Friday, 27 October 2017

రాజా దినకర్ కేల్కర్ మ్యూజియం

పూనే వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఈ మ్యూజియం ఒకటి.దినకర్ కేల్కర్ అనే అతను ,తన కుమారుని జ్ఞాపకార్ధం కొన్ని వేల వస్తువులు సేకరించి ఈ మ్యూజియం ను ఏర్పరిచారు.మేము వెళ్ళినప్పుడు సందర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒకరిద్దరు , ప్రవేశ రుసుము 100 రూపాయలు అనేటప్పటికి తిరిగి వెళ్లిపోయారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం చూడటానికి సుమారు 3 గంటలు పడుతుంది.17,18 శతాబ్దం నాటి దర్వాజాలు,కిటికీలు,వంట సామగ్రి,దువ్వెనలు, దీపాలు,సంగీత పరికరాలు,ఆయుధాలు, ... ఇలా చెప్పుకుంటూ పోతే ,చాంతాడంత లిస్ట్ అవుతుంది.మస్తానీ మహల్ నమూనా కూడా ఉంది. అన్నిటినీ ఫోటోలు తీయటం అసాధ్యం కాబట్టి ,ఏవో కొన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను



ENTRANCE




గడియ 

Lamp stand 

Hanging Lamps (Nepal)


Chapati impressions (Gujarat)






Mastani mahal

Sunday, 15 October 2017

హవా మహల్


ప్రతాప్ సింగ్ అనే రాజు 1799లో రాచకుటుంబానికి చెందిన స్త్రీలు బయటవారికి కనిపించకుండా,పండుగ/పర్వ దినాలలో ,వీధి వేడుకలు చూడటానికి వీలుగా ఈ హవామహల్ కట్టించాడు.అయిదు అంతస్తుల మహల్ కి 953 కిటికీలు ఉన్నాయంట.అంట అని ఎందుకన్నాను అంటే , నేను లెక్క పెట్టలేదు కనుక :)మనం సాధారణం గా చూసే మహల్ పిక్చర్ ,మహల్ వెనక భాగం.మహల్ ప్రవేశానికి 50 రూపాయలు రుసుము.మహల్  లోపలి  పిక్చర్స్ కొన్ని , మీకోసం .











 
కొన్ని పురాతన శిల్పాలు