Sunday 26 June 2011

మానవ స్వభావం


మనుషులు మారిపోయారు ,ఆప్యాయతలు ,అనుబంధాలు  ఏమీ లేవు .వట్టి డబ్బు మనుషులయిపోయారు .ప్రస్తుతం ఎవరి నోటివెంటైన ఇలాంటి మాటలే వింటున్నాము.ఇది నిజమేనా?వేష భాషలు మారి ఉండవచ్చు.ఆచార వ్యవహారాలు మారి ఉండవచ్చు.కాని మానవ సహజ స్వభావం మాత్రం నాలుగు వందల ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.ఏంటి ,నమ్మబుద్ది కావటం లేదా? అయితే 17వ శతాబ్దానికి చెందిన శతక కారులు రాసిన ఈ పద్యాలు చదవండి.మీరు నిజమేనని ఒప్పుకొంటారు .


విత్తము గలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
పేదవాని ఇంట బెండ్లయిన నెఱుగరు
విశ్వదాభి రామ వినుర వేమ!


ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బందువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ!

చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ!


No comments: