Sunday 18 December 2011

ప్రేమంటే....

కొన్ని కొన్ని పదాలను నిర్వచించడం చాలా కష్టం.అలాంటి ఒక పదం ప్రేమ.
తల్లి తండ్రులకు తమ బిడ్డల పై ప్రేమ ఉంటుంది.
సోదరీ సోదరులకు తమ తోబుట్టువుల పైన...
భార్యకు,భర్త పైన....భర్తకు భార్య పైన...
స్నేహితులకు ఒకరి పైన ఒకరికి ప్రేమ...
ప్రేమ అనేది ఒక అనుభూతి,దాన్ని నిర్వచించలేము.

పైన ఉదహరించిన ప్రేమలన్నీ కూడా,ఏదో ఒక సంబంధం వారి మధ్య ఉండటం వల్ల కలిగినది.(రక్త సంబంధం,స్నేహ సంబంధం)అసలు ఏ సంబంధం లేకుండా మన చుట్టూ ఉన్న మనుషుల మీద ప్రేమ తో మెలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది?ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా వారి పట్ల ప్రేమతో మెలగడం ఎంతమందికి సాధ్యమవుతుంది?

ప్రస్తుత కాలం లో ప్రేమ అంటే యువతీ యువకులకు సంబందించిన విషయం గా మారిపోయింది.దీనికి మీడియా,సినిమాలు ప్రధాన కారణం.తాము ఇష్టపడిన అమ్మాయి తమను ఇష్టపడక పొతే యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు సర్వ సాధారణ విషయాలు గా మారిపోయాయి.ప్రేమ అంటే తీసుకోవడం కాదు,ఇవ్వడం అని చెప్పిన గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ ప్రేమంటే  నాకు నచ్చింది.ఈ కథ లో నాయిక,నాయక పాత్రలు ప్రేమంటే 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అని తెలియ చెపుతారు.

ఈ కథ లో నాకు నచ్చిన అంశాలు:

1.ఇప్పటి పిల్లలను మనం చూస్తూనే ఉన్నాము,చిన్న చిన్న వైఫల్యాలకే కుంగి పోయి ఆత్మహత్యలు చేసుకోవడం.కానీ శశాంక్‌ అంధత్వానికి గురైనప్పటికీ తన వైకల్యం గురించి  కుంగిపోకుండా ,తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ గ్రూప్ కి మారి చదువు లో విజయాన్ని సాదించటం ఎంతో స్పూర్తినిచ్చే విధం గా ఉంది.
2.శశాంక్ వయసుకు మించిన పరిణితి చూపించడం.తనకు అంధత్వం ప్రాప్తించినదని తెలిసిన తరువాత.... నువ్వు నన్నింకా ప్రేమిస్తూ ఉండాలని ఆశపడటం దుర్మార్గమవుతుందని నాకనిపిస్తోంది దృశ్యా !లవ్ నెవర్ క్లెయింస్, ఇట్ ఆల్వేస్ గివ్స్! చూపులేని నేను నీలాంటి అందమైన అమ్మాయి స్నేహాన్నీ, ప్రేమనీ కోరుకోవడంలో స్వార్థం ఉంటుందనిపిస్తోంది. అందుకే ప్లెయిన్‌గా చెప్పేస్తున్నాను. నేను నీకు రైట్‌ఛాయిస్‌ని కాను అని చెప్పటం బాగుంది. 
౩.ఇక ఈ కథ లో ఇంకో ముఖ్యమైన పాత్ర దృశ్య.చాలా సాధారణమైన అమ్మాయి.చదువుకునే రోజుల్లో ఆ వయసుకు తగ్గట్లు ప్రవర్తించినా ,ప్రేమలో మోసపోయి తిరిగి శశాంక్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది.తను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి తిరిగి తన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే,కోరుకున్నది దక్కుతున్నది అని సంబర పడకుండా, శశాంక్ తనకు పెళ్లి అయ్యిందని అబద్దం చెప్పటం(దృశ్య తన మీద జాలి తో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.) ...అది, దృశ్య ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవటానికి కారణ మవటం బాగుంది.
4.దృశ్య... శశాంక్ కి పెళ్లి అయిపొయింది కాబట్టి ఇక తన గురించి నాకు ఎందుకు లే అని అనుకోకుండా "ప్రేమంటే 'ఇవ్వడం' అన్న మాటను నమ్మి శశాంక్ కు  చూపు 'ఇవ్వడం' కోసం మూడేళ్ళపాటు నిద్రాహారాలు లెక్కచేయకుండా పరిశోధనలు జరిపి శశాంక్ చూపు తెప్పించడం.ఇది కొంచం నాటకీయం గా ఉన్నా కథ కాబట్టి అంత పట్టించుకోనక్కర లేదనుకుంటున్నాను. 
5.శశాంక్ దృశ్య ను పెళ్లి చేసుకుందామా అని అడగటం.అంతకు ముందు దృశ్య తన మీద జాలి తో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.ఇప్పుడు ఆ సందేహం తీరి పోవటం తో శశాంక్ తనే దృశ్య కు ప్రొపోజ్ చేయటం బావుంది.
౬.ఇక పొతే ఉప సంహారం
"ప్రేమించడాన్నీ...ప్రేమంటే 'ఇవ్వడం' అన్న భావననీ కేవలం 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అన్న ఆలోచనకు కార్యరూపం  గా  ఉచితం గా పేదవారికి సేవ చేయటం కోసం హాస్పిటలూ, ఆశ్రమ పాఠశాల నిర్వహించటం .  
ఇవ్వడంలోని ఆనందాన్ని చిన్న  వయసునుండే వాళ్ళ పాప మానస కు నేర్పటం...

 శశాంక,దృశ్య లాంటి వాళ్ళు మరింత మంది మన సమాజం లో ఉంటే స్వర్గం ఇల లోనే ఉంటుంది కదా!ప్రస్తుతం  ఇలాంటి పాజిటివ్ ఆలోచనలును పెంపొందించే కథల అవసరం ఎంతైనా ఉంది.

పూర్తి కథ చదవటానికి.... 

7 comments:

Sai said...

చాలా బాగుంది ఆ కధ....ధ్యాంక్యూ షేర్ చేసుకున్నందుకు....

Anuradha said...

U R Welcome Sai garu.

Lasya Ramakrishna said...

very nice review.....

Anuradha said...

థాంక్యూ లాస్య గారు.

Lasya Ramakrishna said...

anuradha garu.

meeru na blog ni oka sari visit chesi suggestions ivvagalaru.

http://serialmutchata.blogspot.com/

Anuradha said...

లాస్య గారు,
మీ బ్లాగ్ లో కామెంట్ రాశాను,చూడండి. :)

Lasya Ramakrishna said...

Thank you anuradhagaru...