Monday, 16 May 2011

కొన్ని నమ్మకాలు ....నిజాలు

సర్వేంద్రియాణం నయనం ప్రధానం .నయనాలు విలువ కట్టలేనివి.అందుకని
వయసు 18 అయినా,80 అయినా శ్రద్ద తీసుకుని కళ్ళను కాపాడుకుందాము.

వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బులు ,కంటికి సంబందించిన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకుంటూ ఉంటె 40 %నుంచి 50 % వరకు జబ్బు నివారించటానికి, జబ్బు ముదరక ముందే తగిన చికిత్స చేయించుకునే వీలు, ఉంటుంది. రెగ్యులర్ గా  చెకప్ చేయించుకుంటం వల్ల జబ్బు తొలి దశ లోనే గుర్తించే వీలు ఉంటుంది. అందుకని  కంటి చూపు మందగించే వరకు చెకప్ చేయించుకోవటం కోసం ఆగకండి.

రెగ్యులర్ చెకప్ కాకుండా మీరు స్వయం గా పాటించాల్సినవి కొన్ని.....

స్మోక్ చేస్తారా?అయితే అర్జంట్ గా స్మోకింగ్ ఆపేసెయ్యండి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కంటికి సంబందించిన చాలా సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.(మాకులర్* డి జనరేషన్  తో సహా)


మీరు తీసుకునే ఆహారం లో పళ్ళు,కూరగాయలు ఎక్కువగా,సాచురేటేడ్ ఫాట్స్, hydrogenated oils తక్కువగా ఉండేలా చూసుకోండి. 


నమ్మకం:కళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వల్ల ,కళ్ళజోడు రించటం వాయిదా వేయవచ్చు.


నిజం:కంటి  వ్యాయామాలు  చేయటం వలన కంటి చూపు మెరుగు పడటం ,కళ్ళద్దాలు ధరించే అవసరాన్ని వాయిదా వేయవచ్చు అనేది నిజం కాదు.కంటి చూపు....కన్ను ఆకారం,కణాల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది.వ్యాయామం చేయటం వలన కంటి ఆకారం కానీ,కణాల ఆరోగ్యం లో కానీ ఎలాంటి మార్పు ఉండదు.



నమ్మకం:తక్కువ కాంతి లో చదవటం వల్ల కంటి చూపు దెబ్బ తింటుంది.


నిజం:కంటి చూపు దెబ్బ తినదు కానీ,తక్కువ కాంతి లో చదవటం వలన కళ్ళు తొందరగా అలసిపోతాయి.బెస్ట్ పొజిషన్ ...కాంతి డైరెక్ట్ గా మనం చదువుతున్న పేజీ మీద పడేలా చూసుకోవటం.డెస్క్ లాంప్ పెట్టుకుని చదువుకోవటం ఉత్తమం. 


నమ్మకం:కారట్లు తినటం కళ్ళకు మంచిది.

నిజం:ఇందులో కొంతవరకు నిజం ఉంది.కారట్ల లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిదే కానీ ... కారట్లు  కంటే కూడా తాజా పళ్ళు,ఆకుకూరల్లో,యాంటి -ఆక్సిడెంట్లు,సి,ఈ విటమిన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ...వాటిని ఎక్కువగా తీసుకోవటం మంచిది.
సో మీ పిల్లలు కారట్లు తినటానికి మారాము చేస్తుంటే ,వాళ్ళతో బలవంతంగా తినిపించకుండా...పళ్ళు,ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వండి.పళ్ళు,ఆకుకూరలు తినటం ద్వారా మరియు విటమిన్ సప్లిమెంట్లు వాడటం ద్వారా  హ్రస్వద్రుష్టి,దూరదృష్టి సమస్యలను సరిచేయలేము.

నమ్మకం:కళ్ళద్దాలు ఎప్పుడూ ధరించనక్కరలేదు.

నిజం:హ్రస్వ దృష్టి ఉన్నవారు చదివేటప్పుడు తప్పకుండా కళ్ళద్దాలు ధరించాలి,లేదంటే కళ్ళకు శ్రమ కలుగుతుంది.

నమ్మకం:రోజంతా కంప్యూటర్ ముందు గడపటం కళ్ళకు మంచిది కాదు

నిజం:కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు గడపటం కళ్ళకు హాని కలిగించదు కానీ,కళ్ళకు శ్రమ కలిగించి త్వరగా అలసిపోయేలా చేస్తుంది.త్వరగా అలసిపోకుండా,కళ్ళకు శ్రమ తగ్గించేందుకు,ప్రతి గంటకు ఒకసారి కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఎక్కువ సార్లు కళ్ళు ఆర్పుతూ  ఉంటె కళ్ళు పొడిబారకుండా ఉంటాయి.

*Age related macular degeneration is a medical condition which usually affects older adults that results in a loss of vision in the center of the visual field (the macula) because of damage to the retina. . It is a major cause of visual impairment in older adults (>50 years).Macular degeneration can make it difficult or impossible to read or recognize faces, although enough peripheral vision remains to allow other activities of daily life .

1 comment:

Unknown said...

నిజంగా చాలా సందేహాలు తీరాయండి...