Thursday, 22 December 2011
Sunday, 18 December 2011
ప్రేమంటే....
తల్లి తండ్రులకు తమ బిడ్డల పై ప్రేమ ఉంటుంది.
సోదరీ సోదరులకు తమ తోబుట్టువుల పైన...
భార్యకు,భర్త పైన....భర్తకు భార్య పైన...
స్నేహితులకు ఒకరి పైన ఒకరికి ప్రేమ...
ప్రేమ అనేది ఒక అనుభూతి,దాన్ని నిర్వచించలేము.
సోదరీ సోదరులకు తమ తోబుట్టువుల పైన...
భార్యకు,భర్త పైన....భర్తకు భార్య పైన...
స్నేహితులకు ఒకరి పైన ఒకరికి ప్రేమ...
ప్రేమ అనేది ఒక అనుభూతి,దాన్ని నిర్వచించలేము.
పైన ఉదహరించిన ప్రేమలన్నీ కూడా,ఏదో ఒక సంబంధం వారి మధ్య ఉండటం వల్ల కలిగినది.(రక్త సంబంధం,స్నేహ సంబంధం)అసలు ఏ సంబంధం లేకుండా మన చుట్టూ ఉన్న మనుషుల మీద ప్రేమ తో మెలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది?ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా వారి పట్ల ప్రేమతో మెలగడం ఎంతమందికి సాధ్యమవుతుంది?
ప్రస్తుత కాలం లో ప్రేమ అంటే యువతీ యువకులకు సంబందించిన విషయం గా మారిపోయింది.దీనికి మీడియా,సినిమాలు ప్రధాన కారణం.తాము ఇష్టపడిన అమ్మాయి తమను ఇష్టపడక పొతే యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు సర్వ సాధారణ విషయాలు గా మారిపోయాయి.ప్రేమ అంటే తీసుకోవడం కాదు,ఇవ్వడం అని చెప్పిన గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ ప్రేమంటే నాకు నచ్చింది.ఈ కథ లో నాయిక,నాయక పాత్రలు ప్రేమంటే 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అని తెలియ చెపుతారు.
ప్రస్తుత కాలం లో ప్రేమ అంటే యువతీ యువకులకు సంబందించిన విషయం గా మారిపోయింది.దీనికి మీడియా,సినిమాలు ప్రధాన కారణం.తాము ఇష్టపడిన అమ్మాయి తమను ఇష్టపడక పొతే యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు సర్వ సాధారణ విషయాలు గా మారిపోయాయి.ప్రేమ అంటే తీసుకోవడం కాదు,ఇవ్వడం అని చెప్పిన గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ ప్రేమంటే నాకు నచ్చింది.ఈ కథ లో నాయిక,నాయక పాత్రలు ప్రేమంటే 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అని తెలియ చెపుతారు.
ఈ కథ లో నాకు నచ్చిన అంశాలు:
1.ఇప్పటి పిల్లలను మనం చూస్తూనే ఉన్నాము,చిన్న చిన్న వైఫల్యాలకే కుంగి పోయి ఆత్మహత్యలు చేసుకోవడం.కానీ శశాంక్ అంధత్వానికి గురైనప్పటికీ తన వైకల్యం గురించి కుంగిపోకుండా ,తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ గ్రూప్ కి మారి చదువు లో విజయాన్ని సాదించటం ఎంతో స్పూర్తినిచ్చే విధం గా ఉంది.
2.శశాంక్ వయసుకు మించిన పరిణితి చూపించడం.తనకు అంధత్వం ప్రాప్తించినదని తెలిసిన తరువాత.... నువ్వు నన్నింకా ప్రేమిస్తూ ఉండాలని ఆశపడటం దుర్మార్గమవుతుందని నాకనిపిస్తోంది దృశ్యా !లవ్ నెవర్ క్లెయింస్, ఇట్ ఆల్వేస్ గివ్స్! చూపులేని నేను నీలాంటి అందమైన అమ్మాయి స్నేహాన్నీ, ప్రేమనీ కోరుకోవడంలో స్వార్థం ఉంటుందనిపిస్తోంది. అందుకే ప్లెయిన్‌గా చెప్పేస్తున్నాను. నేను నీకు రైట్‌ఛాయిస్‌ని కాను అని చెప్పటం బాగుంది.
౩.ఇక ఈ కథ లో ఇంకో ముఖ్యమైన పాత్ర దృశ్య.చాలా సాధారణమైన అమ్మాయి.చదువుకునే రోజుల్లో ఆ వయసుకు తగ్గట్లు ప్రవర్తించినా ,ప్రేమలో మోసపోయి తిరిగి శశాంక్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది.తను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి తిరిగి తన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే,కోరుకున్నది దక్కుతున్నది అని సంబర పడకుండా, శశాంక్ తనకు పెళ్లి అయ్యిందని అబద్దం చెప్పటం(దృశ్య తన మీద జాలి తో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.) ...అది, దృశ్య ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవటానికి కారణ మవటం బాగుంది.
4.దృశ్య... శశాంక్ కి పెళ్లి అయిపొయింది కాబట్టి ఇక తన గురించి నాకు ఎందుకు లే అని అనుకోకుండా "ప్రేమంటే 'ఇవ్వడం' అన్న మాటను నమ్మి శశాంక్ కు చూపు 'ఇవ్వడం' కోసం మూడేళ్ళపాటు నిద్రాహారాలు లెక్కచేయకుండా పరిశోధనలు జరిపి శశాంక్ చూపు తెప్పించడం.ఇది కొంచం నాటకీయం గా ఉన్నా కథ కాబట్టి అంత పట్టించుకోనక్కర లేదనుకుంటున్నాను.
5.శశాంక్ దృశ్య ను పెళ్లి చేసుకుందామా అని అడగటం.అంతకు ముందు దృశ్య తన మీద జాలి తో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.ఇప్పుడు ఆ సందేహం తీరి పోవటం తో శశాంక్ తనే దృశ్య కు ప్రొపోజ్ చేయటం బావుంది.
౬.ఇక పొతే ఉప సంహారం
"ప్రేమించడాన్నీ...ప్రేమంటే 'ఇవ్వడం' అన్న భావననీ కేవలం 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అన్న ఆలోచనకు కార్యరూపం గా ఉచితం గా పేదవారికి సేవ చేయటం కోసం హాస్పిటలూ, ఆశ్రమ పాఠశాల నిర్వహించటం .
ఇవ్వడంలోని ఆనందాన్ని చిన్న వయసునుండే వాళ్ళ పాప మానస కు నేర్పటం...
శశాంక,దృశ్య లాంటి వాళ్ళు మరింత మంది మన సమాజం లో ఉంటే స్వర్గం ఇల లోనే ఉంటుంది కదా!ప్రస్తుతం ఇలాంటి పాజిటివ్ ఆలోచనలును పెంపొందించే కథల అవసరం ఎంతైనా ఉంది.
పూర్తి కథ చదవటానికి....
Tuesday, 13 December 2011
సాంబారు పొడి కాదు....సంబారు కారం
చాలా మందికి సంబారు కారం అంటే తెలియదు,సాంబారు పొడి గా పొరబడుతుండటం తో ఈ పోస్ట్ రాయాల్సి వచ్చింది.(ఈ పోస్ట్ ఎందుకు రాశావ్ అని ఎవరూ అడగరను కోండి,ఊరికే చెప్పాలనిపించిది)
కావాల్సినవి:
ఎండు మిరపకాయలు -1 kg
జీలకర్ర -2 గిద్దలు (1/4 kg)
మెంతులు -గిద్ద (125 gms)
ధనియాలు -3 గిద్దలు (375gms)
కళ్లుప్పు - 5 గిద్దలు (625gms)
చిన్నుల్లి పాయలు(వెల్లుల్లి)-1/4 kg
ఆముదం -100gms Optional
ముందుగా ఎండు మిరపకాయల్ని తొడిమలు తీసి మంచి ఎండలో (పిచ్చి ఎండ కూడా ఉంటుందా అనే పిచ్చి ప్రశ్నలు వేయకండి,నాకు తెలుసు మీరందరూ చాలా మంచి వారని,అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయరని.ఏదో ముందు జాగ్రత్తగా చెప్పాను.)ఎండ పెట్టండి.జీలకర్ర,మెంతులు,ధనియాలు కూడా ఎండపెట్టండి.
ఆ తరువాత జీలకర్ర,మెంతులు,ధనియాల ని విడి విడిగా కమ్మని వాసన వచ్చేవరకు బాణలి లో వేయించుకోండి.(నూనె వెయ్యకుండా)ఉప్పు ను కూడా డార్క్ గ్రే కలరు వచ్చేవరకు వేయించండి.
వేయించుకున్నారా?ఇప్పుడు అన్నిటిని కలిపి మిరపకాయల తో పాటు రోటిలో వేసి దంచండి. అవి మెదిగాక, చివరికి చిన్నుల్లి పాయలు వేసి దంచి ఆముదం వేసి కలుపుకోవాలి.గ్రైండ్ చేసేటట్లయితే మరీ మెత్తగా కాకుండా కొంచం బరక గా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
కారం తయారు చేసుకోవటం అయిపోయింది.ఇక దీన్ని ఎలా వాడాలి అంటారా?వేపుడు కూరల్లో తప్పించి అన్ని కూరల్లో వేయొచ్చు.
ఈ కారం లో నెయ్యి వేసుకుని ఇడ్లి,దోశ,ఆయ కుడుములు నంజుకుని తినొచ్చు.అన్నం లోకి ముద్దపప్పు ,సంబారు కారం,నెయ్యి వేసుకుని తినొచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు?మీరు కూడా సంబారు కారం తయారు చేసుకుని ,ఉపయోగించి మీకు నచ్చిందో లేదో తెలియ చేయండి.
Subscribe to:
Posts (Atom)