చికాకులు,ఆందోళనలు ....వాటినుంచి బయట పడలేని దుర్భలత్వం,కలవరపరచి ఉండొచ్చు
కష్టాల్లో ఉన్నప్పుడు -నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరే అని బాధపడి ఉండొచ్చు.
జీవించటం ఎందుకో తెలియక విసిగి వేసారి....
ఈ జంజాటాలన్నీ వదిలించుకుని ఎక్కడకన్నాదూరంగా వెళ్ళిపోతే ఎంత బాగుండు అనిపించి ఉండొచ్చు.
కానీ ఎక్కడికి వెళ్ళలేము
చనిపోవాలని అనిపించి ఉండొచ్చు-కాని ధైర్యం చాలదు.
జీవితం సాగిపోతూనే ఉంటుంది.
అకస్మాత్తుగా ఒకరోజు వస్తుంది
వీళ్ళందరికీ నేనంటే ఇంత అభిమానమా అని ఆశ్చర్యపోయే రోజు
నేను నిజంగా ఇంత మంచివాడినా/మంచిదానినా అని ఆశ్చర్యపోయే రోజు
మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన రోజు
స్నేహితులు ,బంధువులు,పరిచయస్తులు...
అందరి కళ్ళలో కన్నీరు
ఉన్నన్ని రోజులు మన గురించి చెడు తప్ప మంచి మాట్లాడని వారి నోటినుంచి
మన మంచితనం గురించి పొగడ్తలు
మదిలో చిన్న ప్రశ్న
మన వాళ్ళు మన మీద అభిమానం చూపించాలంటే
మన మంచితనాన్ని గుర్తించాలంటే మనం ఈ లోకాన్ని వీడాల్సిందేనా?
మన వారి అభిమానం పొందటానికి మరణం కోసం ఎదురు చూడాలా?
హ్మ్,జీవితం సాగి పోతూనే ఉంటుంది -జవాబు లేని ప్రశ్నలతో
సమధానాలకోసం అన్వేషిస్తూ ,ఎదురుచూస్తూ.....