మన తెలుగు వాళ్లకి తెలుగు మాట్లాడాలంటే నామోషీ.ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు కలసినా తెలుగు తప్పించి వేరే బాష లో మాట్లాడుకుంటారని ఒక అపవాదు.ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అనుకోండి.కానీ తెలుగు లో మాట్లాడేవారి తెలుగు లో తెలుగు ఎంత అన్నది ఒక అనుమానం.
మనం ప్రొద్దున లేచిన దగ్గర్నుంచి మాట్లాడే బాష లో తెలుగు కంటే ఇతర బాషా పదాలే ఎక్కువేమో!
పళ్ళు తోముకోము .బ్రష్ చేస్తాము.
టాయిలెట్ కి వెళతాము.మరుగుదొడ్డి అనే మాట ఎప్పుడో మర్చిపోయాము.
కప్పు కాఫీ నో టీ నో తాగుతాము.టీ అంటే తేనీరు అని తెలుసు కానీ కప్పు ,కాఫీ కి తెలుగు సమానార్ధం ?
పలహారం చేయము బ్రేక్ ఫాస్ట్/టిఫిన్ చేస్తాము.
అట్టు అనే పదం మోటు .దోశ అందరికి తెలిసినది.
సాంబారు సరే సరి -అరవం
పచ్చడి చట్నీ అయిపొయింది.
షర్ట్ ముద్దు.చొక్కా పాతబడిపోయింది.
వరండా అనే ఇంగ్లీష్ పదం నిలిచి పోయి వసారా ,పంచపాళీ అనే పదాలు మరుగునపడ్డాయి.
గ్లాసు,ప్లేట్,స్పూను ...
టి.వి.,ఫోను,ఫ్రిడ్జ్ ,వాషింగ్ మెషీను,గ్రయిండరు,కంప్యూటర్ ,టేబులు ...
బస్సు,కారు,సైకిలు ...
పెన్ను,పెన్సిలు,షార్పనర్ ....
తెలుగీకరించిన ఇంగ్లీష్ పదాలు .
ఇవి కొన్ని నాకు తట్టినవి.ఇంకా అలా తెలుగు బాష లో చేరిన ఇతర బాషా పదాలు చాలా ఉండి ఉంటాయి.
పల్లెటూళ్ళ లో ఇప్పటి బాష ...
సాల్ట్ ఉప్పు వేసుకుంటారా?
ఫలానా వాళ్లకు హార్ట్ వచ్చింది.(గుండె నొప్పికి వచ్చిన తిప్పలు )...ఇవి మచ్చుకి కొన్ని ...
గమనిక:ఇది కాల క్షేపానికి రాసినది.ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని మనవి. :)
No comments:
Post a Comment