కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అంటారు.ఆడది గా పుట్టేకంటే అడవి లో మానై పుట్టినా బాగుండు అంటారు.అంటే కష్టాలు మనుషులకు మాత్రమే ఉంటాయా?ఇంక ఎవరికీ ఉండవా?మా కష్టాలు ఎవరికి తెలుసు?పీత కష్టాలుపీతవి అన్నట్లు మాకష్టాలు మాకు ఉన్నాయి.అడవిలో ఎప్పుడు దావానలం వ్యాపించి మమ్ములను దహించి వేస్తుందో, ఎప్పుడు ఎవరు వచ్చి మమ్ములను గొడ్డళ్ళ తో నరుకుతారో అని బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటాము.అలా గొడ్డళ్ళ తో నరికి తీసుకు వెళ్లి మీ మనుషులు మమ్ముల్ని ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారు.రంపాలతో కోస్తారు.చిత్రిక పట్తారు .మీ మనుషుల లో ఉన్నట్లే మా లోనూ అదృష్ట వంతులు ,దురదృష్ట వంతులు ఉన్నారు. దురదృష్ట వంతులును తీసుకు వెళ్లి పొయ్యి లో కట్టెలు గానో ,శవాలను కాల్చతనికో ఉపయోగిస్తారు.అదే అదృష్ట వంతులని బొమ్మలు గానో, ఫర్నిచర్ గానో మలిస్తే,గొప్ప వారి ఇంట్లో కొలువు దీరతాయి.దేవుడి బొమ్మలు గా మలిస్తే మరీ అదృష్టం.పూజలు అందుకుంటాయి.మరి ఇంకా మానయి పుట్టాలనే అనుకుంటారా?
Saturday, 27 March 2010
ఒక మాను స్వగతం

Monday, 8 March 2010
పిచ్చుకలు
కే.ఎ.అబ్బాస్ రాసిన 'sparrows' అనే కథ అంటే నాకు చాలా ఇష్టం.ఏ వ్యక్తి కూడా పుట్టుక తోనే మంచివాడు గా కానీ ,చెడ్డవాడు గా కానీ పుట్టడు. తన జీవితం లో ఎదుర్కొన్న సంఘటనలు,కుటుంబం లోని వ్యక్తులు,సమాజం ,అతనిని మంచివాడుగా కానీ చెడ్డవాడు గా కానీ తయారు చేస్తాయి.ఈ కథ రహీం ఖాన్ అనే వ్యక్తి జీవితం గురించి.కథ ప్రారంభం అయ్యేట్టప్పటికి రహీం ఖాన్ వయసు 50 ఏళ్ళు. వృత్తి వ్యవసాయం.గ్రామములో అతనికి మంచి పేరు లేదు.అతనిని రాతి హృదయపు దెయ్యం అని అనుకుంటూ ఉంటారు.వూళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి తోనూ గొడవ పడుతూ ఉంటాడు.ఒకరోజు ఇంటి కి వచ్చేటప్పటికి ఇంట్లో భార్య ఉండదు.అతను తన ముప్పయి ఏళ్ళ వైవాహిక జీవితము లో ఎప్పుడో ఒకరోజు భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని ఊహించినదే.భార్య వెల్లి పోయిందనే భాద కంటే కోపమే ఎక్కువ.అంతకు ఆరు సంవత్సరాలకు ముందు పెద్ద కొడుకు, తండ్రి కొట్టే దెబ్బలు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లి పోతాడు.ఆ తరువాత మూడు ఏళ్ళకు రెండవ కొడుకు వెళ్లి పోతాడు.అప్పటి నుంచి భార్య కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుందని గట్టి నమ్మకం ,రహీంఖాన్ కు.తన కుటుంబము,జీవితము,సమాజం పైన ఉన్న క్రోధాన్నంతటిని ఈ ముప్పయ్ ఏళ్ళు భార్య పైన చూపించాడు.
వయసు లో ఉన్నప్పుడు కుస్తీ లో కానీ కబడ్డీ లో కానీ ఆ వూళ్ళో అతనికి పోటీ ఎవ్వరు లేరు.సరకస్ లో చేరాలను కుంటాడు.రాధ అనే హిందువుల అమ్మాయి ని ప్రేమిస్తాడు.పెళ్లి చేసుకోవాలను కుంటాడు.కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పు కోనందు వల్ల ఆ రెండు కోరికలు తీరవు.తల్లి దండ్రులు చూసిన అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాడు.ఆ క్షణమే ,తన కలలు నెరవేరక పోవటానికి కారణం తన తల్లి దండ్రులు ,సమాజమే అనే నిర్ణయానికి వస్తాడు. ఆ కక్ష నంతటిని భార్యను తన్నటం ద్వారా తీర్చుకుంటాడు.వూర్లో ప్రతి ఒక్కరితో తగవు పెట్టుకుంటాడు.ఒకప్పుడు ఎంతో ఉల్లాసం గా ఉండే రహీంఖాన్ ఒక మృగం లాగా ఎందుకు తయారయ్యాడో వూళ్ళో వాళ్ళకి అర్థం కాదు.రహీంఖాన్ చని పోవటం తో కథ ముగుస్తుంది.ఈ కథ చదివిన ప్రతి ఒక్కరి కంట నీరు తెప్పిస్తుంది .
ఈ కథ చదవ దల్చుకున్న వారు గూగుల్ సెర్చ్ లో కే.ఎ.అబ్బాస్ 'sparrows' అని టైపు చెయ్యండి.

టూలెట్
ఇల్లద్దెకు కావాలంటే చూడండి!ఆ ఇరుకు సందులో ఇస్తారట
వాళ్ళ వాళ్ళు దొరికితే,ఇద్దరు పిల్లలు మించని పెట్టు.
ఇల్లు నిక్షేపం లా వుంటుంది బురదలో దిగవేసిన సేలూన్లా
ఇల్లుగలావిడ కూడా 'డిటో 'నగలు దిగవేసిన బెలూన్లా
సణుగడమ్మ ఇంటి బామ్మగారు ,సదా సంస్కృత బాషలో
ఇంటాయన గొప్ప పాటగాడు అబ్కారి పరిభాషలో
ఇంట్లో దిగిన వాళ్ళకు ఖర్చు జాస్తి,ఇరుగమ్మ పేరే బదులమ్మ
పొద్దుగూకులూ సందడి కేం తక్కువ -పొరుగమ్మ సూటీపోటీలమ్మ
బాత్రూం కామన్, అంటే బావి చుట్టూ సరిగంగ స్నానాలు
లెట్రిన్ కు లోగడియ లేదు-వింటే లోపల దగ్గుతూ కూచోడాలు
ఇన,సోమ వాయువులు తప్ప ఇంట్లోకి అందరూ రావచ్చు
జల్లు పడితే ఇల్లంతా షవర్ బాత్ ,కాదంటే కంచాలు,గిన్నెలు పరవొచ్చు
ఇంతకూ ఇంటి అద్దె ఎంత?మీరు, మేము ఇచ్చుకోలేనంత.
ఇది నేను రాయలేదండి.ఎప్పుడో ఒక వీక్లీ లో చదివాను.రాసింది ఎవరో గుర్తులేదు.

Subscribe to:
Posts (Atom)