Monday 8 March 2010

టూలెట్

ఇల్లద్దెకు కావాలంటే చూడండి!ఆ ఇరుకు సందులో ఇస్తారట
వాళ్ళ వాళ్ళు దొరికితే,ఇద్దరు పిల్లలు మించని పెట్టు.
ఇల్లు నిక్షేపం లా వుంటుంది బురదలో దిగవేసిన సేలూన్లా
ఇల్లుగలావిడ కూడా 'డిటో 'నగలు దిగవేసిన బెలూన్లా
సణుగడమ్మ ఇంటి బామ్మగారు ,సదా సంస్కృత బాషలో
ఇంటాయన గొప్ప పాటగాడు అబ్కారి పరిభాషలో
ఇంట్లో దిగిన వాళ్ళకు ఖర్చు జాస్తి,ఇరుగమ్మ పేరే బదులమ్మ
పొద్దుగూకులూ సందడి కేం తక్కువ -పొరుగమ్మ సూటీపోటీలమ్మ
బాత్రూం కామన్, అంటే బావి చుట్టూ సరిగంగ స్నానాలు
లెట్రిన్ కు లోగడియ లేదు-వింటే లోపల దగ్గుతూ కూచోడాలు
ఇన,సోమ వాయువులు తప్ప ఇంట్లోకి అందరూ రావచ్చు
జల్లు పడితే ఇల్లంతా షవర్ బాత్ ,కాదంటే కంచాలు,గిన్నెలు పరవొచ్చు
ఇంతకూ ఇంటి అద్దె ఎంత?మీరు, మేము ఇచ్చుకోలేనంత.


ఇది నేను రాయలేదండి.ఎప్పుడో ఒక వీక్లీ లో చదివాను.రాసింది ఎవరో గుర్తులేదు.

No comments: