Thursday, 24 May 2012

పుట్టిన రోజు




హ్మ్ !ఇవాళ నా పుట్టిన రోజు.ఇన్ని సంవత్సరాలలో సాధించినది ఏమీ లేదు.ఒక్కోసారి ఏమిటి ఈ జీవితం?ఎందుకు బ్రతుకుతున్నాము అని అనిపిస్తుంది.జీవన తరంగాలలో ఈ  పాట విన్నప్పుడు మరీనూ!



పాటలు పాడటం రాదు,కథలు ,నవలలు రాయటం రాదు...కనీసం వంట చేయటం కూడా రాదు.
తినటం,కాసేపు టివి చూడటం,కాసేపు అంతర్జాలంలో విహరించటం ఇంతకు  మించి చేస్తున్నది ఏమీ లేదు.
ఉపయోగ పడే పని ఒక్కటీ చేయటం లేదు.ఎన్నాళ్ళు ఇలా బ్రతకటం?నేను ఏమి సాదించ లేనా?ఇలా అనుకోవటమే కాని ఏదన్నా సాదించటానికి చేతలు లేకపోవటం తో ఏమి సాదించలేదు.
ఇలా నిరాశ నిస్పృహలు ఆవహించినప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట.ఎలా అనగా ...
పాటలు పాడటం రాకపోతే ఏముంది?పాటలు విని ఆనందించటం వచ్చు కదా?వినేవాళ్ళే లేకపోతే పాడేవాళ్ళు ఎవరికోసం పాడుతారు.
కథలు రాయటం రాకపోతే ఏమయ్యింది.చదివి ఆనందించటం వచ్చు కదా?చదివే వాళ్ళే లేకపోతే రచయితలు ఎవరి కోసం రాస్తారు?ఇలా అన్నమాట :)
సో, మనం ఎందుకు పనికిరాము ,ఏమీ సాదించలేదు అని అనుకోనవసరం లేదు.పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక 
పర్పస్ ఉంటుంది.కొంతమంది పర్పస్ కొత్త విషయాలు కనుక్కోవటం,పాటలు పాడటం,కథలు రాయటం ,వగైరా వగైరా.
మనలాంటి వాళ్ళ పర్పస్ కనుక్కొన్న వాటిని తెలుసుకుని ,అవసరమైతే ఉపయోగించుకోవటం,పాటలు విని 
ఆనందించటం,కథలు చదివి ఆనందించటం వగైరా వగైరా.


పుట్టిన రోజు సందర్భం గా ఈ కేక్ మీ కోసం.



12 comments:

జ్యోతి said...

పుట్టినరోజు శుభాకాంక్షలు అనురాధ..

రాజ్ కుమార్ said...

హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలండీ..

కేక్ బాగుందండీ ;)

నిరంతరమూ వసంతములే.... said...

మీ self motivation tips బాగున్నాయి.
పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు అనూ రాధ గారు!
Many Many Happy Returns of the Day!

Best Wishes,
Suresh Peddaraju

Unknown said...

అనురాధ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు :)
పోస్ట్ బాగుంది

Unknown said...

nice... Happy Birthday...

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

____________________
పాటలు పాడటం రాకపోతే ఏముంది?పాటలు విని ఆనందించటం వచ్చు కదా?వినేవాళ్ళే లేకపోతే పాడేవాళ్ళు ఎవరికోసం పాడుతారు.
కథలు రాయటం రాకపోతే ఏమయ్యింది.చదివి ఆనందించటం వచ్చు కదా?చదివే వాళ్ళే లేకపోతే రచయితలు ఎవరి కోసం రాస్తారు?ఇలా అన్నమాట :)
సో, మనం ఎందుకు పనికిరాము ,ఏమీ సాదించలేదు అని అనుకోనవసరం లేదు.పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది.కొంతమంది పర్పస్ కొత్త విషయాలు కనుక్కోవటం,పాటలు పాడటం,కథలు రాయటం ,వగైరా వగైరా.
____________________

బాగా చెప్పారండి! బాగా నచ్చేశాయి మీరు చెప్పిన విషయాలు.

పుట్టినరోజు మేలుతలపులు, అనూరాధ గారూ :-)

గిరీష్ said...

Happy b'day.. :)

Sravya V said...

పుట్టినరోజు శుభాకాంక్షలు అనూరాధ గారూ !
Thanks for the cake :)))

ఆ.సౌమ్య said...

పుట్టినరోజు మేల్తలపులు అనూరాధగారు! :)

శ్రీనివాస్ పప్పు said...

"పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది.కొంతమంది పర్పస్ కొత్త విషయాలు కనుక్కోవటం,పాటలు పాడటం,కథలు రాయటం ,వగైరా వగైరా.
మనలాంటి వాళ్ళ పర్పస్ కనుక్కొన్న వాటిని తెలుసుకుని ,అవసరమైతే ఉపయోగించుకోవటం,పాటలు విని
ఆనందించటం,కథలు చదివి ఆనందించటం వగైరా వగైరా"

బాగా చెప్పారు అనూరాధగారూ,పుట్టినరోజు శుభాకాంక్షలు.కేకు చాలా బాగుందండీ థాంక్స్

rajachandra said...

పుట్టినరోజు శుభాకాంక్షలు అనురాధ గారు

Anuradha said...

జ్యోతి గారు,రాజ్ గారు,సురేష్ గారు,శేఖర్ గారు,ప్రసీద గారు,భాస్కర్ గారు,గిరీష్ గారు,శ్రావ్య గారు,సౌమ్య గారు,శ్రీనివాస్ గారు,రాజా చంద్ర గారు
హృదయపూర్వక ధన్యవాదాలు అండి.