ఫాదర్స్ డే ,మదర్స్ డే,వాలెంటైన్స్ డే ప్రాచుర్యం పొందినంతగా ఈ డే పొందలేదు అనుకుంటా ! మార్చ్ 20న ఈ ఆనందపు రోజు ను ఎంతమంది జరుపుకున్నారో తెలియదు. ఇలాంటి ఒక రోజు ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. అప్పుడప్పుడు మనం నవ్వటం మర్చిపొయాము ,నవ్వు నాలుగు విధాలా చేటు కాదు నలభై విధాల లాభం అందుకని హాయి గా నవ్వండి అంటూ రాసే ఆర్టికల్స్ చదువుతున్నాను. నిజమే ,నవ్వాలని నవ్వు ని గుర్తు చేసుకుని మరీ నవ్వాల్సి వస్తుంది. మనం దిగాలుగా ఉంటే ,అయ్యో ఏమయ్యింది అని అడిగే సానుభూతిపరులు చాలా మందే ఉంటారు కానీ ,నవ్వుతూ ఉంటే చూసి సహించే వాళ్ళు అసలు ఉండకపోవచ్చు లేదా అతి కొద్దిమంది ఉండొచ్చు. ఏదో ఒక పుల్ల విరుపు మాట అని మన సంతోషాన్ని ఆవిరి చేసే వరకు నిద్ర పట్టదు.
మన ఆనందాన్ని వ్యక్తపర్చకుండా మనలోనే అణచి వేస్తున్నామా ?ఇటీవల న్యూజీల్యాండ్ పరిశోధకులు తమ రిసెర్చ్ లో కనుగొన్నది అదే ! ఆనందాన్ని వ్యక్తపర్చటానికి జంకుతున్నామని ,దానికి కారణం సమాజమే అని ,సమాజం లో ఉన్న నమ్మకాలు అని ...
Do You Have an Aversion to Happiness?
ఇక్కడ చదవండి .
http://ivill.ag/1kZpW8R
1 comment:
మనం ఆనందంగా వున్నపటికన్నా భాధగా వున్నప్పుడే జనాలు మనదగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.ఆనందంగా వుంటే పక్కవాళ్ళకి అస్సలు నచ్చడం లేదండి ఈరోజుల్లో...అందరికీ మనకి సలహాలూ, సానుభూతి చూపడమే ఇష్టంగా వుంది.బహుశా అందుకే మన సంతోషాన్ని మనసులో దాచేసుకుంటున్నామేమో.
Post a Comment