Monday, 31 January 2011

తలనొప్పులు




తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి పరిచయమైనదే.  సాధారణంగా 95% తలనొప్పి......  స్ట్రెస్,అలసట,నిద్రలేమి,ఆకలి,ఈస్ట్రొజెన్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు,వాతావరణ మార్పులు వల్ల  వస్తుంది.

టెన్షన్ హెడేక్ - కండరాలు బిగుసుకు పోవటం వల్ల టెన్షన్ హెడేక్ వస్తుంది.తలంతా నొప్పి గా ఉంటుంది.ముఖ్యంగా నుదురు లేదా తల వెనుక భాగం లో నెప్పి ఎక్కువగా ఉంటుంది.పిల్లల్లో ఇటువంటి తలనెప్పి రావటం తక్కువ.పెద్దవారికి ఎక్కువగా వస్తుంది.

సైనస్ హెడేక్ - ముఖం లో ,ముక్కు దూలం లేదా చెంపలు లో నెప్పి.ముక్కు దిబ్బడ..దీని లక్షణాలు.అన్ని వయసుల వారికి వస్తుంది.అలెర్జీ ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది.

మైగ్రేన్ - తీవ్రమైన నెప్పి,వాంతి వచ్చేలా ఉండటం,వెలుతురు,శబ్దాలు భరించలేకపోవటం  మైగ్రేన్ లక్షణాలు.నెప్పి ఎక్కువగా ఒకవైపే ఉంటుంది.కణతలు,కళ్ళు ,తల వెనుక భాగం లో నెప్పి ఉంటుంది.


కొన్ని తలనొప్పులు ....కొన్ని రకాల మందుల వాడకం వల్ల కానీ,(నైట్రో గ్లిజరిన్,ఈస్ట్రోజెన్* )ఇతర వ్యాధుల లక్షణాలు కానీ అయి ఉండవచ్చు.(జలుబు,ఫ్లూ,సైనస్ ఇన్ఫెక్షన్,బి.పి,ట్యూమర్ )


Because the following symptoms could indicate a significant medical problem, seek medical care promptly if you experience:

  • a sudden headache that feels like a blow to the head (with or without a stiff neck)
  • headache with fever
  • convulsions
  • persistent headache following a blow to the head
  • confusion or loss of consciousness
  • headache along with pain in the eye or ear
  • relentless headache when you were previously headache-free
  • headache that interferes with routine activities.


* nitroglycerin, prescribed for a heart condition, and estrogen, prescribed for menopausal symptoms — are notorious causes of headache.

Source :హెల్త్ బీట్ న్యూస్ లెటర్ .

Monday, 24 January 2011

దో ఫల్ రుక క్వాభోన్ క కార్వా

జీవితాన్ని ప్రయాణం తో పోల్చారు ,కొంతమంది కవులు.మన జీవన పయనం లో ఎంతో మంది మనకు తారస పడుతుంటారు.అందులో కొంతమంది ...పరిచయం చిన్నదైనా ,మనసుకు చాలా దగ్గర అవుతారు.అలా దగ్గరైన వారు మనకు దూరమవుతుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది కదూ...
వీర్జార లో అలా దూరమవుతున్న ఇద్దరు పాడుకునే ,లతా మంగేష్కర్,సోను నిగం పాడిన ఈ పాట మీరూ వినండి/చూడండి.





Wednesday, 19 January 2011

హర్ జనం మే హమారా మిలన్

1975 లో బి.ఆర్.ఇషారా దర్శకత్వం  లో వచ్చిన కాగజ్ కి నావ్ అనే సినిమా లోని మన్ హర్,ఆశా భోంస్లే  పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.ఇది రాజ్ కిరణ్ ,సారిక ల మొదటి సినిమా.హ్యూమన్ రిలేషన్స్ మీద తీసిన ఒక మంచి సినిమా.