Wednesday, 31 July 2013

వెలలేని ఆభరణాలు ,బొమ్మలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసి దిగులు ఒక పక్క.జోరున వర్షం ఇంకో పక్క . విపరీతమైన చిరాకు ,ఏ పని చెయ్యాలనిపించటం లేదు.బాల్కనీ లో నుంచొని అలా వర్షాన్ని చూస్తూ ఉంటే ,రాలి పడిన కొబ్బరి మట్ట ఒకటి కనిపించింది . దాన్ని చూస్తే ,చిన్నప్పుడు ఆడిన ఆటలు జ్ఞాపకానికి వచ్చాయి.

కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి ఆ బొమ్మలకు అలంకరణ చేసి ఆ బొమ్మలకు పెళ్లి చేసే వాళ్ళం :)
అలంకరణకు బట్టలు - వూళ్ళో ఉన్న ఏకైక దర్జీ ,బాజీ గారి ని అడిగి తెచ్చే వాళ్ళం.సరే మరి పెళ్లి జరిపించే వాళ్లకు ఆభరణాలు కావొద్దూ! వాచీ ,ఉంగరం కొబ్బరి ఆకులతో చేసుకొనేవాళ్ళం.మరి ఆ బొమ్మలు ,ఆభరణాలు ఎలా ఉంటాయో చూడాలని ఉందా?అయితే చూడండి ... 




          



6 comments:

వేణూశ్రీకాంత్ said...

ఆభరణాలు భలే ఉన్నాయండీ :-)

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ భలే గుర్తు చేసారండీ అనూరాధ గారూ థాంక్యూ

పరుచూరి వంశీ కృష్ణ . said...

అద్భుతం అనూరాధ గారు ,భలే గుర్తు చేసారు ..మధ్య తరగతి జీవన సౌందర్యానికి ఇవే ప్రతీకలు .

Anuradha said...

థాంక్యూ - వేణు గారు,శ్రీనివాస్ గారు,వంశీ కృష్ణ గారు.
ఇలాగే తాటాకుతో కూడా చేస్తారు అండి.

Arbinda said...

Beautiful share . nice blog n pics :)

Anuradha said...

@Arbinda
Thank you for the visit & comment :)