Monday, 25 February 2013

ప్రయాణం లో పదనిసలు
ఒకానొక రోజు బస్ లో ప్రయాణిస్తున్న నాకు ,నా సహ ప్రయాణికురాలికి మధ్య జరిగిన సంభాషణ .
ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారు అయ్యారు అన్న దగ్గర్నుంచి రాజకీయాలు,అవినీతి ,ధరల పెరుగుదల మొదలైన విషయాల గురించి ఏకధాటిగా మాట్లాడారు. ఈ విధంగా ధరలు పెరిగితే సామాన్యుడు ఏం తింటాడు,ఏం బ్రతుకుతాడు అని అంటూ ఉంటే నేను ఊ కొడుతూ  బుద్ధి గా వింటూన్నాను. 
మాది వైజాగ్. మెహదీపట్నం లో ప్రార్ధనలు ఉంటె వెళుతున్నాను . నా వయసు 65 ఏళ్ళు . ఈ వయసు లో ఎందుకు అంత దూరం వెళ్ళటం అని మా అమ్మాయిలూ,మనవడు వద్దు అన్నా వెళుతున్నాను. అంతా ఆ ప్రభువే చూసుకుంటాడు .కాశీ చూసాను . ఇంకా చాలా పుణ్య క్షేత్రాలు చూసాను. కానీ నాకు ఆ ఏసు ప్రభువు ను నమ్ముకున్నాకే అంతా మంచి జరిగింది. ఇవాళ రాత్రి ఇది కావాలని కోరుకుంటే మరుసటి రోజు అది దొరికేది. ఉద్యోగం కావాలనుకున్నాను ,ఇచ్చాడు . ఇల్లు కట్టుకోవాలనుకున్నాను . కట్టుకున్నాను . ఇప్పటికే మనవాళ్ళు చాలా మంది ఆ ప్రభువు ను నమ్ముకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభువు ను నమ్ముకోవాలని ప్రార్ధన చేస్తున్నాను. అందరికీ ప్రభువు ఆ ఏసు అయ్యే రోజు కోసం చూస్తున్నాను .  నీ పేరు చెప్పమ్మా . నీ కోసం కూడా ప్రార్ధన చేస్తాను. పేరు చెప్పాను.      
    
ఆ తర్వాత  సంభాషణ ప్రశ్నల పర్వం లోకి మళ్ళింది.  

ఆమె: ఉద్యోగం చేస్తున్నావా?
నేను: లేదండి . 
ఆమె:ఎందుకు చెయ్యటం లేదు ,ఉద్యోగం చెయ్యొచ్చు గా. 
నేను ఆరోగ్యం బాగోదు . 
ఆమె: ఏమిటి ప్రాబ్లం?
నేను:  *****
ఆమె: ప్రార్ధన జరిగే చోట ఒక చిన్న బాటిల్ లో నూనె అమ్ముతారు. పది రూపాయలే !ప్రొద్దున్నే మొహం కడుక్కొని మూడు చుక్కలు నోట్లో వేసుకుని ఏసు జయం అనుకుంటే చాలు ,ఇక మళ్ళీ అనారోగ్యం అంటూ ఉండదు . 
నేను:  నేను అలాంటివి అన్నీ నమ్మను అండి . 
ఆమె: ఒక్కసారి ఏసు ను నమ్ముకో . అంతా మంచే జరుగుతుంది. 
నేను ఏ దేవుడ్ని నమ్మను అండి . అయినా గీత లో మన మతం ఎంత చెడ్డ దయినా పర మతం లో కి మార కూడదు అని చెప్పారు కదా. 
ఆమె: హిందూ మతం చెడ్డదని చెప్పటం లేదు. ఏసు ని నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెపుతున్నాను. 
నేను: మంచో,చెడో హిందూ మతం లో పుట్టాను ,ఆ మతం లోనే ఉంటాను ... 
ఇక మాటలు లేవు :)   
  5 comments:

Anu said...

i 2 faced the same situation..i seen many christ believers boosting up about their religion and forcing us to change our beliefs ur answer is just aweome

Anuradha said...

అలా చెప్పినావిడ, హిందూ మతం నుంచి ఆ మతం లోకి మారినావిడే అను గారు.మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

hema said...

చాల మంది మతం మారుతున్నారు కానీ
రిజర్వేషన్లు కొరకు పాత మతాన్ని వదలడం లేదు
ఉదాహరణకు SC నుంచీ క్రిస్టియన్ కు మారినవారు BC-C
కి మారాలి, కానీ అలా
మరడంలేదు క్రిస్టియన్ గ కొనసాగుతూ SC రిజర్వేషన్లు పొందుతున్నారు.

Anuradha said...

హేమ గారు,
రిజర్వేషన్స్ గురించి పెద్దగా తెలియదండి.

పిడక said...

ఆ మతం ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటిది.
ఏజెంట్స్ లేకపోతే ఆ మతం బతికి కట్టలేదు. అందరు ఏజెంట్లే అందులో.
నేను కూడా చూసాను చాలా. ఇంటికి కూడా వచ్చి చెప్పబోతుంటే మా అమ్మ కర్ర పట్టుకుని తగులుకెల్లింది.
కించపరచడం కాదు కాని, బ్రతిమాలడం ఊహించుకుంటే బలే నవ్వొస్తుంది .
అదేదో సినిమా లో ఒకే ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలుతున్నట్టు ఉంది.