ఉక్రేనియా కి చెందిన Aleksandr Pylyshenko (ఆర్టిస్ట్ )Vasilyevka, southeastern Ukraine లో ఉన్న ఒక ప్రైవేట్ జూ లో ...ఒక అయిదు వారాలు రెండు ఆఫ్రికన్ సింహాలు ఉన్న పంజరం లో గడపటానికి నిశ్చయించుకుని ,ఆగస్ట్ ౩ ,2011 నుంచి తన నిర్ణయాన్ని అమలు పరుస్తున్నాడు.దీని ద్వారా వచ్చిన డబ్బులను,సింహాల లివింగ్ కండిషన్స్ ను మెరుగు పరచటానికి ఉపయోగిస్తాడట.నిజం గ ఇది ఒక సాహస నిర్ణయం కదా!
ఎప్పుడు ఏ పక్కనుంచి తీవ్రవాదులు లేకపోతే మతోన్మాదులు వచ్చి దాడి చేస్తారో.....
ఆస్తి కోసం దాయాదులు చంపుతారో,కన్నపిల్లలే చంపుతారో....
స్నేహితులుగా నటిస్తూనే మన వెనక గోతులు తవ్వుతుంటారో ....
తెలియని పరిస్థితుల లో మనుషుల మధ్య ఉండటం కంటే సింహాల మధ్య ఉండటం అంత అపాయకరమేమి కాదేమో!
పక్కనే సింహం ఉన్నా... ఎంత కూల్ గా పెయింట్ చేసుకుంటున్నాడో చూడండి.