మెటిల్డా
డైరెక్టర్ -Danny DeVito
Writer: Roald Dahl
screenplay :Nicholas Kazan
మెటిల్డా చాలా తెలివైన అమ్మాయి.స్కూల్ కి వెళ్ళటం,పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.ఇంట్లో మిగతా ముగ్గురు(తల్లి,తండ్రి,అన్న)కి టి.వి.కాలక్షేపం.తల్లి బింగో ఆడుతుంటుంది.తండ్రి కార్ల అమ్మకం చేస్తుంటాడు.మెటిల్డా చెపితేనే కానీ ,తనను స్కూల్ కి పంపే వయసు వచ్చిందని తెలుసుకోలేనంత గా తమ వ్యాపకాల లో మునిగి పోయి ఉంటారు.ఎలాగైతేనేం ,మెటిల్డా ని స్కూల్ కి పంపిస్తారు.ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పరమ క్రూరురాలు.మెటిల్డా తనకున్న పవర్స్ తో ...ఆ ప్రిన్సిపాల్ ని స్కూల్ నుంచి ఎలా పంపించివేసింది,తన టీచర్ కు ...ప్రిన్సిపాల్ నుంచి ,ఆమె ప్రాపర్టీ ని తిరిగి ఎలా ఇప్పించింది అన్నది కథ.మెటిల్డా గా మారా విల్సన్ చాలా బాగా యాక్ట్ చేసింది.చాలా క్యూట్ గా ఉంది.ప్రిన్సిపాల్ పాత్ర లో Danny DeVito అంతే బాగా యాక్ట్ చేసింది.పిల్లలకు,చైల్డిష్ మెంటాలిటీ ఉన్న నా లాంటి పెద్దలకు నచ్చే సినిమా ఇది.