రోజూ ఒకటే టైపు బ్రేక్ ఫాస్ట్ తిని తిని బోర్ అనిపిస్తుందా ?మీ కోసం ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్. ఇడ్లీ ,దోసలకు పట్టినట్టు ముందు రోజే పిండి పట్టి ఉంచుకోవక్కరలేదు. చాలా తక్కువ సమయం లో
తయారు చేసుకోవచ్చు .
కావలసిన పదార్ధాలు :
ఓట్స్ - 1 కప్ (పొడి చేసుకోవాలి )
శనగ పిండి - 1/2 కప్
ఉప్పు,పసుపు,కారం - తగినంత
వాము - చిటికెడు
పచ్చి మిరపకాయ - 1 (సన్నగా తరగాలి )
తరిగిన అల్లం - 1/2 టీ స్పూన్
కొత్తిమీర -చిన్న కట్ట
ఉల్లిపాయ ముక్కలు - గుప్పెడు
తురిమిన క్యారెట్ - 3 టేబిల్ స్పూన్లు
టొమేటో ముక్కలు - 3 టేబిల్ స్పూన్లు
క్యాప్సికం ముక్కలు - 3 టేబిల్ స్పూన్లు
నూనె
అన్నిటిని ఒక గిన్నెలో వేసి తగినంత నీరు పోసి కలుపుకోవాలి. పెనం పైన ,దోశ లా వేసి కాల్చుకోవాలి . అల్లం చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు లేదా వేడి వేడి గా అలానే తినొచ్చు
చాలా ఈజీ కదా ...