత మంది రాసే, ప్రశ్నలకు సంబంధం  లేని జవాబులు,చిరాకు తో పాటు నవ్వును కూడా తెప్పిస్తాయి.ఏడవ తరగతి అమ్మాయి ,అక్బర్ పరిపాలన గురించి రాయమని ప్రశ్న ఇస్తే ఏమి రాసిందో చదవండి.


అక్బర్ పరిపాలన: ఆకాశం నీలం గా ఉంటుంది.ఆకాశం లో రంగు,రంగుల గాలి పటాలు ఎగురుతున్నాయి.ఎరుపు,పచ్చ,నీలం,పసుపు,గులాబీ రంగుల గాలి పటాలు ఎగురుతున్నాయి.బాగా పైకి ఎగురుతున్నాయి. ఇలా అక్బర్ పరిపాలన కొనసాగింది.

ఇదే మేటర్ ను ఐదారు సార్లు రాసి ఒక పేజీ నింపేసింది.అక్బర్ పరిపాలనకి,ఆకాశం లో గాలి పటాలకు సంబంధం ఏమైనా ఉందా?

Monday, 12 April 2010

గ్రుడ్లు తినండిబ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తీసుకోవటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా?
బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తీసుకోవటం వలన  మద్యాహ్నం భోజనం తక్కువ తింటామట. (దరిదాపు 18% తక్కువ )ఊబకాయులు 65 %ఎక్కువ బరువు తగ్గుతారంట.(బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తినని వారి తో పోలిస్తే)కొంతమంది శాస్త్రవేత్తలు గ్రుడ్డు తినటం వల్ల శుక్లాలు వచ్చే రిస్క్ తగ్గుతుంది అని చెప్పుతున్నారు.ఒక గ్రుడ్డు తెల్ల సోన లో  ౩౦౦ మిల్లి గ్రాముల కోలిన్ ఉంటుందంట.ఈ కోలిన్ వల్ల బ్రెయిన్,నర్వస్ సిస్టం,cardio వాస్కులర్ సిస్టం పని చేసే తీరు మెరుగుపడుతుందని చెపుతున్నారు.మరి ఇక నుంచి మీ బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు ను చేర్చండి.