Monday, 11 April 2011

సుత్తి (కబుర్లు)ఈ టపా కి శీర్షిక ఏమి పెట్టాలో తెలియక అలా సుత్తి కబుర్లు అని పెట్టాను.నేను రాస్తున్న విషయాలకి అది ఆప్ట్ గానే ఉందనుకోండి.రెండు రోజుల క్రితం  మేము శ్రీశైలం వెళ్ళాము.దారిలో ఎదురైన కొన్ని ఊర్ల పేర్లు చాలా విచిత్రం గా ,నవ్వు వచ్చేలా ఉన్నాయి.(దోమల  పెంట,ఈగల పెంట,సున్ని పెంట,రాయి చెడి)వాటికి అలాంటి పేర్లు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ పేర్లు చదవంగానే ,చాలా నవ్వు వచ్చింది.మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద ఒక పెద్ద బోర్డ్ పెట్టారు.రెండు రూపాయలు పెట్టి ఒక పేపర్ బ్యాగ్ కొనుక్కొని ,వాడిన మినరల్ వాటర్ బాటిల్స్,ఇతర ఐటమ్స్ అన్నీ అందుట్లో వేయమని,ఫారెస్ట్ ఏరియా లో పడవేయవద్దని.ఆ తరువాత ప్రతి పది అడుగులకు ఒక బోర్డ్...పర్యావరణాన్ని కాపాడమని.బోర్డుల దారి బోర్డులది.మన జనాల దారి జనాలది.అంతగా మొత్తుకుంటున్నా దారి పొడుగూతా ,ప్లాస్టిక్ బాటిల్స్,కవర్స్.... జనాలు వాడి పడేసినవి కనిపిస్తూనే ఉన్నాయి.
ఒక రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో జూ కి వెళ్ళాము.అక్కడ ఉన్న జంతువులకి ఏమీ ఫీడ్ చేయవద్దని బోర్డ్ లు పెట్టారు.వాటిని చూసి ,రాసి ఉన్నవాటిని పాటిస్తే మనం మనుషులం ఎలా అవుతాము?సరే కోతులకు అరటి పళ్ళు,హిప్పోపోటమస్ కి బ్రెడ్ ...ఇలా... కొంతమంది విసిరేస్తున్నారు.ఇది కొంత బెటర్.ఇంతలో ఒక గ్రూప్ అబ్బాయిలు వచ్చారు.స్టూడెంట్స్ లాగా ఉన్నారు.అందులో ఒకడు నాలుగైదు ప్లాస్టిక్ కవర్లను చుట్ట చుట్టి హిప్పోపోటమస్ నోట్లోకి విసిరేశాడు.వాడు విసరబోతుంటే ,నాతో పాటు అక్కడే ఉన్న మరికొంతమంది వెయ్యకు అని అరుస్తూనే ఉన్నాము,అయినా వాడు విసిరేశాడు.అదేమి ఆనందమో నాకు అర్ధం కాలేదు.ఈ భూమి మీద ఉన్న క్రూరాతి క్రూరమైన జంతువు ఏదైనా ఉందంటే అది మనిషే!జంతువులననే కాదు...కొంతమంది ఎదుటివారిని అకారణంగా మాటలతో,చేతలతో హింసించి ఆనంద పడుతుంటారు.ఇలాంటి వాళ్ళ గురించేనేమో ,భాస్కర శతక కారుడు ఈ పద్యం రాసింది.

ఊరక సజ్జనుండొదిగి యుండిననైనా దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా
చీరలు నూరు  టంకములు చేసెడివైనను పెట్టెనుండగా 
చేరి చినింగి పోగొరుకు చిమ్మటకేమి   ఫలంబు?భాస్కరా!

1 comment:

Srinidhi Yellala said...

దరిద్రులు...డస్ట్ బిన్ను లో చెత్త వేస్తుంటే..మీ లాంటి వాళ్ళ వల్లే మమ్మల్ని స్టుపిడ్ ఫెల్లోస్ అంటున్నారని
అక్కడికి వచ్చిన ఇంకో లేజీ ఫేల్లో అన్నాడట..భూమ్మీదఇలాంటి వాళ్ళదే రాజ్యం అండి..మనం ఎంత చెప్పిన బుర్రకి ఎక్కాడు.