పరీక్షలు పాసవుతానా లేదా అని బెంగపడలేదు
ఆటలాడేటప్పుడు దెబ్బలు తగులుతాయని భయపడలేదు
దెబ్బలు తగిలించుకున్నాక ,ఈ దెబ్బలు ఎప్పటికి మానుతాయో అని బెంగపడలేదు
కనిపించని బూచులు గురించి చెప్పి అమ్మ భయపెట్టినప్పుడూ భయపడలేదు
ఒకవేళ నిజంగా ఆ బూచులు ఎదురయితేనో అని బెంగపడలేదు
ఆ తరువాయి జీవితం లో ఎదురయిన తూఫాన్ లకు భయపడలేదు
సమస్యలు ఎదురయినప్పుడు పరిష్కారం ఏమిటా అని బెంగపడలేదు
కానీ,తమ స్వార్ధం కోసం ఇతరులను బలి ఇచ్చే మనుషులను చూసి భయపడుతున్నాను
అసూయతో,ద్వేషంతో మనుషులు మాట్లాడే మాటలకు భయపడుతున్నాను
ఇతరులను మాటలతో బాధించి పైశాచిక ఆనందాన్ని పొందే మనుషులను చూసి భయపడుతున్నాను
అవును!నేను కనిపించని ఆ దెయ్యాలకు కాదు,నా చుట్టూ ఉన్న మనుషులకి భయపడుతున్నాను.
ఈ మనుషులు ఎప్పటికైనా మారతారో,లేదో అని బెంగపడుతున్నాను
No comments:
Post a Comment