Thursday, 6 March 2014

ఆడ పిల్లా ?వద్దు.

సుమారు ఒక పదేళ్ళ క్రితం సంగతి.మా ఆఫీస్ లో పని చేసే ఒకరు ... వాళ్ళావిడ గర్భవతి అని తెల్సిన దగ్గర నుంచి ,ప్రతి రోజూ -  అబ్బాయి పుడితే  ఎంత గ్రాండ్ గా పార్టీ ఇచ్చేది చెపుతూ ఉండేవారు.కొన్ని నెలల తర్వాత ఒకరోజు చాలా డల్ గా కనిపించారు.మేము అందరం ,ఏమయ్యిందండీ అలా ఉన్నారు ,నార్మల్ డెలివరీ యేనా ,ప్రాబ్లం ఏమి లేదు కదా ?అబ్బాయా ?అమ్మాయా? ఇలా ప్రశ్నల వర్షం కురిపించాము.ఆ ,మా ఆవిడ కోరిక నెరవేరింది అండి ,అమ్మాయి ! ఇద్దరూ క్షేమం గానే ఉన్నారు అని చెప్పారు. మరి ఎందుకండీ అంత డల్ గా ఉన్నారు ,పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు అని మళ్లీ అడిగాం.అసలే నేను బాధ లో ఉంటే పార్టీ ఏమిటండి ?స్వీట్స్ కూడ ఇవ్వటం లేదు అన్నారు .
అది విని ఆవేశం గా నేను ఒక లెక్చర్ దంచాను :)
ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు ఏమిటండి ?అమ్మాయి అయితే ఏమిటి ?అబ్బాయి అయితే ఏమిటి ?అయినా అబ్బాయిల కంటే అమ్మాయిలే చక్కగా చదువుకుంటున్నారు ,ఉద్యోగాలు చేస్తున్నారు ,తల్లితండ్రులను చక్కగా చూసుకుంటున్నారు వగైరా వగైరా  అన్నమాట :)
అయితే అతను ఇచ్చిన సమాధానం నన్ను కొంచం ఆలోచింపచేసింది. నేను చాలా సిల్లీ గా మాట్లాడానేమో అనిపించింది.
అమ్మాయి తక్కువ ,అబ్బాయి ఎక్కువ అనే ఉద్దేశం తో నేను అమ్మాయి వద్దు అనుకోలేదండి.అమ్మాయి పుట్టిన దగ్గర్నుంచి ,మనం చనిపోయే వరకూ కూడా అమ్మాయి రక్షణ గురించి  ఆలోచిస్తూనే ఉండాలి.తనకు ఏ చిన్న కష్టం వచ్చినా ,మనకే కదా బాధ !ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేవరకు ఆందోళనే !పెళ్లి అయిన తర్వాత ఆ వచ్చేవాడు,ఎలాంటి వాడో తెలియదు కదా !ఇలా చెప్పుకుంటూ పోయారు ,అవును మీరు చెప్పింది నిజమే అని
అన్నాను నేను .

పోయిన ఆదివారం సత్యమేవజయతే ప్రోగ్రాం చూసాక ,మన బిడ్డకు రక్షణ కల్పించలేని సమాజం లో   ఆడపిల్ల వద్దు అనుకోవటం లో తప్పు లేదు అనిపించింది.

 


        

1 comment:

Unknown said...

అబ్బ నిజమే అండి..ఆడవారిని దేవతలుగా పూజిస్తూ...ఆటబొమ్మలుగా నాశనం చెయ్యడం మనకే చెల్లింది.నిజంగా మనం మన సంస్కృతి గురించి గొప్పలు చెప్పుకుంటూబ్రతికేస్తున్నాం..ఆ నీడలో జరిగే అన్యాయాలు ఎవరూ పట్టించుకోవడం లేదు...ఆత్మవంచన చేసుకోవడం లో మనకి మనమే సాటి