మానవుడు-దానవుడు సినిమా లోని ఈ పాట నాకు చాలా ఇష్టం.
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా
మనిషిని మనిషే కరిచే వేళ,
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకు అందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృభూమి మొర పెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలంను సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగనిరతి మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
వ్యాధులు,బాధలు ముసిరేవేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగా గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులూది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకు అందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా