హ్మ్ !ఇవాళ నా పుట్టిన రోజు.ఇన్ని సంవత్సరాలలో సాధించినది ఏమీ లేదు.ఒక్కోసారి ఏమిటి ఈ జీవితం?ఎందుకు బ్రతుకుతున్నాము అని అనిపిస్తుంది.జీవన తరంగాలలో ఈ పాట విన్నప్పుడు మరీనూ!
పాటలు పాడటం రాదు,కథలు ,నవలలు రాయటం రాదు...కనీసం వంట చేయటం కూడా రాదు.
తినటం,కాసేపు టివి చూడటం,కాసేపు అంతర్జాలంలో విహరించటం ఇంతకు మించి చేస్తున్నది ఏమీ లేదు.
ఉపయోగ పడే పని ఒక్కటీ చేయటం లేదు.ఎన్నాళ్ళు ఇలా బ్రతకటం?నేను ఏమి సాదించ లేనా?ఇలా అనుకోవటమే కాని ఏదన్నా సాదించటానికి చేతలు లేకపోవటం తో ఏమి సాదించలేదు.
ఇలా నిరాశ నిస్పృహలు ఆవహించినప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట.ఎలా అనగా ...
పాటలు పాడటం రాకపోతే ఏముంది?పాటలు విని ఆనందించటం వచ్చు కదా?వినేవాళ్ళే లేకపోతే పాడేవాళ్ళు ఎవరికోసం పాడుతారు.
కథలు రాయటం రాకపోతే ఏమయ్యింది.చదివి ఆనందించటం వచ్చు కదా?చదివే వాళ్ళే లేకపోతే రచయితలు ఎవరి కోసం రాస్తారు?ఇలా అన్నమాట :)
సో, మనం ఎందుకు పనికిరాము ,ఏమీ సాదించలేదు అని అనుకోనవసరం లేదు.పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక
పర్పస్ ఉంటుంది.కొంతమంది పర్పస్ కొత్త విషయాలు కనుక్కోవటం,పాటలు పాడటం,కథలు రాయటం ,వగైరా వగైరా.
మనలాంటి వాళ్ళ పర్పస్ కనుక్కొన్న వాటిని తెలుసుకుని ,అవసరమైతే ఉపయోగించుకోవటం,పాటలు విని
పుట్టిన రోజు సందర్భం గా ఈ కేక్ మీ కోసం.