Sunday 9 October 2011

గత వారం లో నేను చూసిన సినిమాలు




దూకుడు రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా చూసిన మా అబ్బాయి ,నాకు ఫోన్ చేసి అమ్మా దూకుడు చాలా బాగుంది.మీరు కూడా చూడండి అని చెప్పాడు.మా పిల్లలిద్దరూ మహేష్ బాబు కి వీరాభిమానులు.ఇక అది విన్న దగ్గర్నుంచి మా అమ్మాయి ఒకటే నస,ఎప్పుడు వెళ్దాము అని.సమ్మె ఆగి పోనీ వెళ్దాము తొందరేముంది అని నేను అన్నాను.సమ్మె ఆగలేదు...మా అమ్మాయి నస ఆగలేదు.సరే వీకెండ్ కి టింకూ వస్తాడు గా అప్పుడు వెళ్దాము లే అన్నాను.ఖలేజ సినిమా చూసిన షాక్ లో నుంచి ఇంకా తేరుకోలేదు,మళ్ళీ ఈ సినిమా ఎలా రా బాబు చూడటం అని బాధ పడుతూ....మొన్న మొన్నటి వరకు ఆయన గారి కోసం నా ఇష్టాన్ని   త్యాగం చేసి కృష్ణ సినిమాలు చూసాను,ఇప్పుడు పిల్లల కోసం త్యాగం చేసి మహేష్ సినిమా ని చూద్దాము అని డిసైడ్ అయ్యి త్యాగ శీలి వమ్మ మహిళా అనురాగ శీలి వమ్మ అని మనుసులోనే పాడేసుకున్నాను.
సరే మా అబ్బాయి వచ్చిన తరువాత సినిమా కు వెళ్దామంటే టికెట్స్ దొరక లేదు.నువ్వు సినిమా చూపించే లా లేవు నేను మా ఫ్రెండ్ దగ్గర్నుంచి తీసుకొస్తాను చూద్దాము అని ఒక 5  సినిమాలు తీసుకుని వచ్చింది.రోజుకొకటి చొప్పున ఈ వారం లో ఆ 5  సినిమాలు చూసాము.

దూకుడు సినిమా చూస్తున్నంత సేపు ..గుర్తుకొస్తున్నాయి అని పాడుకుంటూ ఉన్నాను.ఎందుకంటే ఆ సిన్మా చూస్తుంటే నాకు పోకిరి,రెడీ,డీ,ఘర్షణ సినిమాల లోని సీన్స్ గుర్తుకొచ్చాయి.సినిమా లో కామెడి ఏమన్నా  ఉందంటే అది మహేష్ బాబు డాన్స్.మహేష్ డాన్స్ కి నేను నవ్వుతుంటే ,నవ్వావంటే నేను ఊరుకోను అని మా అమ్మాయి హెచ్చరికలు.కనీసం ఒక్క పాట కూడా విన సొంపు గా లేదు.

బాడీగార్డ్ -  సినిమా గొప్ప గా లేకపోయినా కొంచం నవ్వు కోవచ్చు.పర్వాలేదు.ఒకసారి చూడవచ్చు.తేరి మేరి ,మేరి తేరి ప్రేమ్ కహాని ముష్కిల్...ఈ పాట చాలా బాగుంది.

మౌసం-సాగ తీత సినిమా .విలన్ లు ఎవ్వరూ ఉండరు,పరిస్థితులే విలన్లు.సినిమా చూడాలంటే కొంచం కష్టమే.ఈ సినిమా లో రెండు పాటలు బాగున్నాయి.

BOL -చాలా మంచి సినిమా.నాకు బాగా నచ్చింది.డాన్స్ లు,ఫైట్ ల కోసమే సినిమాలు చూసే వారికి నచ్చక పోవచ్చు.హోనా తా ప్యార్ అనే పాట బాగుంది.

మనీ,మనీ మోర్ మనీ-చివరలో కొంచం బోర్ అనిపించినా సినిమా మొత్తం కూడా నవ్వు కోవచ్చు.పర్వాలేదు ,ఒకసారి చూడొచ్చు.

No comments: