సినిమాలు చూస్తుంటే తర్వాత సీన్ ఏంటన్నది ఇట్టే ఊహించేయ్యోచ్చు . అలాగే నవలలు ,కతలు ... ముగింపు . చాలా వరకు మనం గెస్ చేసినట్లే ఉంటాయి. అలా మనం ముందే ఏమవుతుందో చెప్పేస్తుంటే పక్కన ఉన్నవాళ్ళకి ఆశ్చర్యం,అనుమానం . ఆశ్చర్యం సరే ,అనుమానం ఎందుకు అంటారా ? ముందే ఆ సినిమా చూసి ఉంటానేమో అని అన్నమాట . మనకి ఒక్కసారి చూడాలంటేనే పరమ చిరాకు. మళ్ళీ రెండో సారి చూడటం అసంభవం . ఆ సంగతి చెప్పినా వాళ్లకు అర్ధం కాదు,నమ్మరు . కానీ జీవితం అలా కాదు. మరుక్షణం ఏమవుతుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.ఎక్కడో ఒకరు ఉంటారేమో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగే అదృష్టవంతులు.బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు ,నీకిది వేడుక అని ఒక సినీ కవి గారు రాసారు . అది నిజమే . అంతా సాఫీ గా జరిగి పోతుంటే ఇంక వేడుక ఏమి ఉంటుంది?ఆ దేవుడ్ని ఎవరు గుర్తు చేసుకుంటారు ?
కొన్ని quotes చదువుతుంటే నవ్వు వస్తుంది. నీకేం కావాలో ,ఏది ఇవ్వాలో దేవుడి కి తెలుసు.నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దేవుడు అది నీకు అందేలా చేస్తాడు . నేను చూసినంతవరకూ ... just opposite.
Leo Tolstoy రాసిన God Sees The Truth But Waits, లో లా ఎప్పుడో జీవిత చరమాంకం లో ఉన్నప్పుడు చూస్తాడు . అప్పుడు ఇక కోరుకునేది ఏముంటుంది ,చావు తప్పించి . కానీ ఆ చావు ను తప్పించి వేరే ఏవో ఇస్తుంటాడు.నాకు తెలిసి దేవుడంత గొప్ప సాడిస్ట్ ఇక ఎవరు ఉండరేమో?జీవితం మిస్టరీ అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాను,ఇక అసలు విషయానికి వస్తాను.
ఆత్మలు ,పునర్జన్మలు ఉన్నాయా? కళ్ళతో చూసినా కూడా అన్నీ నమ్మెయ్యకూడదు అంటారు. మరి చూడని వాటి గురించి నమ్మటం కష్టం కదా !ఒకప్పుడు అలాంటి వాటిని నమ్మేదాన్ని కాదు ,ఇప్పుడు కూడా నమ్మాలో వద్దో తెలియని స్టేజ్ లో ఉన్నా అన్నమాట .
కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు ఆత్మీయులను కోల్పోయాను . సాధారణం గా నాకు కలలు రావు. ఒక రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన ...
ఒక కల. ఆ కల లో ... తలుపు శబ్దం విని తలుపు తీస్తే ఎదురు గా చనిపోయిన ఇద్దరూ . ఒక క్షణం నోట మాట రాలేదు . అప్రయత్నం గా నా నోటి నుంచి ,ఏమిటి మీరు చనిపోలేదా అనే మాటలు . మేము చనిపోవటం ఏమిటి?ఎవరు చెప్పారు నీకు ,మేము బతికే ఉన్నాము అని వాళ్ళు అనటం తో మరి ఇన్నాళ్ళు ఏమయ్యారు అని అడిగాను . వారి నుంచి సమాధానం ఏమీ లేదు,మెలకువ వచ్చింది . ఆ కల వల్ల కొంచం డిస్ట్రబ్ అయ్యాను,ఆ తర్వాత మర్చిపోయాను . ఈ ఇన్సిడెంట్ తర్వాత మా ఇంటికి రెండు పావురాలు ,రోజూ ఉదయం 7 గంటలకు రావటం మొదలు . అది కార్తీక మాసం . నెల రోజులు ,ఒకటే టైం కి వచ్చేవి . నేను రోజూ ఆ టైం కి పిట్ట గోడ మీద బియ్యం పోసేదాన్ని .ఒక్కొ క్క రోజు అన్నం,పెసలు పెట్టే దాన్ని. వేరే పావురాలు వస్తే వాటిని తరిమికొట్టి ,ఆ రెండు పావురాలు తినేసి వెళ్ళేవి . కార్తీక మాసం పూర్తయిన తర్వాత రోజు నుంచి రావటం మానివేసాయి . పక్కన డాబా మీదే ఉన్నా వచ్చేవి కావు . ఆ తర్వాత పండుగల రోజు వచ్చేవి.అప్పటి వరకు పట్టించుకోని నాకు సడన్ గా ఒక అనుమానం.చాలా సిల్లీ గా అనిపిస్తుంది. జరిగిన వాటిని తలచుకుంటే ఆ చనిపోయిన వ్యక్తులే ఈ పావురాల రూపం లో వచ్చారేమో,లేదా వారి ఆత్మలు ఆ పావురాల లో ఉన్నాయేమో ?ఇంకా సందిగ్ధం.