చాలామంది ,మనం అడగకపోయినా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు , ఏదో ఒక సందర్భం లో ప్రతి ఒక్కరికి ఎదురుపడే ఉంటారు. ఆ సలహాలు పొందిన వారు పైకి ఏమీ అనకపోయినా లోలోన తిట్టుకునే ఉంటారు.
బాగున్నారా ?ఈ మధ్య అసలు కనిపించటం లేదు , వాకింగ్ కి రావటం లేదా ?
బాగానే ఉన్నాను అండి . వాకింగ్ కి రావటం లేదు
మీ పాప ఏమి చేస్తుంది ?
సి.ఎ చేస్తుంది అండి
సి.ఎ లో ఎందుకు జాయిన్ చేసారండి ?మీ పాప బాగా చదువుతుంది కదా ,ఇంజినీరింగ్ లో చేర్పించకపోయారా ? ఇప్పుడు ఎన్నో సంవత్సరం ?
డిగ్రీ కి మల్లే ఇన్ని సంవత్సరాలు ...
అవును , సి.ఎ అంటే సంవత్సరాల తరబడి చదువుతూనే ఉండాలంట గా ?పాస్ అవటం కష్టం అని మా చుట్టాల అమ్మాయి చెప్పింది . ఉద్యోగాలు కూడా రావంట . ఇప్పుడయినా ఏదైనా డిగ్రీ లో జాయిన్ చెయ్యండి .
:)
అబ్బాయి పెళ్లి చెయ్యటం లేదా ?
లేదు ,ఇప్పుడే చేసుకోను అంటున్నాడు
పిల్లలు అలాగే అంటారు లెండి ,పెళ్లి చేసేస్తే మీకు ఒక బాధ్యత తీరిపోతుంది .
ఆడపిల్లలు కూడా 24,26 ఏళ్ళకి కానీ పెళ్లి చేసుకోవటం లేదు . మా అబ్బాయికి ఇప్పుడు 22 , పిల్ల దొరకాలి గా ?
అందుకనే చెప్తున్నా అండి ,ఇప్పుడు అమ్మాయిలు దొరకటం కష్టం గా ఉంది . ఇంకా ముందు ముందు అస్సలు దొరక్క పోవచ్చు . త్వరగా చేసెయ్యండి
హి హి హి , అలాగే ...
తమకే అన్నీ తెలుసు , తమకంటే గొప్ప వాళ్ళు లేరనుకోవటం ,తాము చేసేదే సరి అయినది అనుకోవటం ... మనుషుల బలహీనత .
ఆ బలహీనతే , ఇలాంటి ఉచిత సలహాలు ...