స్థల పురాణం ప్రకారం ,దేవతలు హిరణ్యకశ్యపుని చంపటానికి స్వామి దాల్చిన ఉగ్రరూపాన్ని కాంచి ,అహోబల అని స్తుతించారు అంట.అందువల్ల అహోబిలం/అహోబలం అనే పేరు.ఈ క్రింది శ్లోకం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది.
"అహో వీర్యం,అహో శౌర్యం,అహో బాహుపరాక్రమ
నరసింహం పరం దైవం అహోబిలం అహోబలం "
ఇంకో కథనం ఏమిటంటే ,గరుడ తపస్సు చేసిన గుహ వల్ల అహోబిలం అనే పేరు వచ్చింది అని. ఇక్కడ నరసింహ స్వామి గుహలో వెలిశారు.
గుడి ప్రవేశ ద్వారం .
గుడి తెరవటానికి ఇంకా అరగంట టైం ఉండటం తో ,కొంతమంది గుడి ముందు శుభ్రం చేసి నీళ్ళు చల్లి ముగ్గులు వేసారు. మేము నలుగురైదుగురం కొండ పైకి వెళ్లి వరాహ నరసింహ స్వామి గుడి చూసి వచ్చాము.
No comments:
Post a Comment