Saturday 10 December 2016

అంగట్లో అన్నీ ఉన్నా ...


ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది.ఇప్పుడు ఆ సామెతను అంగట్లో అన్నీ ఉన్నా అందరి నోట్లో శని అని మార్చుకోవాలేమో.నవంబర్,8-500,1000నోట్లు రద్దు అన్న వార్త విని,మొదటపర్వాలేదులే, ఈ నెల ఇంకా డబ్బులు విత్ డ్రా చెయ్యలేదు,ఇంట్లో ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి మార్చుకోవటానికి అంత  ఇబ్బంది పడక్కరలేదు అనుకున్నా.ఉన్న డబ్బులు మార్చుకోవటానికి ఇబ్బంది పడలేదు కానీ, ఉన్న డబ్బులు తీసుకోవటానికే ఇబ్బంది 😀నెలయ్యింది,ఇంతవరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవటానికి కుదరలేదు.ఇంటికి దగ్గరలో,ATM లు ఉంటానికి ఒక అరడజను ఉన్నాయి, కానీ నెలనుంచి  "out of service" " No cash "  అన్న బోర్డులు ... రోజూ వెళ్ళటం , ఆ బోర్డులు చూసి తిరిగి వచ్చెయ్యటం -ఇదే పని. బాంక్ కి వెళ్లి తెచ్చుకోవటానికి , క్యూలు చూసి భయం తో వెళ్ళలేదు.నిన్న భయాన్ని ఊరం పెట్టి బాంక్ కి వెళితే , అక్కడ కూడా కాష్ లేదు , మంగళవారం వరకు రాదు. మంగళవారం వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఆ రోజైనా దొరుకుతుందో లేదో తెలియదు.ఇవాళ న్యూస్ లో చూసాను,ఒక అధికారికి చెందిన కారులో కొత్త నోట్లు-24 కోట్లు  దొరికాయంట.ఇంకెక్కడో 84 లక్షలు ... నేను 2000 రూపాయలు  తెచ్చు కోవటానికే నానా అవస్థలు పడుతున్నాను. 😓 










    

No comments: