Tuesday, 22 January 2013

చిన్ననాటి తీపి గురుతులునేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన డబ్బులు (5,10పైసల నాణాలు) ఉంటే డబ్బులు లేకపోతే పిన్నీసులు పెట్టె వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయిన వాటిని తీసుకుని సంబరపడేవాళ్ళం.రైలు వచ్చి ఆగిన తరువాత ఇంజిన్ దగ్గరకు వెళ్లి,డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు.వాళ్ళను  గ్రీజ్ అడిగే వాళ్ళం.డ్రైవర్ వెళ్ళండి అని అరిచే వాడు కానీ ,వేరే అతను ఒకళ్లిద్దరికి గ్రీజ్ ఇచ్చి ,ఇక వెళ్ళండి,రైలు కదులుతుంది అని పంపించేసేవాడు.ఆ ఇచ్చిన గ్రీజ్ ను తలా కొంచం పంచుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం.అంతకు ముందు మా ఇంట్లో కొట్టుడు పంపు పాడయినప్పుడు  బాగు చేయటానికి వచ్చినతను ,పంపు బాగుచేసినాక నట్టులకి గ్రీజ్ రాయటం చూసాను.గ్రీజ్ రాస్తే పంపు పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యం తో నేను ఇంటికి వెళ్ళగానే ,గ్రీజ్ ను పంపుకు నట్టు కనిపించిన చోటల్లా రాసాను.ఈ క్రమం లో గ్రీజ్ ,పంపుకే కాకుండా ,నా బట్టలకు,వంటికి కూడా అంటింది.పాపం ఇప్పటి వాళ్లకు తెలిసినట్లు గా ......మరక మంచిదేనని అప్పటి వాళ్లకు తెలియదు గా ! అందుకని మా అమ్మమ్మ బట్టలతో పాటూ నన్నూ ఉతికి ఆరవేసేది. 

Saturday, 19 January 2013

Main Aisa Kyun Hoon

 నా ఫ్రెండ్  - సినిమా కి వెళదామా 
నేను -అబ్బా !చూడదగ్గ సినిమాలు ఏమున్నాయి ? డబ్బులు  వదిలించుకుని తలనెప్పి తెప్పించుకోవటం తప్పించి,నేను రాను.
కొత్తగా రిలీజ్ అయిన రెండు సినిమాలు చాలా బాగున్నాయంట.ఒకటి,కామెడీ రెండోది ఫామిలీ ఎంటర్టైనర్ అంట.రెండిటి లో ఏదో ఒక దానికి వెళదాము.చాయిస్ నీదే!
ఈ మధ్య సినిమాల్లో కామెడి చూస్తుంటే నవ్వు కాదు ,చీదర వేస్తుంది ఆ వెకిలితనం భరించలేక.ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఫామిలీ లను భరించటం అంత కంటే కష్టం.వాళ్ళ అతి ప్రేమలూ వాళ్ళూ నూ . నా వల్ల కాదు.నేను రాను.
ఇంక నీకు నచ్చే సినిమాలు ఏంటి తల్లీ.దెయ్యం సినిమా లు చూస్తావా?
న్యూస్ చానల్స్ చూస్తే  చాలదూ ,దయ్యాల కంటే భయంకరం గా ప్రవర్తిస్తున్న వాళ్ళను లైవ్ చూడొచ్చు.అనవసరం గా డబ్బులు వేస్ట్ .
అసలు సినిమా కి వస్తావా అని నిన్ను అడగటం వేస్ట్ .నేను వెళుతున్నా .bye .
హ్మ్మ్...

Main Aisa Kyun Hoon ఒకప్పుడు సినిమా చూస్తుంటే ఏడుపు సీను వస్తే ఆటోమేటిక్ గా కన్నీళ్లు అలా ధారలు కట్టేవి.ఇప్పటి సినిమాల్లో ఏడుపు సీనులు వస్తే నవ్వు వస్తుంది. Aisa Kyun? అలా ఎందుకు?ఆహా !ఒహో ఏమి కామెడీ అని అందరూ విరగబడి నవ్వుతూ ఉంటె నాకు నవ్వు రావటం లేదు.ఏమిటి నీకు నవ్వు రావటం లేదా అని అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక వెర్రి చూపులు చూడాల్సి వస్తుంది.నాలోనే లోపం ఉందా?సైకియాట్రిస్ట్ కి చూపించు కోవాలేమో?
ఇలా ఆలోచిస్తూ ఉంటె ఒక ఆత్మా రాధ కుడివైపు నుంచి -అలా ఉండటం వల్ల నీకు నష్టం ఏమిటి అని అడిగింది.
ఇంకో ఆత్మా రాధ ఎడమ వైపు నుంచి -నష్టం ఎందుకు లేదు?సినిమాలు చూసి ఆనందించలేని బ్రతుకు ఒక బ్రతుకా అని అడిగింది.
ఒక ఆత్మ వస్తే సరి పోతుంది గా ఇద్దరు ఎందుకు ?ఒకళ్ళు వెళ్ళిపొండి అని నేను...
నేను వెళ్ళనంటే నేను వెళ్ళను అని ఆత్మలు భీష్మించు కోవటం తో సరే మీరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉండండి అని నేను ,బ్లాగ్ లో పోస్ట్ వేసి చాలా రోజులు అయ్యింది ,పోస్ట్ వేస్తాను అని ఇలా వచ్చాను అన్నమాట.
ఇక చదివి మీరు నవ్వుకుంటారో ,తల బాదుకుంటారో మరి మీ ఇష్టం :)